• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆషాఢమాసవైశిష్ట్యం: అత్తా కోడళ్లు కలిసి ఒకే చోట ఎందుకు ఉండరాదు..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శుభకార్యాలకు పనికిరాదు అని భావింప బడుతున్నా... ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసరించే మాసం 'ఆషాఢమాసం' నాలుగు నెల. ఈ మాసం లోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాడ నక్షత్రం సమీపంలో గానీ సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి 'ఆషాఢ మాసం' అనే పేరు ఏర్పడింది.

రోజు కాకపోయినా ఆషాఢమాసంలో శుక్ల పక్ష షష్ఠి నాడు శ్రీసుబ్రహ్యణ్యస్వామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.

ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయణం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢమాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢమాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది.

 What is the importance of Ashada masam spiritually?

కాగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్త వారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం.. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కాని సామాజికంగ, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢమాసంలో భార్య భర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

ఆషాఢమాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్య దినాలు ఉన్నాయి. శుక్ల పక్ష ఏకాదశి ( తొలి ఏకాదశి ) దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా పేరు. శ్రీమహావిష్ణువు ఈ దినం మొదలుకొని నాలుగు నెలల పాటు పాల కడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్ర లో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీమహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాన్య వ్రతం ప్రారంభమవుతుంది.

శుక్ల పూర్ణిమ : వ్యాసపూర్ణిమ / గురుపూర్ణిమ, శ్రీవేదవ్యాసుల వారి జన్మదినంగా చెప్పబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని, గురు పరంపరను పూజించాలని శాస్త్ర వచనం.

కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ, ఆషాఢమాసం చివరి రోజు అయిన అమావాస్య నాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వెలిగించి పూలు, లడ్డూలు సమర్పించవలెను.

English summary
The month of Ashadha is a month that is considered to be useless for good deeds but is spiritually very special and possesses many glories and radiates the fruits of virtue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X