వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధిని జయించొచ్చా ? జయించాలంటే ఏం చేయాలి ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

రమణ మహర్షిని ఒకనాడు ఓ భక్తుడు తనకున్న సందేహాన్ని స్వామివారితో విన్నవించుకున్నాడు. స్వామి ! నాకు ఎన్నాళ్ళుగానో నా మనస్సులో ఒక సందేహం కలుగుతుంది. అదేమిటంటే అసలు మనకు "విధి" అన్నది ఉందా ? ఏది ఎలా జరుగవలెనని ఉందో అలాగే జరిగేటట్లయితే మన ప్రార్థనల వలన ప్రయత్నాల వలన ప్రయోజనం ఉంటుందా ? మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండవలెనా ?

ఆ భక్తుని అమాయక ప్రశ్నకు చిరునవ్వు నవ్వుతూ మహర్షి ఇలా సెలవిచ్చారు .... విధిని గురించి తెలుసుకోవాలంటే రెండే మార్గాలు ఉన్నాయి .

what is vidhi

ఒకటి - విధిని జయించడం.

రెండవది - విధి నుంచి విడిగా,
స్వతంత్రంగా ఉండడం.

మొదటిది :- ఈ విధి ఎవరికి ? అని విచారించి, అహంకారం మాత్రమే విధికి లోబడి ఉన్నదని ఆత్మకు విధి అన్నదే లేదని నిజానికి అహంకారానికి అస్సలు ఉనికేలేదని తెలుసుకోవడం.

రెండవది :- తన నిస్సహాయతను గుర్తించి ఎల్ల వేళలా "ప్రభూ! నీవే సర్వమూ! నేనుకాదు. అని అనుకుంటూ నేను, నాది అన్న భావాన్ని వదలి నిన్ను ఆయనకు ఇష్టమైన విధంగా చేసుకోమని అహాన్ని చంపి ఆయనకు పూర్ణ శరణాగతి చెందడం. దైవం దగ్గర నుంచి అది, ఇది కావాలి అని అనుకున్నంత కాలం ఆ శరణాగతి పూర్ణంకాదు పైగా దైవం ఎడల శరణాగతి పొందడం కుదరదు.

కానీ శరణాగతి చెందడానికి పూర్వం పూర్వజన్మల్లోనో, ఈ జన్మలోనో మనో నాశనానికి అవసరమయ్యే అన్నిరకాల సాధనలూ, శ్రమలూ పడి అహంకారాన్ని చంపిన వారికే గురువు అనుగ్రహం లభిస్తుంది.

భక్తుడు :- స్వామి ! మనసు + చిత్తు కలిపి జీవుడు. ఆత్మ సిద్దిని కోరేది ఏది ? దారిలో ఏది అడ్డు పడుతోంది ? ఆ ఆటంకము మనసు అని చిత్తు సహాయ పడుతుందని అంటారే!

మహర్షి :- మనము మనసు + ఆత్మ ప్రతి బింబమును కలిపి జీవుడని వర్ణిస్తున్నా నిజానికి జీవితం ఆ రెంటినీ వేరుచేయ వీలుకాదు కదా! తెల్లగుడ్డ నుంచి తెలుపును ఎర్రగా కాలిన ఇనుము నుంచి అగ్నిని వేరు చేయలేము అని మనం అనుకున్నాం కదా!

అదే విధంగా మనసును, చిత్తును వేరు చేయలేము. మనసు తానుగా ఏమీ చేయలేదు. అది చిత్తులో కలిసే వెలుపలికి వస్తుంది. ఆ చిత్తు లేకుండా మంచిగానీ, చెడుగానీ చేయలేదు మనసు. మంచికి గానీ, చెడుకు గానీ మనసును ప్రవర్తింపజేస్తుంటే ఆ పనులవల్ల కలిగే సంతోషంగానీ, దుఃఖంగానీ, చిత్తు ఎప్పుడూ అలాగే ఉండడంవల్ల అది వేటినీ అనుభవించదు."కాలిన ఇనుమును సుత్తితో కొడుతున్నపుడు సుత్తి దెబ్బలు ఇనుముకే గానీ అగ్నికి కాదుకదా!" అని ప్రియంగా తెలియజేసారు.

English summary
I have a doubt in my mind that I have been. Is that what we have "fate"? Is it possible to do what is going to happen if our prayers will benefit from efforts? Should we have nothing to do?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X