వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని దీప ప్రజ్వలన పిలుపు రహస్యం జ్యోతిషం ఏం చెబుతుంది

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

దీప స్వరూపము :- పరా దేవత వెలుగు విజయ సంకేతం. సంకట విపత్తుల చీకట్లు అలమకున్న మనుషుల మనసులను ఆశా వెలుగుల వైపు నడపడం, నడిపించడం, లోకానికి ఉత్సాహ పూర్వక శాంతి సౌఖ్యాలు అందించడం, మానవ ప్రయత్నాలకు దైవ బలము తోడై నిలవాలని, త్యైలోక తిమిరాల తొలగించాలని కోరుకునే విఙ్ఞులు చేయవలసిన కర్తవ్యం.
కర్తవ్య దీక్షకు ప్రతీక దీపారాధనము.

దీపం ఎందుకు వెలిగించాలి :- హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు. అంతేకాక, శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.

ఈ దీపం ఎందుకు వెలిగించాలి :- కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.

What is the secret behind PM Mods call to light Diyas? What does Astrology say?

మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా! సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె / నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె / నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా ! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది.

ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.

దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే

దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం,దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది,దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.

ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది.ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు (కంటికి సంబంధించిన వ్యాధి. షుగరు వ్యాధి గ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు.

నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు (cataract) రావు. ఆవునేయి, నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి (eye sight)ని మెరుగుపరుస్తాయి.

అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది. మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, మనకు మేలు చేస్తాయి. శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని. ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.

ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి,హృద్రోగులు (heart patients), రక్తపోటు (B.P) తో బాధపడేవారు, ఎక్కువగా ఒత్తిడి (stress) కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దగ్గర కూర్చుని చూస్తే కొద్ది రోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తపోటు (B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.

మనం చదువుకున్నాం, కాంతి ( light )కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం ( electro-magnetic spectrum) ఉంటుందని, ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ( temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు( color of light rays) మీద ఆధారపడి ఉంటుందని, ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి ఉంటుందని. అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి (electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద, వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది. గాలిలో మార్పులు తీసువచ్చి, దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి, నాడులను శుభ్రపరచి, వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది. ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ ( process).

ఆవునేతి దీపపు కాంతికి, నువ్వుల నూనె దీపపు కాంతికి, మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది. అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

కార్తీక దీపాలను చూసిన చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వెలిగించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా.అందుకని దీపాలను వెలిగించండి. వెలిగించే అవకాశం లేనప్పుడు కనీసం గాలికి కొండెక్కిన / శాంతించిన దీపాలను తిరిగి వెలిగించండి. కుదిరితే కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలుగుతున్న దీపపు ప్రమిదలలో పోయండి.

లోక కళ్యాణాభిలాషగా చెప్పిన శాంతి మంత్రం :-

అసతోమాసర్గమయా తమసోమాజ్జ్యోతిర్గమయా
మృత్యోర్మామమృతంగమయా
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః !

మన పెద్దలు ఇంట దీపమును వెలిగించడమును సర్వ పాపహరణముగా భావించారు. లోక కంటక రాక్షస బలమును పరిమార్జించడం, జనులకు బాధోపశమనము కలిగించడం, ఆత్మ బలమును పెంపొందింపజేసుకోవడం దీనిలో దాగిన రహస్యంగా చెప్పవచ్చు.

దీపమ్ కరోతు కళ్యాణమ్, ఆరోగ్య ధన సంపదామ్ !
శత్రు బుద్ది వినాశాయ,
దీపమ్ జ్యోతిర్నమోస్తుతే !!

దీపము శుభములను కలిగించి, ఆరోగ్య ధన సంపదలను కలిగించి, శత్రు బుద్ధిని మారిస్తుంది అటువంటి దీపమునకు నమస్కారము అని భావము.

