వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020లో పంచాంగ రీత్యా ఎలాంటి సంఘటనలు జరగబోతాయి...?

|
Google Oneindia TeluguNews

2020 లో పంచాంగ రిత్య జరగబోవు సంఘటనలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

* శార్వరి అంటే అర్ధం 'కటిక చీకటి' లేదా రాత్రి అని అర్దాన్ని సూచిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో దేశ ప్రజలు సుమారు ఎక్కువ శాతం నిరుత్సాహంతో, ప్రశాంతత లేకుండా జీవించే ఆస్కారం ఎక్కువగా గోచరిస్తుంది. నా ఉద్దేశ్యం ఎవరిని భయబ్రాంతులకు గురిచేయాలని ఎంత మాత్రం కాదు. నా గురువుల ఆశీస్సులతో నాకున్న పరిజ్ఞానంతో ఈ సంవత్సరం పంచాంగా రిత్య గ్రహగమనాలు, స్థితి గతుల కారణంగా ఫలితాలను తెలియజేస్తున్నాను.

దేశ గోచారంలో భారతదేశం మకరరాశిలోకి వస్తుంది అధిపతి శని అవుతాడు. శ్రీ శార్వరి నామ సంవత్సరములో వర్షలగ్నం:- చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభము కర్కాటకలగ్నంలో ప్రవేశము జరిగినది. లగ్నాదిగా 6వ స్థానమున గురువు, కేతువులు, 7వ స్థానమున కుజుడు శని, 8వ స్థానమున బుధుడు, 9వ స్థానమున రవి, చంద్రులు, 10వ స్థానమున శుక్రుడు, 12వ స్థానమున రాహువు సంచరించుచున్నారు.

What will happen in 2020 according to Panchangam?

జగర్లగ్నం:- చైత్రమాసమున రవి మేషరాశి ప్రవేశకాలము తులా లగ్నంలో ప్రవేశము జరిగినది. లగ్నాదిగా 3వ స్థానములో కేతువు, చంద్రుడు, 4వ స్థానములో శని, కుజుడు, గురువు, 6వ స్థానములో బుధుడు, 7వ స్థానములో రవి 8వ స్థానములో శుక్రుడు, 9వ స్థానములో రాహువు సంచరించుచున్నారు. వర్ష, జగర్లగ్న గ్రహ సంపత్తిని పరిశీలించగా దేశంలో అనేక సరికొత్త ప్రణాళికలను ఏర్పాటు చేస్తారు.

సర్వ సాధారణంగా ఉగాది పండగ వచ్చింది అంటే సంతోషాలను తెస్తుంది అని సహజంగా భావిస్తాం కానీ అందుకు విరుద్ధంగా ఈ సంవత్సర గోచార గ్రహస్థితి కనబడుతుంది. ఎక్కవ శాతం పండగ పర్వదినాలలో ముప్పు పొంచి ఉన్నట్టుగా గోచరిస్తుంది. తెలంగాణా ప్రజలు నిలకడను కోల్పోతారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రోత్సాహామునిచ్చును. వాటిలో అధికార దుర్వినియోగము ఎక్కువైతుంది. పారిశ్రామిక రంగమువారు లాభాల బాటలో కొనసాగుతారు. గ్యాస్, విద్యుత్, పెట్రోల్ రంగాలలో ధరలు నిలకడ తప్పి ధరలు పెరుగును.

చిన్నతరహా వ్యాపారులు చేతివృత్తుల వారికి ప్రభుత్వము చేయూత నిస్తుంది. బంగారము, నిత్యావసర ధాన్యము, పేపరు ధరలు పెరుగును. హిందూ ధర్మముపై అన్య మతాల చెడుప్రచారము అధికమగును. అన్నిరంగములందు కూడా కొద్దిగొప్పో అభివృద్ధి అనుకూలతలుండును. ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఒడిదుడుకులుగా యుండును. సరిహద్దు దేశాలతో కొంత అభిప్రాయ బేధములు కలిగే సూచనలు కనబడుచున్నవి. అయినను భారత ప్రభుత్వము సమర్థవంతముగా వాటిని ఎదుర్కొని పరిష్కరించును.

