• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏప్రిల్ 5న రాత్రి దీప ప్రజ్వలనకు ప్రధాని పిలుపు..జ్యోతిష్యం ఏం చెబుతోంది ?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

దీప స్వరూపము :- పరా దేవత వెలుగు విజయ సంకేతం. సంకట విపత్తుల చీకట్లు అలమకున్న మనుషుల మనసులను ఆశా వెలుగుల వైపు నడపడం, నడిపించడం, లోకానికి ఉత్సాహ పూర్వక శాంతి సౌఖ్యాలు అందించడం, మానవ ప్రయత్నాలకు దైవ బలము తోడై నిలవాలని, త్యైలోక తిమిరాల తొలగించాలని కోరుకునే విఙ్ఞులు చేయవలసిన కర్తవ్యం.

కర్తవ్య దీక్షకు ప్రతీక దీపారాధనము.

దీపాలు ఎందుకు వెలిగించాలి

దీపాలు ఎందుకు వెలిగించాలి

దీపం ఎందుకు వెలిగించాలి :- హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు. అంతేకాక, శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.

ఈ దీపం ఎందుకు వెలిగించాలి :- కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.

నూనే లేదా నేతి దీపాల ప్రజ్వలన

నూనే లేదా నేతి దీపాల ప్రజ్వలన

మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా! సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె / నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె / నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా ! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది.

నలు దిశలందు వెలుగులు

నలు దిశలందు వెలుగులు

ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.

దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే

దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం,దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది,దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.

ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది.ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు (కంటికి సంబంధించిన వ్యాధి. షుగరు వ్యాధి గ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు.

నువ్వుల నూనే దీపపు కిరణాల వల్ల

నువ్వుల నూనే దీపపు కిరణాల వల్ల

నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు (cataract) రావు. ఆవునేయి, నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి (eye sight)ని మెరుగుపరుస్తాయి.

అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది. మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, మనకు మేలు చేస్తాయి. శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని. ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.

English summary
According to Indian Hindu Tradition all hindus light lamp infront of God intheir houses.Few light the diya in the morning few people do this at night. Light is a symbol of hope and Knowledge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X