వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుర్వేద సుభాషిత రత్నాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151.

భూమిని ఆశ్రయించి పుట్టిన ప్రజలు అన్నము నుండి పుట్టుచున్నారు. అన్నము అన్ని భూతముల కంటే జైష్ట్యమైనది . ఇందువలన అన్నం సర్వఔషధం అని చెప్పబడుతుంది.

పసుపు మున్నగు వానితో శరీరం రుద్దుకొనుట వల్ల దురద తగ్గును . శరీరం రంగు పెరుగును . శరీర కాఠిన్యం తగ్గును. నూనెతో శరీరం రుద్దుకొనుట వలన దురద తగ్గును మరియు చర్మదోషం తగ్గును.

what is meaning of Ayurveda Subhashita Gems

శరీర మర్దన వలన శరీర రక్తశుద్ది కలిగి సర్వదేహమునకు కాంతి కలుగును. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మామూలు నువ్వులనూనెతో మర్దన చేయవచ్చు . రోగావస్థలో ఉన్నప్పుడు నారాయణ , ప్రసారిణి , విషగర్భాది తైలమర్దన శ్రేయస్కరం.

విశ్రాంతిగా పడుకోవడం వలన పిత్త రోగము నశించును. మర్దన పద్దతి వలన వాతరోగం తగ్గును. వాంతుల వలన కఫదోషం తగ్గును.

దేహము నందు ఏర్పడు అనేక వ్యాధులకు లంఘనం ( ఉపవాసం ) పరమ ఔషధము . లంఘనం అనగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయుట . ముఖ్యముగా జ్వరం , అజీర్ణారోగాదుల యందు ముఖ్యచికిత్స లంఘనము .

జలవస్తి కర్మని అభ్యసించినచో రసరక్తాధి ధాతువులు , శ్రవణేంద్రియములు , మనస్సు ప్రసన్నత నొందును. శరీరకాంతి పెరుగును . జఠరాగ్ని పెరుగును . సకలరోగములు నశించును. జలవస్తి క్రియ నీటియందే వేయవలెను . శుష్కవస్తి క్రియ భూమి మీద మాత్రమే వేయవలెను .

సూర్యుడు ఆకాశం నందు ఉండి భూమియందలి రసములను ( నీటిని ) పీల్చునట్లు వస్తి క్రియ చేయడం వలన జీర్ణాశయం నుండి , శిరము నుండి పాదాల వరకు వ్యాపించి ఉన్న సర్వదోషములను శరీరం నుండి బయటకి పంపును.

ఘృతము , సైన్ధవ లవణము , ఇంగువతో కలిసియున్న మజ్జిగను నిత్యము తాగుచున్న సర్వరోగములను హరించును .

వాతరోగమున పులిసిన మజ్జిగని ఉప్పు కలిపి త్రాగిన , పిత్తరోగము నందు తీయగా ఉండు మజ్జిగని చక్కర కలిపి తాగవలెను . కఫదోషము నందు శొంఠి , పిప్పలి , మిరియాల చూర్ణం , ఉప్పు కలిపిన మజ్జిగ సేవించవలెను .

వేసవికాలం నందు బెల్లము మరియు కరక్కాయ సమాన భాగముగా , వర్షాకాలం నందు సైన్ధవ లవణముతో , శరత్కాలం నందు చక్కెరతో కలిపినదానిని , చలికాలము శొంఠిపొడితో , శిశిర ఋతువు నందు పిప్పలితో కూడి , వసంతమున తేనెతో కలిపి కరక్కాయ సమాన భాగములుగా సేవించుచున్న రోగములు అన్నియు నశించును.

English summary
what is meaning of Ayurveda Subhashita Gems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X