వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవుని 'యోగ'౦ పంచకోశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మానవుడు తన జీవిత జీవన ప్రయాణంలో తానేమిటి,భవత్ స్థితిని పొందడం ఎలా సాధ్య పడుతుంది.అసలు తనను తాను తెలుసుకోలేక పోవడం అనడానికి మూలకారణం మానవుడు స్వార్ధబుద్ధితో ధనం,పేరు ప్రతిష్ట,వస్తువులు,మాయ అనెడి ఇంద్రియలకు వశం కావడం వలన తాను తెలుసుకోవలసిన జీవితలోని పరమార్ధం తెలుసుకోలేక 'కలి' మాయలో పడి ఇంద్రియలోలుత్వంలో మునిగి తేలుతూ తన జీవిత కాలంలో అయోమయస్థితి నుండి బయట పడడానికి మార్గం కొరకు అన్వేషిసుంటే అది కేవలం యోగ సాధన ద్వార తన పంచకోశల గురించి తెలుసుకుని దాని సాదించిన ఫలితం వలన తన ఇంద్రియ నిగ్రహ శక్తి బలపడుతుంది.

మన పూర్వీకులైన యోగసాధకులు మనిషి తనను తాను ఏ విధంంగా పరిరక్షించుకోవలి అనే విషయం గురించి తెలియజేసారు.మానవుని శరీరంలో పంచకోశాలు అనేవి ఏమిటి అవి ఎలా మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి అనే విషయం గురించి ప్రస్తావించుకుంటే,కోశము అనగా అర.మనిషి యొక్క మనసు ఐదు స్థితులలో పనిచేస్తుంది,అవే

పంచకోశాలు.జీవాత్మ చుట్టూ అరలు ఆరలుగా ఉన్నందున దీనిని కోశము అందురు.

1. అన్నమయ్య కోశం

2. ప్రాణమాయ కోశం

3. మనోమయ కోశం

4. విజ్ఞానయ కోశం

5. ఆనందమయా కోశం

What is Pancha Koshas: The imporance of yoga

1. అన్నమయ్య కోశం

'అన్న' అనగా ఆహారం.ఇది భౌతిక శరీరం. అయిదు జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1.చూపు,2.వాసన, 3.స్పర్శ,4.రుచి,5.వినికిడి లతో ఉన్న శరీరం అన్న మాట. అలాగే ఆ శరీరంలో ఎముకలు,కండరాలు,అవయవాలు ఈ అన్నమయ్య కోశం పరిధిలోకే వస్తాయి.మానవుని శరీరం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది.

2. ప్రాణమాయ కోశం
'ప్రాణ' అంటే శక్తి. ఈ కోశము vital life force అంటేప్రాణ శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాణ మరో 5 పెద్ద మరో 5 చిన్న భాగాలుగా ఉంటుంది.అవి 1.ప్రాణ,2. అపాన,3.ఉదాన,4. సమాన,5. వ్యాన అనే 5 భాగాలుగా ఉంటుంది. శరీరంలో ఈ ప్రాణ శక్తి వల్ల నియంత్రణ కలిగి ఉంటుంది.మానవ శరీరంలో రక్త ప్రసరణ మరియు నాడులకు ప్రాణ శక్తి అందించేది ఇదే.
అంతేగాక 5 ఉప ప్రాణములు ఉన్నాయి అవి 1. నాగ, 2.కూర్మ, 3.క్రీకర, 4.దేవదత్త, 5.ధనుంజయ అనేవి ఉంటాయి.
శరీరంలోని 72000 నాడులకు ప్రాణశక్తిని అందిస్తుంది.

3.మనోమయ కోశం

'మన" అంటే మనస్సు.ఇది ఆలోచనలు మరియు భావనలు, మెదడు మరియు ఎమోషన్ ల సమ్మిళితం. ఇందులో చేతనా, ఉప చేతనా మరియు అచేతనా అవస్థలు ఉంటాయి. దీనినే కాన్సియస్, సబ్ కాన్సియెస్ మరియు అన్ కాన్స యెస్ అంటాము. ఇది జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించి పంజ్ చేస్తుంది. అరిషడ్ వర్గాలు ఈ కోశం కు చెందినవి. కామ, క్రోధ,లోభ,మద,మాత్సర్యములు.

4.విజ్ఞానమయ కోశం
'విజ్ఞాన' గురించి అవగాహనే విజ్ఞానమయ కోశం. సుప్రీం అంటే పరమాత్మ ఉన్నదనే అవగాహన ఉంటుంది.ధారణ సాధన ద్వారా అంతర్గత క్రమశిక్షణ ఏర్పడి పరమాత్మతో ధ్యాన స్థితిలో వుండడడం.నేను అనే తత్వం నశించి ప్రాపంచిక విషయాలు వదలి సమాధి స్థితిని పొందడం. ఇది పూర్తిగా విషయ అవగాహనకు చెందినది.

5.ఆనందమయ కోశం

'ఆనందమ' కోశం అంటే పూర్తిగా ఇది ఆధ్యాత్మిక పరమైన దేహం.ఆత్మ పరమాత్మలో ఐక్యమైయ్యే స్థితి. దీనిని మనం ముక్తి అంటున్నాము.ఆనందమైన స్థితి ఇది.

మన శరీరంలో అనారోగ్యం ఏర్పడితే ఏ కోశంలో సమస్య ఉంటే ఆ సమస్యకు తగినట్టు థెరఫీ ఉంది.
భౌతిక శరీరం అన్నమయ్య కోశం అయితే అందుకు ఆసనాలు, ప్రాణాయమలు వాడాలి
అలాగే మానసిక సమస్యలు మనోమాయ కోశం కావున ధ్యానం చేయించవచ్చు
అలాగే విజ్ఞానం కోశం కోసమయితే ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు, మంచి పుస్తకాలు చదవడం అవగాహన పెంచుకోవడం

ఆనందమయకోశం అయితే ధ్యాన స్థితి నుండి ధారణ స్థితికి చేరి సమాధి (సమ+అది) స్థితిని పొందడం దీనినే ముక్తి అంటున్నాము.

English summary
Astrologer explains what Pancha Kosas and the importance of Yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X