వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్ : రుద్రాక్షలు అంటే ఏమిటి..? అవి ధరిస్తే చేకూరే ప్రయోజనాలేంటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రుద్రాక్ష అంటే :- రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటివారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట గమనిస్తూనే ఉన్నాం.

What is meant by Rudraksha and what is its importance?

రుద్రాక్షలు :- రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు బాదంకాయ లాగ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుదించుకుని గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

రుద్రాక్షలు రకాలు :- వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు. రుద్రాక్షల వివరాలు క్రింది తెలియజేయబడినవి.

ఏకముఖి ( ఒక ముఖము కలిగినది ) :- అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలనైనా తిప్పి కొట్టె శక్తిగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును

ద్విముఖి ( రెండు ముఖములు కలిగినది ) :- దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.

త్రిముఖి ( మూడు ముఖములు కలిగినది ) :- దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అగును.

చతుర్ముఖి ( నాలుగు ముఖాలు కలిగినవది ) :- నాలుగు వేదాల స్వరూపం. పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అధికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

పంచముఖి ( అయిదు ముఖాలు కలిగినది ) :- పంచభూత స్వరూపం. బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.

షణ్ముఖి ( ఆరు ముఖములు కలది ) :- కార్తీకేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగోడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

సప్తముఖి ( ఏడు ముఖాలు కలిగినది ) :- కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి , ఉత్తేజం కల్గును.

అష్టముఖి ( ఎనిమిది ముఖాలు కలిగినది ) :- విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

నవముఖి ( తొమ్మిది ముఖాలు కలది ) :- నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

దశముఖి ( పది ముఖాలు కలిగినది ) :- దశావతార స్వరూపం. శ్రీ మన్నారాయణుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

ఏకాదశముఖి ( పదకొండు ముఖాలు కలిగినది ) :- ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందమునకు, గర్భ సంబంధ రోగాలకు అనుకూలత లభించును.

పూజ ( దీక్ష )లలో వినియోగించే రుద్రాక్ష మాల సంఖ్య :- రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరించవలెను. వీటిని జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.

వైద్యంలో రుద్రాక్షలు:- రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అందరూ ధరించవచ్చును.

వ్యాపారంలో రుద్రాక్షలు :- మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థ 7 జూలై 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుద్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగుపండ్లలోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడతారు. మరి కొంత మందైతే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ద్ చేసి రంగులు వేసి ఏకముఖి లేదా ముఖ్యంగా మార్కెట్ లో వేటిని డిమాండ్ ఎక్కువగా ఉన్నాయో వాటిని నకిలీవి తయారు మోసగిస్తున్నారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు.

What is meant by Rudraksha and what is its importance?

నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని - నవముఖి
భరణి - షణ్ముఖి
కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి - ద్విముఖి
మృగశిర - త్రిముఖి
ఆరుద్ర - అష్టముఖి
పునర్వసు - పంచముఖి
పుష్యమి - సప్తముఖి
ఆశ్లేష - చతుర్ముఖి
మఖ - నవముఖి
పుబ్బ - షణ్ముఖి
ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి
హస్త - ద్విముఖి
చిత్త - త్రిముఖి
స్వాతి - అష్టముఖి
విశాఖ - పంచముఖి
అనురాధ - సప్తముఖి
జ్యేష్ఠ - చతుర్ముఖి
మూల - నవముఖి
పూర్వాషాఢ - షణ్ముఖి
ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం - ద్విముఖి
ధనిష్ట - త్రిముఖి
శతభిషం - అష్టముఖి
పూర్వాభాద్ర - పంచముఖి
ఉత్తరాభాద్ర - సప్తముఖి
రేవతి - చతుర్ముఖి.

ముఖ్య సూచన:- ఏ ముఖ రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పని సరిగా నియమ, నిబంధనలు పాటించవలయును, రుద్రాక్షలు ధరించి మధు, మాంసాహారం తీసుకో కూడదు. శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియనిగ్రహశక్తి ముఖ్య అవసరం. నిష్టాగా ఉండాలి, దాంపత్య అన్యోన్య సమయంలో రుద్రాక్షలు మేడలో ఉండరాదు. ఈ పద్దతులను ఎవరైతే ఆచారిస్తారో వారికే సత్ఫలితాలు కలుగుతాయి.

English summary
According to Hindu Mythology Rudrakhsa means it is the incarnation of lord Shiva. The water droplet or tear drop from Lord shiva's eye that fell onto the earth had turned out into small plants and then into tears is what Hindus believe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X