• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి..? ఈ వేడుక ప్రాధాన్యత ఏంటి..?

|

సద్దుల బతుకమ్మ

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రపంచంలో మరెక్కడా లేని రంగురంగు పూల బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి. చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయికే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తోందంటే తెలంగాణ పల్లెలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆడపిల్లలు పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా... తోటి మిత్రురాళ్లతో, బంధువులతో కలిసి బతుకమ్మ ఎప్పుడు ఆడుకుందామా.. అని ఎదురు చూసే పండుగ బతుకమ్మ. ఆడపడచులు ఈ పండగ కోసం సంవత్సరం అంతా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రకృతిలోని అందమైన రంగు రంగుల పూల పండగ ఈ బతుకమ్మ పండగ.

 బతుకమ్మ అంటే ఏంటి..?

బతుకమ్మ అంటే ఏంటి..?

బతుకమ్మ అంటే పూల సంబురం పండుగ. గ్రామాలలో తెల్లవారుతూనే పూలను సేకరించడం పెద్ద వేడుక. తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి, బంతి, గన్నేరు... ఇలా ఎన్నెన్నో రకాల పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చుకుని ఆడుకుంటారు. గునుగు పూలు తెల్లగా ఉంటాయి. వాటిని రంగు రంగుల నీళ్ళలో ముంచి పలు రంగుల్లోకి మారుస్తారు. ఎన్ని రకాల పూలున్నా తంగేడు పూలకే ప్రాధాన్యం. పసుపు వర్ణంలో బంగారంలా మెరిసిపోతూ ఉంటాయి. పసుపు రంగు ఐదవతనానికి సంకేతం.బతుకమ్మను పేర్చడం ఒక కళ. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చొని బతుకమ్మను అమరుస్తారు. గుమ్మడి ఆకులను పెద్ద పళ్లెంలో పరచి, ఆ ఆకులపై పసుపు, కుంకుమలు, అక్షితలు చల్లి వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు. ఇలా వివిధ రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు.

 పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను

పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను

పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను రూపొందిస్తారు. దానిపై తమలపాకులో కానీ చిక్కుడు ఆకులో కానీ పసుపు ముద్ద 'గౌరమ్మ' పెట్టి మధ్యన నొక్కి రెండు శిఖరాలుగా చేస్తారు. ఇవి శివ పార్వతులకూ, అర్థనారీశ్వర తత్త్వానికీ ప్రతీకలు. వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి మందిరం దగ్గర పెట్టి ధూప దీప నివేదనలు సమర్పిస్తారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో సంపదతో వర్థిల్లేలా అనుగ్రహించాలని ప్రార్థిస్తారు. తరువాత బంధు మిత్రులతో పాటు బతుకమ్మలను తలపై పెట్టుకొని చెరువు వద్దకు చేరుకుంటారు. మధ్యలో పెద్ద బతుకమ్మను పెట్టి మిగతా వాటిని చుట్టూ సర్దుతారు. వయోబేధం లేకుండా మహిళలు బతుకమ్మల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ బతుకమ్మ పాటలు పాడుతారు. పెళ్ళికాని ఆడపిల్లలు పిల్లలు వాళ్ళు ఒక గుంపుగా తయారై కోలల ఆట ఆడుతారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో గంగమ్మ ఒడిలో నిమర్జనం చేసి గౌరమ్మను మంగళ సూత్రాలకు పూసుకుని వారి కుటుంబాలను చల్లంగా చూడమని వేడుకుంటారు. ఆ తర్వాత తెచ్చిన నైవేద్యాలను ఒకరికి ఒకరు పంచుకొని ఆరగిస్తారు.

