వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

యోగసాధన ప్రవక్త పతంజలి అని అంటారు.యోగసాధన ద్వారా విముక్తిని పొందవచ్చునని విశ్వసించేదే యోగ దర్శనం.పతంజలి క్రీస్తు పూర్వం మూడు లేక రెండవ శతాబ్ధంలో జన్మించాడు అంటారు.ఖచ్చితమైన సంవంత్సరం మాత్రం తెలియదు. సంఖ్య జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించగా.యోగం మాత్రం సాధన మార్గాన్ని సూచిస్తుంది.ఇది ఆచరణాత్మకం.అంటే జ్ఞానం మాత్రమే చాలదనీ,యోగం ద్వారా ఇంద్రియాలను,మనసునూ నిగ్రహించగలిగితేనే మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని దర్శనం సూచిస్తుంది. పతంజలి దృష్టి యోగం అంటే మనస్సును అదుపులో పెట్టుకోవడం యోగసాధకులు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.అష్టాంగ యోగ అంటే.

what is use of yoga

1) యమము: అంటే అహింస ఉండారాదు,దొంగతనం కూడదు,బ్రహ్మచర్యం పాటించాలి,సత్య సంధత పాటించాలి,కానుకలు,లంచాలు తీసుకోవద్దు.

2) నియమాలు: అంటే 1) శౌచము.2) సంతోషం 3) తపస్సు 4) స్వాధ్యాయము (Self study). 5) ఈశ్వర ప్రణిధానము( ఈశ్వరుని ఉపాసించుట) ఇవి ఐదు ఉండాలి.

3) ఆసనము : అంటే సుఖముగా కూర్చుని ధ్యానం చేయాలి.

4) ప్రాణాయానము: ఉచ్వాస నిశ్వాసలపై మనస్సును అదుపు సాధించడం,అంటే కాసేపు ఊపిరి పీల్చకుండా ఉండగలగడం.

5) ప్రత్యాహారము: అంటే ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడం.

6) ధారణము: అంటే మనస్సుపై అదుపు సాధించడం.

7) ధ్యానము: అంటే ఏకాగ్రతతో ధ్యానించడం.

8) సమాధి: ఆంటే పై తెలిపిన ఏడు మార్గాల వలన లభించేదే సమాధి స్థితి,యోగలో ఇది చరమాంకం.

నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.

ధ్యానం - మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.

ధ్యానం - ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.

ధ్యానం - పంచేంద్రియాల ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.

ధ్యానం - మనస్సు యొక్క నిశ్చలత్వం.

ధ్యానం - మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.

ధ్యానం - ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.

ధ్యానం - అంతరంగ చైతన్యముకు చేరువకావడం.

ధ్యానం - హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందరో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం.

ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.

ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.

పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువుల వరకు అలానే ఎందరో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానం వలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావ సమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది.

అంతే కాదు సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యాన సాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.

ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పెకిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ ఉంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి.

ఇదే రీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూంటాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి.

ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి. ధ్యానమంటేకొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళు మూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీ పనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.

ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యాన స్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యాన వస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యాన వస్తువు అంటూ ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి.

ధ్యాన కేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస.... అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట, ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసాడు.

మహర్షుల నుండి ఇంద్రాది దేవతలవరకు మహాయోగులనుండి ముముక్షువులవరకు సద్గురువులనుండి సత్ సాధకుల వరకు ప్రతిఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.

ధ్యానాభ్యాసం చేసేవారికి ఇది అనుభవంలో ఉంటుంది. సామాన్య మానవుడు అలుపు లేకుండా ధ్యానం చెయ్యగల సమయం ఖచ్చితంగా 48 నిమిషాల కాలమే. సాధారణంగా ధ్యానపు ఒక సెషన్ ముగించి సమయాన్ని చూస్తే ఖచ్చితంగా 45 నుంచి 50 నిముషాల మధ్యలోపే ఉంటుంది.కావాలంటే గమనించండి.

అంతేకాదు మీరు ఏదైనా పనిని ఉదాహరణకు ఆఫీస్ లో ఒక పనిని ఏకధాటిగా చేస్తూ పోతే 48 నిమిషాల తర్వాత మీకు కొంత రెస్ట్ అవసరం అనిపిస్తుంది.

