వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళిని ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ నాడే నాలుగు ఇతివృత్తాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా , యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

పూర్వం బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది ఈ రోజే !రావణుని చంపి రాముడు సీతమ్మతో కలిసి వెళ్ళి భరతుని చూసినది ఈ రోజే! క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కృష్ణుడు వెంట నుండగా హతమార్చినది ఈ రోజే!

విక్రమార్కుడు శత్రు విజయాన్ని సాదించి తన పేర శకము ప్రారంభించినది ఈ రోజే! "దీపావళి పర్వదినము". అలాంటి శుభదినం గూర్చి తెల్సుకుందాము.

సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి పరమానంద భరితులై జరుపుకునే పండుగే "దీపావళి". ఆశ్వయుజ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని నరక చరుర్దశిగా ప్రజలు పిలుసుకుంటారు. టపాకాయలు కాల్చి ఆచరించుకునే పండుగ కాబట్టి పిల్లలు ఈ పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.

దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయనే నమ్మకం వల్ల ఇది ఆరోగ్యకరమైన ఆచారం అనే వాదన జనులలో బహుళ వ్యాప్తిలో ఉంది. " దీపావళి రోజు సాయంత్రం కాగానే ప్రమిదలలో వత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఇంటి ముందు ,వరండాలలో దీపాలు వెలిగిస్తారు.

దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. ఊరికి దీపం బడి - మనిషికి దీపం నడవడి అంటారు.

దీపావళి రోజుకు గల ప్రాముఖ్యత

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి. అంతకు ముందు కొందరు ధన త్రయోదశి అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును కొన్నిచోట్ల బలి పాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు. వజ్ర, వైఢూర్యాలు, మణి మాణిఖ్యాలు మొదలగు అనేక వస్తువులను దానమివ్వడమే కాక తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి.

బలిని ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది.

కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి.

ధనత్రయోదశి లేక ధన్ తేరస్ లేక యమ త్రయోదశి (మొదటిరోజు), నరకచతుర్దశి (రెండవ రోజు), దీపావళి (మూడవ రోజు), బలిపాడ్యమి (నాల్గవ రోజు), భ్రాతృ ద్వితీయ లేక యమ ద్వితీయ (ఆఖరుగా ఐదవ రోజు) జరుపుకుంటారు.

మరో ఇతివృత్తం :

- దీపావళి జరుపుకోవడం మూడు, ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఒక పద్ధతి అయితే పండుగను ఆచరించుటలో మరియొక పద్ధతి కూడ దర్శనం అవుతుంది. ప్రధానంగా నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్య దానం, శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట ( భరత్ మిలాప్ అని పిలుస్తారు ), విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం, ప్రధాన ఇతి వృత్తాలుగా కనబడుతాయి.

దీపం "దైవ స్వరూపం" సాధారణంగా యమదీపం - త్రయోదశి నాటి సాయంకాలం ఇంటి బయట యముని కొరకు దీపం వెలిగించడం వల్ల అపమృత్యువు నశిస్తుంది అని అంటారు. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపదానాన్ని చేస్తే మానవుడు యమ మార్గాధికారం నుండి విముక్తుడవుతాడని అచంచల విశ్వాసంగా వస్తూంది.

ఈ అయిదు రోజులలో ఏం చేయాలి

ఆశ్వయుజ బహు ళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలలోనూ మరియు కార్తిక శుద్ధ పాడ్యమి, విదియలలోనూ ... ఈ అయిదు రోజులలోనూ సాయంత్రం తొలి నక్షత్రం కనబడే వేళకు పూజగదిలోనూ, తులసికోట వద్ద, ఇంటి గుమ్మాలవద్ద దీపాలనువెలిగించాలి.

రోజువారీగా చేయవలసిన విధులు:

రోజువారీగా చేయవలసిన విధులు:

1. ధనత్రయోదశి నాడు: ఆయుర్వేదానికి అధి దైవతమైన ధన్వంతరి ఆవిర్భవించిన రోజు. కనుక ఈ రోజు ధన్వంతరిని పూజించిన వారికి పూర్ణాయుర్దాయం, పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ధనపతి అయిన కుబేర పూజ, శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాచరణం చేయాలి. దాని వలన ధన, కనక, వస్తు వాహన సమృద్ధి కలుగుతాయి.

 నరక చతుర్దశి నాడు

నరక చతుర్దశి నాడు

2. రెండవ రోజు నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం (అంటే తలనుంచి పాదాల వరకూ నువ్వుల నూనె పట్టించుకుని ఆపైన నలుగుపిండితో రుద్దుకుని కుంకుడు కాయలు / షికాకాయ పొడితో తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని పేరు.

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ,

వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ.

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే.

అని యమనామములను పఠించి తర్పణములనీయాలి. దీనివలన అకాల మృత్యుదోషములు తొలగి పోతాయి.

ఉల్కాదానం ( గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మ కు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్ల నువ్వులను చిన్న చిన్న మూటలుగా కట్టి వెలిగించి ఉత్తరం నుంచి దక్షిణం వైపు పడవేయటం )దీనికే దివిటీలను వెలిగించటమని పేరు.

సంధ్యా దీపాన్ని వెలిగించవలె.
ఈ విధుల వల్ల మన పితరులు జ్యోతిరాది మార్గంలో బ్రహ్మ లోకానికి చేరుకుంటారని ధర్మశాస్త్రం చెబుతుంది. మానవులకు నరకబాధ ఉండదు కనుక దానికి నరక చతుర్దశి అని పేరు.