 కనుమరుగౌతున్న సాంప్రదాయాలు

కనుమరుగౌతున్న సాంప్రదాయాలు

ప్రస్తుత కాలంలో కనుమరుగౌతున్న ఆచారాలు గతంలో బతుకమ్మ ఆట, పాటకు ఓ ప్రత్యేకత ఉండేది. రోజు రోజుకు ఆట పద్దతిని మార్చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. పూర్వ పద్దతియే ఆచరించాలి. బతుకమ్మ పండగ ఆట, పాటలకు ఆధునిక పద్దతులు రుద్దడం సరికాదు. సినిమా పాటలపై ఆటలు, చిత్ర విచిత్రమైన స్టెప్పులతో సనాతన సాంప్రదాయాలకు స్వస్తి చెప్పడం సంస్కారం అనిపించుకోదు, ఆలోచించడి మన సాంప్రదాయ సంస్కృతిని విదేశీయులు సైతం ఆకర్షితులౌతున్నారు. మనమేమో వాటిని పక్కదారి పట్టిస్తున్నామా అన్న భావన కలుగుతుంది.బతుకమ్మలో తంగేడు, గునుగు పూలే ముఖ్య భూమికను పోషించేవి. చేనుల్లో గునుగు పూలు తీసుకొచ్చి వాటిని రంగుల్లో ముంచి బతుకమ్మను పేర్చేది. సద్దుల బతుకమ్మ రోజు మగవాళ్లంతా చేను చెలకా, అడవి మార్గం వైపు పోయి తంగేడు, టేకు, గునుగు పూలను సేకరించేది. మారుతున్న పరిస్థితులతో పొలాలు, చేనుగట్లపై పూల చెట్లు మాయమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తంగేడు పువ్వు కనిపించని పరిస్థితి ఏర్పడింది. గునుగు పువ్వును ప్రస్తుతం మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 కానరాని మేదరోళ్ల సిబ్బి

కానరాని మేదరోళ్ల సిబ్బి

గడ్డిపూలు, కట్ల పూలు, బంతులు, చేమంతులు, బొండు మల్లెలు, టేకు పువ్వులు, ఇసుక బంతులు, పట్టు కుచ్చులు, సీతమ్మజడలు, గుమ్మడి పూలు.. ఇలా తీరొక్క పూలు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇంటి పెరట్లలో దర్శనమిచ్చేవి. నేడు మార్కెట్‌కు వెళ్లి పూలు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరైతే పేపర్‌ పూల బతుకమ్మలతో పండుగను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే మేదరి కుల వృత్తులకు ఒక సంబురం. ఎందుకంటే బతుకమ్మ పండుగలో గౌరమ్మ కోసం ప్రతి ఒక్కరూ వెదురుతో సిబ్బిని చేయించుకునేవారు. వెదురు సిబ్బి లేకుండా బతుకమ్మ లేదు అనేంతగా వాటి అవసరం ఉండేది. వెదురు సిబ్బిలోనే తీరొక్క పూలను పేర్చి బతుకమ్మను తయారు చేసేవారు. వాటి అమ్మకాలతో మేదరోళ్లకు కొంత ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ ఆ సిబ్బిల స్థానాన్ని ఆక్రమించాయి.

 వినపడని జానపదాలు..తీపి పంచని సద్దులు

వినపడని జానపదాలు..తీపి పంచని సద్దులు

దశాబ్ద కాలం క్రితం వరకు పల్లెల్లో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటే తోటి మహిళలంతా చప్పట్లు కొడుతూ పాటను అనుకరిస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడేది. ఈ జానపద గీతాలు చుట్టు పక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తుండేవి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని సాగే ఈ పాటల్లో ఆడబిడ్డల కష్ట సుఖాలు, ప్రేమలు, స్నేహం, బంధుత్వాలు ఉట్టిపడేవి. ప్రస్తుతం ఆ జానపదాలు కనుమరుగయ్యాయి. ఏ వైపు చూసినా డిజే పాటల చప్పుళ్లు, కోలాటాల నడుమే ఆడపడుచులు బతుకమ్మను ఆడుతున్నారు.

ఆనాటి కాలంలో తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ అత్యంత ప్రత్యేకమైనది. ఆ రోజు పెద్దగా బతుకమ్మలు పేర్చడమే కాకుండా ప్రత్యేకమైన పిండి వంటకాలు, తీపి సద్దులు చేసి బతుకమ్మ సంబరాల్లో ఒకరికొకరు పంచుకొనేది. ఆ సీజన్లలో వచ్చిన ధాన్యాలను దోరగా వేయించి వాటిని చక్కర లేదా బెల్లంతో కలిపి పిండిలా రోళ్లలో దంచేవారు. వాటి పంపిణీ వెనుక కూడా శాస్త్రీయత దాగి ఉంది. ఆ సద్దులన్నీ చిరు ధాన్యాలతో చేసినవే. అవి ఆరోగ్యానికి మంచి చేసేవి. ప్రస్తుతం ఆ సంస్కృతి పోయి స్వీట్లు పంపిణీ చేసే పరిస్థితి వచ్చింది.

English summary
Saddula batukamma is the final phase of Batukamma festival which falls just ahead of Dussehra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X