ఆంధ్రరాష్ట్ర కోస్తా జిల్లాలలో ప్రకృతి వైపరీత్యములు కలుగును. ప్రజలు జబ్బులకు, అంటురోగాలకు గురౌతారు. పంటలు, ఉత్పత్తులు ధరలు సామాన్యముగా ఉంటాయి. సినీరంగానికి కొత్త తారలు ప్రవేశం చేస్తారు. శబరిమలైలో అలజడి,అపశ్రుతులు కలుగకుండా ఎంత జాగ్రత్తలు చేసినను ఇబ్బందులు కలుగును. ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఎక్కువ జాగ్రత్తలు అవసరమగును. సాఫ్ట్ వేర్ రంగములో అనేక మార్పుల వలననే అభివృద్ధి కలుగును. ఇంజనీరింగ్, వైద్య విద్యలో అనేక మార్పులు సంభవించును.

రక్షణరంగము ఎంత శ్రద్ధ వహించినా నక్సల్ ఇబ్బందులు కలుగక తప్పదు. ఉక్కుపాదముతో అణచినా టెర్రరిజమ్, నక్సల్, రౌడీయిజాలు ప్రబలుచుండును. నాసా కేంద్ర పనితీరు యంత్రముల తయారీ విధానము అనేక దేశాలకు మార్గదర్శకముగా నిలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బాగున్నప్పటికి కొంత అభిప్రాయబేధములు ప్రతిపక్షాలలో, ప్రజలలో ప్రభావం చూపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రముల నీటి పంపకాలు, ఇతర పంపకాల విషయంలో మళ్లీ రచ్చ తెరలేపుతుంది.

క్రీడారంగంలో ఆశించిన ఫలితములు రాకున్నను తగు మాత్రము కీర్తి ప్రతిష్టలకు కొదువలేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రములలో రాజకీయములలో సంచలన వార్తలు,మార్పులు చేర్పులు కలుగుతాయి. రైలు, విమాన ప్రమాదములు గతము కంటే తక్కువైతాయి. రాజకీయనాయకులపై , వ్యాపారుస్తులపై, ధనికవర్గాలపై విజిలెన్స్ దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతాయి. ప్రముఖ రాజకీయనాయకులు ఒకరికి ప్రాణ గండం పొంచి ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఓ ప్రాంతీయ పార్టీ తన ఉనికిని కోల్పోతుంది. పర్యాటక క్షేత్రాలలో ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి.

* కుజ, రాహుల ప్రభావం వలన తీవ్ర ఒడిదుడుకులతో సాగుతాయి.

* అడవులలో , జనవాసాలో అగ్ని ప్రమాదాలు, పశువుల ఆక్రందనలు సూచిస్తున్నాయి.

* ఉత్తర భారతదేశంలో భూ కంపల సూచనలు ఉన్నాయి.

* దోపిడిలు, దొంగతనాలు ఎక్కువౌతాయి, తస్మాత్ జాగ్రత్త .

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలను అప్రమర్ధంగా చూసుకునే భాద్యత మరింత పెరుగుతుంది.

* దేశ, రాష్ట్ర ముఖ్యమైన సమాచారాలు బైటకు రాకుండా పత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్రమర్తతతో ఉండాలి, జాగ్రత్త.

* ఆర్ధిక మాద్యం విపరీతంగా స్వైర విహారం చేయటంతో పాలకులు పైకి గంభీరంగా కనిపించిన లో లోపల చాలా మధన పడే పరిస్థితి ఏర్పడుతుంది.

* జంట నగరాలకు మహర్దశ వస్తుంది.

* దేశ వ్యాప్తంగా భారతీయ జనత పార్టీ బలపడుతుంది.

* Y.S.R.C.P అభివృద్ధి పదంలో ఉంటుంది.