ధనలక్ష్మీ పూజ

ధనలక్ష్మీ పూజ

3. మూడవ రోజున సాయంకాలం ధనలక్ష్మీ పూజను చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి.ఈ దీపముల వరుసలతో అలంకరించుకుంటాము కనుక ఈ రోజును దీపావళి అంటారు.
అలాగే సత్యభామదేవి నరకుని సంహరించిన రోజు నరక చతుర్దశి. ఆ ఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడితో ఆశ్వీయుజంలో చివరి ఈ మూడు రోజుల పండగ వల్ల మన పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట.

బలిచక్రవర్తి

బలిచక్రవర్తి

4. బలి పాడ్యమి ఇది కార్తీక మాసంలో శుక్ల పక్షంలో తొలి తిథి. ఈ రోజు వామనుని అనుమతితో బలిచక్రవర్తి భూలోక సంచారం ప్రతి ఇంటికీ వస్తాడట. ఆయన రాకను స్వాగతిస్తూ లక్ష్మీ నిలయములైన దీపములతో వారికి స్వాగతం పలుకుతారు. ఈ స్వాగత దీపములను ఇలా రాజ ద్వారములలో దేవాలయాల్లో, నదీతీరాలలో, తమ తమ గృహాల్లో నెలపొడుగునా వెలిగించాలి. ముఖ్యంగా శివ, విష్ణు ఆలయాల్లో ధ్వజ స్తంభంపై గగన తలంలో వెలిగించాలి. దీనికే ఆకాశ దీపారంభం అని కూడా పేరు. వాడవాడలా దీన్ని ఒక మహోత్సవంగా జరుపుతారు.

యమ ద్వితీయ

యమ ద్వితీయ

5. యమ ద్వితీయ( భగినీహస్త భోజనం )
ఇది కార్తీక శుక్ల ద్వితీయ (విదియ) నాడు జరుపవలసిన పండుగ. కృత యుగంలో యముడీ తిథినాడు తన సోదరి అయిన యమున ఇంటికి అతిథిగా వెళ్ళినాడట. అందుకని నాటి నుండి ఈ తిథినాడు నరలోకమున సోదరులందరూ తమ సోదరి చేతి భోజనముచేసి వారికి విలువైన కానుకలనిచ్చుట సంప్రదాయమైనది.ఇలా ఈ అయిదు లక్ష్మీ ప్రదాయకములైన అయిదు వరుస పండుగలైనవి.

ప్రతి కుటుంబం నుండి ఎంతో కొంత సాటి సంఘజీవులైన పేదవారికి,అనాధలకు,ఎవరు దిక్కులేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, వారి జీవితంలో చీకటిని అలుముకున్న దానిని పారద్రోలి వెలుగులు నింప వలసిన ముఖ్యమైన రోజు ఇది. అది ఎలాగంటే గత జన్మలో మనం చేసిన ఏ పుణ్యఫలంగానో ప్రస్తుత జన్మలో ఎంతో కొంత భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సౌఖర్యాలతో జీవిస్తున్నాం.వాస్తవానికి దీపావళి అంటే మన ఆత్మీయులతో గడపడం కాదు.ఏమిలేని వారితో గడిపి వారి ముఖంలో కాంతులు వెలిగేలాగ మన సహాయం వారికి తోడ్పడాలి. ఈ ఒక్క రోజైన వారి కళ్ళలో కాంతులు,ముఖంలో చిరునవ్వును పంచగలిగిన వాళ్ళం మనమే ఎందుకు అవ్వకూడదు.

పేద వారికి,ఎవరు దిక్కులేని వారికి,అనాధలకు మన శక్తి కొలది వారికి కొత్త బట్టలు,స్వీట్స్,మంచి ఆహారం లేదా ధన,వస్తు రూపేణ ఈ దీపావళి రోజు అందిస్తే వారి మనస్సు ఎంత సంతోష పడుతుందో ఒక్కసారి ఆలోచించి ఈ సత్కార్యానికి కంకణం కట్టండి.ఇలా ఈ పండగ రోజు పేదవారి జీవితాలలో ఆనందానికి కారణం ఏవరు అవుతారో వారికి వారి కుంటుంబానికి సహస్ర ఆయూత చండి యాగాలు చేసిన పుణ్యఫలం వస్తుంది.దీనితో పాటు ఏలినాటి శని,కుజదోషం,కాలసర్పదోషం మొదలగు అనేక దోషాల నివారణకు చక్కని తరుణోపాయం.

మనం బాగుండాలి మన కుటుంబ సభ్యులు బాగుండాలి అని అనుకునే వారు ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటేనే ఆ ఫలితం లభిస్తుంది.గుడి హూండిలో డబ్బులు వేసే కన్న గుడి మెట్ల మీద కూర్చున్న నిస్సహాయులకు సహాయం చేస్తే వారి అంతరాత్మ చెందే ఆనందం వేద మంత్రాలతో ఆశీర్వదించిన దానికంటే రెట్టింపు ఫలితం మనకు వస్తుంది.ఎదో ఒక రకంగా సాటివారికి సహయపడతారని,దైవ స్వరూపులైన మీరు అచరణలో పెడతారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ.

కౌముదీ మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రారాక్షసం గ్రంధంలో వివరించినట్లు కూడ తెలుస్తూంది.

English summary
Diwali is a Hindu festival of lights, which is celebrated every autumn in the northern hemisphere (spring in southern hemisphere).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X