• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీపావళి పండుగ: నరక చతుర్దశి రోజు ఏం చేయాలి?

|

నేటి పంచాంగం

తేదీ: 06 - 11 - 2018,

మంగళవారం, ( భౌమ్య వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ఋతువు,

ఆశ్వయుజమాసం,

బహుళపక్షం,

తిధి : చతుర్ధశి రా 10.01,

తదుపరి అమావాస్య,

నక్షత్రం : చిత్త రా 8.22

తదుపరి స్వాతి,

యోగం : ప్రీతి రా 9.09

తదుపరి ఆయుష్మాన్,

కరణం. : భద్ర /విష్ఠి ఉ10.38

తదుపరి శకుని రా10.01

ఆ తదుపరి చతుష్పాత్,

సూర్యరాశి : తుల

చంద్రరాశి : కన్య

సూర్యోదయం : 6.04

సూర్యాస్తమయం : 5.24

రాహుకాలం. : మ3.00 - 4.30

యమగండం. : ఉ9.00 - 10.30

వర్జ్యం : ఉ.శే.వ6.19వరకు

రా.తె1.55 - 3.30

దుర్ముహూర్తం. : ఉ8.20 -9.05

& రా10.28 - 11.19

అమృతకాలం. : మ2.07 -3.41,

నేటివిశేషం

*నరకచతుర్దశి*

*మాసశివరాత్రి*

*యమతర్పణం*

what we should do on narak chaturdashi?

దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మిదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు.

తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి.

ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది.

"సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః" ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు.

ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.

అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా 'యమాయయః తర్పయామి' అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.

నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.

1. యమాయ నమః

2. మృత్యువేనమః

3. వైవస్వతాయనమః

4. సర్వభూతక్షయా నమః

5. బధ్ధ్నాయనమః

6. పరమేష్టినే నమః

7. చిత్రాయ నమః

8. ధర్మరాజాయ నమః

9. అంతకాయ నమః

10. కాలాయ నమః

11. ఔదుంబరాయ నమః

12. నీలాయ నమః

13. వృకోదరాయ నమః

14. చిత్రగుప్తాయతే నమః -

అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను.

యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది.

కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.

ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు.

కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

యమ నామములనుచ్చరించుచూ మూడు మూడు దోసీళ్ళ నీళ్ళు తర్పణమివ్వవలెను.

దీపావళి రోజు ఆయుర్వృద్ధి కోసం యమ తర్పణం

"చతుర్దశ్యాం తు యే దీపాన్‌, నరకాయ దదాతి చ |

తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

శ్లో|| యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయచ౹

వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ౹౹

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే౹

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః౹౹.

అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గ నివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పురాణాలు చెబుతున్నాయి....

సమస్త లోకా సుఖినోభవంతు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The festival of lights, Diwali is not limited to just one single day. Infact, it is celebrated for four continuous days, during which gods and goddesses are invoked to bestow their blessing on us and our homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more