ఎందుకంటే సామాన్య మానవుని మెదడు ఈ సమయం తర్వాత కొంత రిలాక్సేషన్ కోరుకుంటుంది.దీనిని కూడా గమనించండి. ఎందుకంటే మెదడులో రెండు సగభాగాలుంటాయి. ఒక్కొక్క భాగమూ రోజులో ఉన్న 24 గంటలకు సూచికగా 24 నిముషాలు మాత్రమే ధ్యానంలో ఉండగలదు.అలా మెదడులోని రెండు భాగాలూ కలసి 48 నిమిషాలు మాత్రమే అలుపు లేకుండా ధ్యానంలో ఉండగలదు.

అంటే సామాన్య మానవుడు కొంత సమయం పాటు మాత్రమే ధ్యానం చెయ్యగలడు.దానిని దాటి ఇంకొక 48 నిముషాల పాటు చెయ్యగలిగితే ఒక మన్వంతరాన్ని దాటి ఇంకొక మన్వంతరంలో అడుగుపెట్టే శక్తి వస్తుంది.అప్పుడే సాధకుడు సూక్ష్మలోకాలను దర్శించగలుగుతాడు.సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతాడు.అలా చెయ్యాలంటే కనీసం 2x48=96 నిముషాల పాటు ఏకధాటిగా ధ్యానం చేసే శక్తి సామర్ధ్యం కలిగి ఉండాలి.ఇది ధ్యానాభ్యాసంలో మినిమం స్థాయి.అక్కడ నుంచి ఒక్కొక్క మన్వంతరాన్ని దాటుతూ వెళ్ళ గలిగితే అప్పుడు విశ్వంలోని ఇంకాఇంకా అతీత ములైన విషయాలను గ్రహించే సామర్ధ్యం అతనికి కలుగు తుంది.

అంటే 48 నిమిషాలను ఒక యూనిట్ గా తీసుకుని ధ్యాన సమయాన్ని పెంచుతూ పోవాలి.

అంతరిక సాధనలో ఇదొక చిన్న రహస్యం.ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి.

భౌతిక దేహానికి ఆహారం ఎటువంటిదో ,ఆధ్యాత్మీక జీవితానికి ధ్యానం అటువంటిది.ధ్యానం చేయడం వలన మానవుడు అత్యంత శక్తిమంతుడు అవుతాడు.ఏకాగ్రత తో అంతర్ముఖం అయినప్పుడు , బాహ్యమైన గందరగోళాల నుండి విముక్తమై, అత్యధికమైన శక్తిని సమకూర్చుకుని తన పనులు చేసుకోగలుగుతాడు.ఈ ధ్యానం వలన నిగ్రహశక్తి ప్రశాంతత అలవడుతుంది. ధ్యానంలో జీవిత క్రమాన్ని చూసే వ్యక్తి సమయాన్నీ వ్యర్థం చేయడు.ధ్యాని శక్తి అనవసరంగా వ్యర్థం కాదు. తనకు లభించిన అవకాశాల్ని వ్యర్థం చేసుకొడు. అతడి లో అంతర్గతంగా సమస్త కార్య కలాపాలు రూపు దిద్దుకుంటాయి.

మనకి కనిపించేవి వాటి ప్రతి రూపాలు. అతడు దివ్యమైన జీవితాన్ని పంచుకోగలుగుతాడు. ఈ కారణంగా అతడికి దివ్యశక్తి కూడా లభిస్తుంది. ధ్యానం ఒక క్రియాత్మక జీవితాన్ని ప్రసాదిస్తుంది.అతడి వాక్కు శక్తి వంతం అవుతుంది. ప్రతి పనిలో ఒక క్రమత్వం పరి పూర్ణత్వం వస్తాయి.పూర్వకాలమ్ నుండి జ్ఞానుల మార్గంలోనే ఈ ప్రపంచం నడుస్తున్నది.క్రమ పద్ధతిలో యోగ సాధన చేసినవారు భావితరాలవారికి మార్గదర్శకము అవుతూ ఉన్నారు.ప్రస్తుత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడి గారు యోగలో ఉన్న మహత్యాన్ని పసిగట్టారు కాబట్టే తన దేశ ప్రజలకు ఈ యోగ ఉపయోగపడాలని అనేక మార్గాలుగా ఈ యోగా విధ్యను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు.యోగా చేయాలంటే ఒక యోగం కావాలి.మనమందరం ప్రతిరోజు యోగాభ్యాసం చేద్దాం సంపూర్ణ ఆరోగ్యానందంతో జీవిద్దాం.

English summary
Yoga philosophy is believed to be liberating through the practice of yoga. While the nation of the path of knowledge is proposed, the Yoga refers to the path of practice. This is practical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X