మన ప్రధాని మోడీ గారు కారనజన్ముడు అనేక శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు కాబట్టే తేది 05- 2020- రాత్రి 9 గంటలకు 9 నిముషాలపాటు దీపం వెలిగించాలి అని పిలుపునిచ్చారు ఇందులో శాస్త్రీయత దాగి ఉన్నది అదేమిటో గమనిద్దాం
అంటే 5+2+0+2+0=9 రాత్రి 9 కి 9 నిముషాలు అంతా 9 జ్యోతిష శాస్త్ర రిత్య తొమ్మిదికి అధిపతి కుజుడు 'సైన్యాధిపతి '

కుజుడు :- సైన్యాధిపతి- దుష్టత్వంపై పోరాడటం , తన శక్తిని పెంపోదించు కోవటంతో పాటు మానవులలో ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కునే శక్తిని ఇస్తాడు.

సూర్యుడు సింహరాశికి అధిపతి సుర్యునిగుణం వెలుగును ఇచ్చుట సూర్యుని ప్రకాశంతో చంద్రుడు ప్రభావితం చెంది తన శక్తిని సూర్యుని ద్వారా సేకరించి ప్రకాశవంతంగా వెలుగుతాడు. ఈ విషయం మనందరికీ తెర్లిసిన విషయమే జ్యోతిష శాస్త్ర పరంగా చంద్రో మనసో జాత: అంటారు. చంద్రుడు మనస్సుకు కారకత్వం వహిస్తాడు కాబట్టి మనిషి మనస్సునకు చంద్రుడు ప్రధాన కారకుడు అవుతున్నాడు. ప్రస్తుతం ఉగాది కాలసర్ప దోష ప్రభావంతో ప్రారంభం అయినది. కాబట్టే మనుషులలో ఐఖ్యత లోపం, స్థిరంగా ఉండక పోవడం, పెద్దల మాటలు పెడచెవిన పెట్టడం మొదలగు వాటిని దృష్టిలో పెట్టుకుని వీటిని అన్నింటిని కొంత అదుపులో పెట్టడం కొరకు ఏప్రిల్ 5 తేది రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు వృశ్చిక లగ్నంను ఎంచుకున్నారు.

ఏప్రిల్ 5 తేదీ ఆదివారం అయింది ఆరోజు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రములు ( సింహరాశి ) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. దైవోపాసన మార్గంలో ఉండేవారికి అర్ధం అవుతుంది. అందుకని అందరూ ఖచ్చితంగా దీపం పెట్టండి శుభం కలుగుతుంది.

దీపం :- నూనె, నెయ్యితో మాత్రమే దీపారాధన చేయండి ఇది ఆరోగ్యదాయిని. ఈ దీపం వెలిగించే నూనెలో కొంచం కర్పూరం, లవంగం వేసి వెలిగిస్తే మీ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. పొరపాటున ఎలాక్ట్రానిక్ సంబధించిన లైట్స్ అంటే టార్చ్ , సెల్ ఫోన్ తో వచ్చే లైట్ వలన శుభం కంటే అశుభం ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఎలాగంటే జ్యోతిష పరంగా ఎలాక్ట్రానిక్ లైట్ అంటే రాహును ప్రభావితం చేస్తుంది. రాహువు బలపడితే కాలసర్ప ప్రభావం పెరుగుతుంది, మతపరమైన భేదాభిప్రాయాలకు కారకుడు అవుతాడు కాబట్టి ఎలాక్ట్రానిక్ లైట్ వద్దు అని సూచించడం జరుగుతున్నది.

సైన్స్ ప్రకారం కూడా చూస్తే :- ప్రతి ఇంటిలో 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు 9 దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశంలోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయినా అన్ని దీపాల వెలుగులు ఫోటాన్ శక్తులుగా మారుతాయి. అప్పుడు 9 'నవ'గ్రహాలు అన్నీ అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహు, కేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీగా మారుస్తారు, ఆ అటామిక్ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది. బహుశా అందుకే మన ప్రధానిగారి దీప ప్రజ్వలన పిలుపు అయి ఉంటుంది. అదే మన సంస్కృతి, మన సనాతన హిందు ధర్మరహస్యం.

English summary
According to Indian Hindu Tradition all hindus light lamp infront of God intheir houses.Few light the diya in the morning few people do this at night. Light is a symbol of hope and Knowledge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X