వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాద నమస్కారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

యోగాలో 'పాద శాస్త్రం' అనేది ఒకటుంది. పాదంలో ముఖ్యంగా అరిపాదాలలో మన శరీరంలో ఉన్న అవయాలకు సమ్బందించిన వాటిన్నింటికీ స్విచ్‌లు ఉంటాయి.ఎలా ఆన్‌ చెయ్యాలో తెలిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
చేతులు శక్తిమంతమైన పరికరాలు. మనలో ఒక రకమయిన సున్నితత్వం ఉంటే చేతులతో దేన్నయినా తాకితే మనం వెంటనే అదేమిటో తెలుసుకోగలుగుతాము.

మీరు దాన్ని మీ భుజాలతోనో వీపుతోనో లేక తలతోనో తాకితే అది ఏమిటో తెలుసుకోలేము.ఇది కేవలం అనుభూతి సున్నితత్వం మాత్రమే కాదు.కానీ మన శక్తిని ఎవరికైనా ప్రసరింపదలిస్తే పాదాలు చాలా శక్తిమంతమైన పరికరాలు. శరీరంలోని మొత్తం ఏడు చక్రాలూ మీ పాదాల్లో వ్యక్తమవుతాయి.పాదాలతో ఎలా వ్యవహరించాలో మనకు తెలిస్తే మొత్తం వ్యవస్థకు సంబంధించిన అనేక పనులు మనం చెయ్యగలము.

 What is Pada in Yoga Sutras?

ఈ రోజులో దీన్ని 'రిఫ్లెక్సోలజీ' అంటున్నారు. కాని అందులో వారు కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.

ఇక పాదాభివందనం విషయానికి వస్తే ముందుగా అసలు మనం ఎవరి పాదాలనైతే తాకుతున్నామో వారి వద్ద మనకు ఇచ్చేందుకు ఏమైనా ఉండాలి. వారి శక్తి ఒక నిర్ణీత స్థాయిలో ఉండాలి. మనం పెదవాడిని అప్పు అడిగితే లాభం లేదు కదా! మనకు అప్పు కావాలనుకుంటే ఎవరి వద్ద ఇచ్చేందుకు డబ్బు ఉంటుందో వారినే అడగాలి.దివాలా తీసినవారినో లేక లోభినో అడిగితే ఉపయోగం ఉండదు.

చాలా ఇండ్లలో పెద్దల పాదాలు తాకే ఆచారం ఉంటుంది.బహుశా దక్షిణ భారతంలో అది అంతరించిపోతున్నను ఉత్తర భారతంలో వేద సంప్రదాయం ఇంకా అలాగే కొనసాగుతుంది.వాళ్ళు తమ తల్లితండ్రులు, అత్తమామలు లేక ఎవరైనా తమకన్నా పెద్ద వారిని చూస్తే చేసే మొదటి పని వాళ్ళ పాదాలు తాకడం! అది కేవలం వారిపట్ల గౌరవాన్ని వ్యక్త పరచడం మాత్రమే.అంతేకాని వారి శక్తిని తీసుకునేందుకు కాదు.

మనమొక విగ్రహానికి నమస్కరించుకునే పద్ధతి వేరే ఉంటుంది. శక్తిమంతులైన ఆధ్యాత్మిక పరిణతిలో కాకపోయినా తమ సొంత రీతిలో శక్తిమంతులైన వారికి నమస్కారం లేక వందనం చేసేందుకు వేరే పద్ధతి ఉంది. మన గురువుకు తలవంచి వందనం చేసేటప్పుడు వేరొక మార్గం ఉంది.
చేతుల్లో గ్రహించేశక్తి ఉంటే మనం తాకిన పాదాలకు ఇచ్చే స్వభావం ఉంటే ఒకవేళ ఈ రెండూ అనుసంధానించబడి ఉంటే మన ఏళ్ళ తరబడి సాధనతో పొందలేనిది ఒక్క క్షణంలోనే పొందుతారు.

ఎక్కడైనా ఈ అనుసంధానం జరుగుతుందేమో అన్న ఆశతో చేయదమ్ జరుగుతుంది. పాశ్చాత్య సంస్కృతిలో ఒకరి పాదాలపై పడడాన్ని ఒక రకమైన లోబడటంగానో లేక బానిసత్వంగా అర్థం చేసుకుంటారు. కాని యోగ సంప్రదాయంలో పాదాలను చేతుల కంటే తక్కువైనవని ఎప్పుడూ అనుకోరు.శరీరంలోని ఒక భాగాన్ని మరొక భాగం కంటే తక్కువగా ఎప్పుడూ చూడరు.
నమస్కారం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది.

English summary
The Yoga Sutra is basically the psychology of yoga, or the “road map” for the yogi. The sutras are divided into four chapters, or padas. The first, Samadhi Pada, explains the lofty aims of yoga, such as "Yoga is the calming and quieting of all the self-limiting tendencies of our own consciousness."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X