వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్వస్తిక్' ప్రాధాన్యత: ఆ గుర్తు వెనుక చరిత్ర..

|
Google Oneindia TeluguNews

స్వస్తిక్ అంటే ఏమిటి ? శుభానికి సంకేతమైనస్వస్తిక్ సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు- మంచి, అస్తి - కలగటం. మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తరువాత హిందూ మతం లో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్.

జీవన చక్రాన్ని స్వస్తక్ సూచిస్తుంది. స్వస్తిక్ గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

వివిధ మతాలలో స్వస్తిక/ స్వస్తిక్హిందూ మతం లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్వస్తిక గుర్తు హిందూ మత ఆచారాలను అనుసరించే బౌద్ధ, జైన మతాలలో కూడా ఈ స్వస్తిక్ కనబడుతుంది.

What Is The Meaning Of Swastik Symbol?

ఉక్రెయిన్,ఇథియోపియా, అమెరికా,జపాన్ దేశాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచం నలుమూలలలో కూడా స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నం గా భావిస్తారు.

అసలీ స్వస్తిక్ మూలాలు పన్నేండు వేల సంవత్సరాల నాటి కాలంలో స్వస్తిక్ గుర్తు ఉక్రెయిన్ లో లభించింది.పాశ్చాత్య దేశాలలోని ప్రార్థనా మందిరాలలో ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. స్వస్తిక్ గుర్తు హిందూ మతంలో నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.

ప్రపంచ దేశాలలో అన్నింటికన్న సాంస్కృతిక,సాంప్రదాయ ఆచార వ్యవహారలలో అతి పూరాతనమైనది హిందూ సాంప్రదాయం.ఈ స్వస్తిక్ ఆకారం సవ్య దిశగా ఉంటుంది.విష్ణువు చేతిలో ఉండే సుదర్షణ చక్రం లాగ చేడును నివారించి శుభాలను కలిగిస్తుంది.అందుకే ఇంటికి,వ్యాపార సంస్థలకు,వాహనలలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని ఎదురుగా నెగిటివ్ ఎనర్జి ఈ స్వస్తిక్ ఉన్న చోట రానివ్వకుండా కాపాడుతుంది.

అందుకే ప్రతీ శుభాకార్యలలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు.గృహప్రవేశాలలో,పెళ్ళి పత్రికలలో,వాహన పూజలలో,నూతన యంత్రాలు వాడే సమయంలో పూజలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.ఇంటి గుమ్మంపై కట్టుకుంటే ద్రుష్టి దోషాల నుండి కాపాడుతుంది అని విశ్వసిస్తారు.వేద మంత్రోచ్చరణ చేసేప్పుడు ఓం శబ్ధం తర్వాత స్వస్తి అనే పదం విరివిగా వాడాటం మనం గమనిస్తూనే ఉంటాం.అంటే మనం ఏ పని ప్రారంభించినా ఆ కార్యంలో విజ్ఞం కలగకూడదని భావంతో చేస్తుంటారు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
The Sanskrit translation of Swastik means pure and auspicious.It is a part of ... Swastik is a symbol that is invariably used in all Hindu rituals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X