వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షష్టిపూర్తి అంటే ఏమిటి..? మగవారు మాత్రమే షష్టిపూర్తికి అర్హులా..?శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మగవారు పుట్టిన తెలుగు సంవత్సరం తిరిగి మల్లి అదే సంవత్సరం పునారావృతం కావడానికి 60 సంవత్సరాల కాలం పడుతుంది. మగవారి వయస్సు 60 సంవత్సరాలు వచ్చినప్పుడ్డు శాస్త్రోక్తంగా జరిపే కార్యక్రమం షష్టి పూర్తి అని అంటాము. మనిషి పూర్ణాయుర్దాయం మనం అనుకుంటున్న వంద సంవత్సరాలు కాదు. 120 సంవత్సరాలు మనిషి యొక్క పూర్ణాయుర్దాయం. కర్మ ఫలితం, పూర్వజన్మ ఫలం, వ్యక్తీ జీవన విధానం, అలవాట్లను బట్టి ఆయుష్షు ఉంటుంది.

షష్టిపూర్తి:- దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. కాని దాన్ని 60 సంవత్సరాలు పూర్తి అయిన స్త్రీ పురుషులు ఎవరయిననూ చేసుకోవచ్చు. ఎందుకంటే, షష్టిపూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి కావటం అని కనుక. సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేయరు.

What is Shastipurthy according to Telugu year?

నిజానికి మనిషికి సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. అందులో సగం అంటే 60 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. అంటే ఒక లెక్క ప్రకారం మనిషి 60 సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్యఘట్టాలనన్నింటినీ పూర్తి చేసుకుని తన జీవితంలో రెండవ అర్థభాగాన్ని ప్రారంభిస్తాడు.

మనిషిని వెంటాడే మృత్యువు దశలు :- ప్రతి వ్యక్తికీ మృత్యువు
60 వ యేట ఉగ్రరథునిగా,
70 వ యేట భీమరథునిగా,
78 వ యేట విజయరథునిగా మృత్యు దేవుడు పొంచి ఉంటాడు.

ఈ వయస్సులలో కాళ్ళు, చేతులు లాంటి బాహ్యావయవాలు, గుండె, ఊపిరితిత్తులు వంటి అంతరావయవాలు శారీరక యంత్రపరికరాలలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆయా కుదుపులకు తట్టుకుని, మళ్ళీ శక్తిని పుంజుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

What is Shastipurthy according to Telugu year?

జ్యోతిషశాస్త్ర రీత్యా బృహస్పతి పన్నెండు సంవత్సరాల కొకసారి తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు. అలాగే శని 30 సంవత్సరాలకు ఒకసారి 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. మానవ జీవితంలో జరిగే మార్పులనన్నింటినీ మనం ఈ రెండు గ్రహాల గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. శని, గురులు తాము బయలుదేరిన రాశికి చేరుకోవటం తిరిగి జీవితం ప్రారంభం అయినట్లు సంకేతం.

ఇంకొక విధంగా ఒక మనిషి పుట్టిన సంవత్సరం నుండి 60 తెలుగు సంవత్సరాల ప్రకారం తిరిగి మరలా అదే సంవత్సరములో ప్రవేశించే రోజు షష్టిపూర్తి అని కూడా అంటారు. అంటే తన జీవిత కాలంలో ఒక అంకం ముగిసినట్లుగా అనుకోవచ్చు. షష్టి పూర్తి 60 వ సం౹౹లొనే ఎందుకు జరుపుకుంటున్నాం. మనం ఏ సంవ‌త్స‌రంలో జన్మించారు అని ఎవరైనా అడిగితే వారికి ఠ‌క్కున పుట్టిన సంవత్సరం 1981 అనో 1983 అనో చెప్పేస్టాం .... కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే ... మన దగ్గర నుండి సమాధానం రాదు.

ప్రస్తుత విద్యావిధానంలో మనకు తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయని చాల వరకు తెలియదు. తెలిసినా 60 సంవత్సరాలు వరుసగా చెప్పే జ్ఞాపక శక్తి గాని తీరిక గాని మనకు లేవు, కాబట్టి మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో తెలుసుకోవడం కోసం తెలుగు సంవ‌త్స‌రాల వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

ఇక్కడ మీకో ముఖ్యమైన సంగతి మరొకటి చెప్పాలి. నిజానికి మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో అదే సంవత్సరంలో మన పుట్టిన రోజును
జరుపుకోవాలంటే మన జీవితంలో ఒక్క సారే జరుపు కోగలం. రెండవ సారి జరుపుకోవాలంటే 120 సంవత్సరం వరకు ఆగాలి. ఆది ఈ కాలంలో జరిగే పని కాదు. అయితే మనలో చాలా మందికి తెలియకుండానే మనం పుట్టిన తెలుగు సంవత్సరాన్ని అనగా మొదటి పుట్టిన రోజును షష్టిపూర్తిగా 60 వసంవత్సరంలో జరుపుకుంటున్నాము.

