• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శూన్యమాసం అంటే ఏమిటి..? బోనాలు ఆషాఢమాసంలోనే ఎందుకు..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కోకాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శని గ్రహం 2 1/2 సం. పడుతుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశుల లోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది.

సూర్యుడు మేషరాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో 'మేష సంక్రమణం' అని, సూర్యుడు వృషభరాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో 'వృషభ సంక్రమణం' అని, సూర్యుడు మిథునరాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో 'మిథున సంక్రమణం' అని సూర్యుడు కర్కాటకరాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో 'కర్కాటక సంక్రమణం' అని... ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు.

What is shoonya masam according to Astrology, what is its importance

ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ కూడా దీనినే వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢ శుద్ద విదియ నాడు పూరీజగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాఢ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు.

ఆషాఢ సప్తమి భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి.

ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలిఏకాదశి అని, శయనఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢమాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయ బద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటు వంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్త గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది.

కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్త వారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్త వారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు.

అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను, అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. ఇలా అనేక కారణాల వలన ఆషాఢమాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఇక ఈ మాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు.

ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు. ఇక ఈ మాసంలో చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలూ చేస్తారు. ఇక ఈ మాసంలో మనిషిలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అందుకే ఆషాడం అనే నియమం పెట్టారు. ఇక దీక్షలు కూడా ఈ మాసాల్లోనే మొదలవుతాయి. ఎండా కాలం వేడిమికి భూతాపం హెచ్చి వర్షాకాలంలో భూమిలోకి నీరు ఇంకుతుంది. అందుకే ఈ పండే కూరగాయలను తినకూడదని నియమం పెట్టారు.

ఇక చాతుర్మాస్య రెండవ మాసం శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు. మూడవ నెల భాద్రపద మాసంలో పాలను తాగకూడదు. చివరి మాసం ఆశ్వీయుజమాసంలో కంది, పెసర, సెనగ మొదలుగు పప్పు ధాన్యాలు తినకూడదని పెద్దలు నియమం పెట్టారు. ఈ మాసంలో వచ్చే క్రిమి కీటకాదులు పోవాలంటే కనీసం మూడు సార్లు అయినా ఆవుపేడతో కాల్చిన పిడకలతో ధూపం వేయాలి. మైసాక్షి వంటి ధూపాన్ని ఇంట్లో వేస్తే క్రిమి కీటకాలు నివారించబడతాయి. ఇక ఈ కాలంలో వేప, మామిడి, జామ, మొదలైన మేలు చేసే పండ్ల మొక్కలు నాటాలి.

English summary
According to astrology the sun is the king of the Navagrahas. According to astrology, it takes a period of time for a single planet to change its zodiac sign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X