వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? నారాయణ-శివుడు వేర్వేరు కాదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఆత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.ఆత్మ సాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొలిపి ఆ ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం.

ఆత్మ సాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మ స్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆ పరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరెవరి ఏ విధంగా నచ్చినట్లు వారు పూజిస్తారు.ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే.ఎవరిని స్మరించినా అది ఒక్కరినే.

What Is Self Realization?

నారాయణుడు శివుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు వేరు వేరు కాదు ఒక్కటే ఒకే పరబ్రహ్మ
స్వరూపులు.నిరాకారము( పరమాత్మ )సాకారము ( జీవాత్మ )ఒక్కటే.పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు.జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమయ్యి ఆశూన్య స్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.

సృష్టి స్థితి లయములో స్థితి శాశ్వతమైనది అదే పరబ్రహ్మ స్వరూపమైన శూన్యస్థితి.అంటే నిరాకార పరబ్రహ్మమే శాశ్వతమైన స్థితిని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.ప్రతీ జీవి పరమాత్మ (నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము.

English summary
Self realization is the goal of all human endeavors and of all spiritual paths. It is the merging of the ego-self (which identifies with one body, one personality, one family, one nationality) with the Universal Self.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X