శాస్త్ర ప్రకారం షష్టిపూర్తి రోజు అభ్యంగన స్నానాదులు, మహా మృత్యుంజయ హోమం, ఇతర నవగ్రహ, చండి, సుదర్శన, లక్షినారసింహ మొదలగు హోమ క్రతువులు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని దానధర్మాలు చేస్తే చాలా మంచిది. ఆర్ధిక స్తోమత లేనివారు అభ్యంగన స్నానం చేసి ఇంట్లో కుల దైవానికి, తలిదండ్రులు జీవించి ఉంటే వారికి, గోమాతకు పూజ చేసి ఇంటికి అందుబాటులో ఉన్న దేవాలయ దర్శనం చేసి అక్కడ ఉన్న పేదలకు, యాచకులకు తోచిన సహాయం చేయాలి.

1927, 1987, 2047, 2107 : ప్రభవ
1928, 1988, 2048, 2108 : విభవ
1929, 1989, 2049, 2109 : శుక్ల
1930, 1990, 2050, 2110 : ప్రమోదూత
1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి
1932, 1992, 2052, 2112 : అంగీరస
1933, 1993, 2053, 2113 : శ్రీముఖ
1934, 1994, 2054, 2114 : భావ
1935, 1995, 2055, 2115 : యువ
1936, 1996, 2056, 2116 : ధాత
1937, 1997, 2057, 2117 : ఈశ్వర
1938, 1998, 2058, 2118 : బహుధాన్య
1939, 1999, 2059, 2119 : ప్రమాది
1940, 2000, 2060, 2120 : విక్రమ
1941, 2001, 2061, 2121 : వృష
1942, 2002, 2062, 2122 : చిత్రభాను
1943, 2003, 2063, 2123 : స్వభాను
1944, 2004, 2064, 2124 : తారణ
1945, 2005, 2065, 2125 : పార్థివ
1946, 2006, 2066, 2126 : వ్యయ
1947, 2007, 2067, 2127 : సర్వజిత్
1948, 2008, 2068, 2128 : సర్వదారి
1949, 2009, 2069, 2129 : విరోది
1950, 2010, 2070, 2130 : వికృతి
1951, 2011, 2071, 2131 : ఖర
1952, 2012, 2072, 2132 : నందన
1953, 2013, 2073, 2133 : విజయ
1954, 2014, 2074, 2134 : జయ
1955, 2015, 2075, 2135 : మన్మద
1956, 2016, 2076, 2136 : దుర్ముఖి
1957, 2017, 2077, 2137 : హేవిళంబి
1958, 2018, 2078, 2138 : విళంబి
1959, 2019, 2079, 2139 : వికారి
1960, 2020, 2080, 2140 : శార్వరి
1961, 2021, 2081, 2141 : ప్లవ
1962, 2022, 2082, 2142 : శుభకృత్
1963, 2023, 2083, 2143 : శోభకృత్
1964, 2024, 2084, 2144 : క్రోది
1965, 2025, 2085, 2145 : విశ్వావసు
1966, 2026, 2086, 2146 : పరాభవ
1967, 2027, 2087, 2147 : ప్లవంగ
1968, 2028, 2088, 2148 : కీలక
1969, 2029, 2089, 2149 : సౌమ్య ***
1970, 2030, 2090, 2150 : సాధారణ
1971, 2031, 2091, 2151 : విరోదికృత్
1972, 2032, 2092, 2152 : పరీదావి
1973, 2033, 2093, 2153 : ప్రమాది
1974, 2034, 2094, 2154 : ఆనంద
1975, 2035, 2095, 2155 : రాక్షస
1976, 2036, 2096, 2156 : నల
1977, 2037, 2097, 2157 : పింగళ
1978, 2038, 2098, 2158 : కాళయుక్తి
1979, 2039, 2099, 2159 : సిద్దార్థి
1980, 2040, 2100, 2160 : రౌద్రి
1981, 2041, 2101, 2161 : దుర్మతి
1982, 2042, 2102, 2162 : దుందుభి
1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి
1984, 2044, 2104, 2164 : రక్తాక్షి
1985, 2045, 2105, 2165 : క్రోదన
1986, 2046, 2106, 2166 : అక్షయ

ఉదాహరణకు 1969 లో పుట్టినవారికి తెలుగు సంవత్సరం "సౌమ్య" నామ సంవత్సరం అవుతుంది. వారికి పై టేబుల్ ఆధారంగా చూస్తే వీరికి షష్టిపూర్తి 2029 వ సంవత్సరంలో జరుగుతుంది. వీరికి 120 సంవత్సరాలు నిండాలి అంటే 2089 సంవత్సరం అవుతుంది. ఈ ఉదాహరణ ప్రకారంగా మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏది, షష్టిపూర్తి ఏ సంవత్సరంలో వస్తుంది. పుర్ణాయుషుతో జీవించాలి అంటే ఏ సంవత్సరం రావాలి అనేది పై టేబుల్ ఆధారంగా తెలుసుకోవచ్చును.

English summary
It takes 60 years for the Telugu year of male birth to return and repeat the same year. When a man reaches the age of 60, the scientific program is said to be complete
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X