వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనిత్రయోదశి రోజు ఏ రాశి వారు పూజ చేయాలి?: ఆ రోజు చేయకూడనివి..

ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని,ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు

|
Google Oneindia TeluguNews

ఏ రాశివారు శనిత్రయోదశి నాడు పూజించవచ్చు, శని పరిహార స్తొత్రం

(శని త్రయోదశి 19.08.2017 తేదీ)
(శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం

అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.)

ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని,ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజచేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి.

 What is the importance of shani trayodashi?

శనికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.
శనిపీడాఫలాలు

డబ్బుదుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందంతగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు.
ఈసారి విశేషంగా శనిత్రయోదశి వచ్చింది. శని త్రయోదశి 19.08.2017 తేదీ శనివారం రోజు.

పుణ్యకాలం,

ప్రతీ శనివారం శని హోరాకాలలలో చేస్తేమంచిది. ఉదయం 6-7మధ్యకాలం, మధ్యాహ్నం 1-2 మధ్యకాలం, రాత్రి 8-9 మధ్యకాలంమంచిది. ఐతే శనిత్రయోదశి నాడు రోజంతా పుణ్యకాలమే.

శనిత్రయోదశి నాడు మనం చేయదగ్గవి

నూనె ఒంటికి అంటుకొని, తలస్నానంచేయడం, ప్రాణాయామం చేయడం,శనికోసం చెప్పిన మంత్రాలు, శ్లోకాలు చదవటం. ఉపవాసం.
శనికి చేయదగ్గపూజలు
శనికి తైలాభిశేకం, శనికిరుద్రాభిశేకం, నవగ్రహాలలో శనికి అష్టోత్తరనామాలు చదువుతూ పూలతో పూజించడం. శని ప్రదక్షిణలు చేయడం.

చదవదగ్గవి,

శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం నలున్ని శని పీడించిన కథ మంచివి,
శనికి ప్రీతి గా ఇవ్వదగ్గదానాలు
నువ్వులు, నువ్వుల ఉండలు, అన్నిరకాల నూనెలు నీలంరంగు పంచెలు (బ్రాహ్మణులకి) ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి - పాతబట్టలు దానంచేయాలి. నేరేడు పండ్లు, సిమెంట్‌ ఇనుము వంటివి, తగినవారికి తగినరీతిలో శక్తి వంచనలేకుండా చేయడం మంచిది.

శనికి సంబంధించి శాంతి చేసుకోవలసినవారు

మామూలుగా కర్కాటక, వృశ్చిక రాశులవారు చేసుకోవాలి.
విశేషంగా జాతకంలో శని పాప సంబంధంగా ఉన్నవారు, పాప స్థానాలలో ఉండేవారు, శనిదశ నడుస్తున్నవారు, చేయాలి.

ఈసారి తప్పకచేసుకోవలసినవారు

వృషభరాశి, కన్యారాశుల వారు శనిను పూజించాలి. ఏలినాటి శని నడుస్తున్న తుల, వృశ్చిక, ధను, రాశులవారు - అర్ధాష్టమ శని నడుస్తున్న సింహ రాశి, అష్టమశని గల మెష రాశి వారికి అత్యవసరం.

శని పరిహార స్తొత్రం

కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి

English summary
Shani Trayodashi is considered the most auspicious day for Shani puja as it is the favorite day of the Hindu deity Lord Shani. As per Hindu astrology, He is one of the most important planets from the celestial Navagrahas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X