వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు కర్తరీ అంటే ఏంటీ ? ఆ సమయంలో ఏం చేయాలి ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్తరీ నిర్ణయం సూర్యుడు భరణీ నక్షత్రం మూడవ పాదము నందు ప్రవేశించు కాలమే డోల్లుకర్తరీ ప్రారంభమగును.దీనినే చిన్న కర్తరీ అని కుడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం నందు ప్రవేశించు కాలమే నిజ కర్తరీ ప్రారంభం అవుతుంది.సూర్యుడు రోహిణీ నక్షత్రం రెండవ పాదం నందు ప్రవేశించు కాలమే కర్తరీ త్యాగం జరుగుతుంది.

ఈ కర్తరీ దినములలో వాస్తు సంబంధమైన నూతన గృహా ఆరంభ ,గ్రహ ప్రవేశాదులు చేయరాదు.అందుకే కొందరు పెద్దలు దీనిని వాస్తు కర్తరీ అని కుడా అంటారు.

what is meaning of vastu kartari

కర్తరీలో చేయదగిన కార్యములు :- సూర్యుడు భరణి ,కృత్తిక నక్షత్రము నందు ఉండు కాలంలో వివాహాలు ,యజ్ఞము,మందపాదులు కట్టుట మున్నగునవి చేయవచ్చును.

కర్తరీలో చేయకూడని కార్యములు :- కర్తరీలో శంఖుస్థాపన,ద్వారములు పెట్టుకునుట,ఇంటి పై కప్పులు స్లాబ్లు వేయుట చేయరాదు,వీటితో పాటు చెట్లు నరుకుట ,విత్తనములు వేయుట ,భూమిని తవ్వుట,కొత్త గ్రామములు కట్టుట,క్షౌరం (కటింగ్ ) చేయించుకునుట,తోటలు వేయుట ,చెరువులు,బావులు తవ్వుట ,కొత్త బండి ఎక్కుట మొదలగు కార్యములు చేయరాదు.

5-మే -2019 ఉదయం 5 :10 నిమిషాలకు వికారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం రోజు డొల్లు కర్తరీ ప్రారంభం అవుతుంది.

11 మే 2019 రాత్రి 3 :15 నిమిషాలకు వికారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శనివారం సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించుట చేత నిజ కర్తరీ ప్రారంభం అవుతుంది.శనివారం 25 మే 2019 రోజున నిజకర్తరీ త్యాగం జరుగుతుంది.

29 మే 2019 బుధవారం కృష్ణపక్ష దశమి రోజు పగలు 12 :15 నిమిషాలకు సూర్యుడు రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించుట ద్వారా కర్తరీ త్యాగం జరుగుతుంది.

English summary
The Kartaris decision of the year in Sri Vikari Nama is the starting point of the sunshine in the third star of the sun. The real divergence begins when the sun comes into the star. The sun is the time to enter the Rohini star in the second foot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X