వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిలోచన గౌరీ వ్రతం, పూజా విధానం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

కార్తీక మాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేసుకుంటారు.

సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు.

వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు.
వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం.

అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు.
ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది.ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం.

ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు.

What is Trilochana Gauri Vratam andd what is procedure?

అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి.
కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి.ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది.

దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత
పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం.

ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక.

ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు.
అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా.

అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు.
తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో
అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.
అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే
అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు.
ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది.అవేమిటో గమనిద్దాం.ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.

"మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.

"స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.

"ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి..

"దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు,పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు.కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.

"ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది.

"క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.

నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.

సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.

కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం.

మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది.నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు.సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి. జై శ్రీమన్నారాయణ.

English summary
What is Trilochana Gauri Vratam? Trilochana Gowri Vratam, Trilochana Gowri Vratam procedure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X