వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

150 ఏళ్ల తర్వాత: సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అంటే ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Super Blue Blood Moon : సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఒక్కసారే !

ఆకాశంలో జనవరి 31వ తేదీన అద్భుతం జరుగుతోంది. సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌ ఆకాశంలో కనువిందు చేయనుంది. 31వ తేదీ సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఆకాశంలో 150 ఏళ్ల తర్వాత అరుదైన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపిస్తుంది. దానికి ఆ పేరు పెట్టింది నాసా. బ్లూ మూన్, సూపర్ మూన్ కలగలుపే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని అంటారు.

ఆ రెండింటి కలగలపే...

ఆ రెండింటి కలగలపే...

సూపర్ మూన్ అంటే సాధారణంగా కనిపించే చంద్రుడి కన్నా ఎక్కువ సైజులో కనిపిస్తుంది. చంద్రుడు భూకక్ష్యకు దగ్గరగా రావడం వల్ల చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. కాస్తా నీలం రంగులో ఉండేది బ్లూ మూన్. ఇది రెండు మూడేళ్లకు ఓసారి కనిపిస్తుంది. పరిమాణంలో పెద్దగా ఉందడి ఎరుపు నీలం రంగులు కలిసినట్లు ఉండేది సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని సాధారణంగా చెప్పవచ్చు.

చంద్రుడు పెద్ద పరిమాణంలో..

చంద్రుడు పెద్ద పరిమాణంలో..

ఈ నెల 31వ తేదీన చంద్రుడు పెద్ద పరిమాణంలో కనిపిస్తాడు. నీలం, ఎరుపు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతాడు. 150 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంటోంది. అంటే 1866 తర్వాత చంద్రుని ఈ అరుదైన రూపం కనిపిస్తుంది. అయితే, చంద్రమామ సైజు మారదు. కానీ సైజు పెరిగినటలు, రక్తం చిమ్ముతన్నట్లు కనిపిస్తాడు.

 ధూళి కారణంగా ఇలా...

ధూళి కారణంగా ఇలా...

అరుదైన ధూలి కణాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. దాంతో వారు దాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. బ్లూమూన్‌ను రెండు రాలుగా చెబుతారు. ఒక్కో రుతువులోని నాలుగు పున్నమి రాత్రుల్లో మూడో దాన్ని బ్లూ మూన్ అంటారని ఒక నిర్వచనం చెప్తే, ఒక నెలలోనే వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారని మరో నిర్వచనం చెబుతుంది. ఈ నెల 31వ తేదీన వచ్చేది రెండోదానికి సంబంధించింది.

 సూపర్ మూన్ ఎలా ఏర్పడుతుంది...

సూపర్ మూన్ ఎలా ఏర్పడుతుంది...

భూమి చుట్టూ చందమామ పరిభ్రమిస్తూ ఉంటుంది. చంద్రుడు గుండ్రంగా ఒకే రేఖలో కాకుండా గజిబిజిగా తిరుగుతాడు. దీంతో కొన్నిసార్లు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. ఇటువంటి సమయాల్లో, పౌర్ణమి రోజున సూర్యూడికి చంద్రుడు అభిముఖంగా వస్తాడు. దీంతో చందమామ పరిమాణం పెరిగినట్లు కనిపిస్తుంది. అంటే, చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి పెద్దగా కనిపిస్తాడు కాబట్టి సూపర్ మూన్ అంటారు.

 అరుణ వర్ణంలో ఎందుకు.

అరుణ వర్ణంలో ఎందుకు.

సంపూర్ణ చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపురంగులో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే సమయంలో వెనక వెపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత చంద్రుడిపై పడుతుంది. ఆ కాంతి ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కవ తరంగ దైర్ఘ్యం ఉన్న ఎరుపు కాంతి చంద్రుడిని చేరుతంది. దీంతో బ్లడ్ మూన్ ఏర్పడుతుంది.

 అది మనకు కనిపిస్తుందా...

అది మనకు కనిపిస్తుందా...

సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌ను ప్రపంచమంతా చూసే అవకాశాలు తక్కువే. అలస్కాతో పాటు ఉత్తర అమెరికా, హవాయిలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందు పెద్ద సైజులో ఎర్రటి చంద్రుడు కనిపిస్తాడు. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా తూర్పు ప్రాంతం, ఆస్టేలియా, న్యూజిలాండ్‌ల్లో రాత్రి సమయంలో చూడవచ్చు. భారతదేశంలో సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా, 6.21 గంటులకు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చూడవచ్చునని కోజికోడ్‌లోని రీజనల్ సైన్స్ సెంటర్ అధికారిర జయంత్ గంగూలీ చెబుతున్నారు. దాదాపు గంట పాటు ఎర్రటి చంద్రుడిని చూడవచ్చునని అంటున్నారు.

English summary
The rare Super Blue Blood Moon is appearing on the sky on January 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X