* ఆంధ్ర రాజకీయంలో స్త్రీలకు గౌరవం, ఉన్నత స్థానలో చోటు

* దేశవ్యాప్తంగా ఉన్న ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలకు B.J.P పార్టీ వలన ముప్పు కలుగుతుంది.

* అన్ని వ్యాపారాలు అంతంత మాత్రమే కొనసాగుతాయి.

* నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పడిపోతుంది అందరికి ఋణభారం పెరుగుతుంది.

* విష సంస్కృతీ వలన దేశం పాలిట పెను సమస్యగా మారుతుంది. డ్రగ్స్ మహమ్మారి గ్రామస్థాయికి కుడా వ్యాపిస్తుంది .

* భారత దేశ సరిహద్దులలో ఘర్షణ వైఖరులు గోచరిస్తున్నాయి.

* తీవ్రవాదుల విద్వాంసకర కార్యకలాపాలు, శాంతి భద్రతలు కోల్పోతాయి.

* సముద్రాల నుండి ఉత్పన్నమయ్యే తుఫాను సూచనలు ఉన్నాయి.

* జూన్, జులై, డిసెంబర్ నెలలలో భారత్ లో భూకంపాల సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి.

* శుభాలను ఇచ్చే గురువుకు రెండు ఆదిపత్యాలు కలిగి ఉన్నప్పటికీ మకరరాశిలో నీచస్థితిని పొంది నిస్సహాయుడు కావటం వలన భారత ప్రజలకు 60 % శాంతి, సంతోషం అనేది లేకుండా పోయే అవకాశం ఎక్కువగా సూచిస్తున్నది.

* ఈ ఎండాకాలంలో ప్రజలు తట్టుకోలేనంత మండుటెండలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నీటి కొరత ఉంటుంది.

* ఫ్యాషన్ టెక్నాలజీ మోజులో పడి ఎక్కువ శాతం యువత దారి తప్పుతారు.

* రాజకీయ రంగంలో స్త్రీకి కీలక పదవి ... కానీ ... నిత్య సమస్యలతో వేదన చెందుతారు.

* ప్రజలలో విప్లవాలు చోటు చేసుకుంటాయి.

* బాల నేరాలు పెరుగుతాయి. పిల్లలు అమ్మ నాన్న మాట వినరు, మంచి చెబితే కోపాలు ఎక్కువ,పెద్దల మాటను పెడచెవిన పెడతారు, వారి వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు.

* పిక్ నిక్లు, విహారయాత్రలు,సరదా ఈతలు, సేల్పి ఫొటోమోజు మొదలగు వాటి ద్వారా అపసృతులు చోటు చేసుకుంటాయి.

* ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు దిగజారుడు చర్యలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

* ఓ ముఖ్య రాజకీయ నాయకుని అరెస్ట్ సంచలనం అవుతుంది.

* ఈ సంవత్సరం నకిలీ స్వాముల గుట్టు రట్టు అవుతుంది, ఎన్నో వింతలు విడ్డూరాలు చూడబోతున్నాం.

* హైదరాబాద్ లో ఉగ్రవాదుల మూలాలు బయట పడతాయి ... ఉలిక్కి పడవలసి పరిస్థితి వస్తుంది.

* ఐ.టి కంపనీలు ప్రతికూల వాతావరణం.

* టిక్ టాక్ లు, ఫేస్ బుక్ మొదలగు షోషల్ మీడియా వ్యామోహంలో పడి సెల్ ఫోన్ 'భారం' ఎంతైనా జనాలు జంకకుండా ఫోన్ కు బానిలై సంతోషంగా భరిస్తారు.

* ఎక్కవ భారీ సినిమాలు దివాలా స్థాయిలో, చిన్న సినిమాలు 75 % ముందంజలో ఉంటాయి.

* మానసిక బలహీనతలు, రుగ్మతుల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి.

* స్త్రీలపై Tv సీరియల్స్ ప్రభావం ఎక్కువ అవుతాయి. వాటిని నియంత్రన చేయడం వలన కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది.

* విదేశీ పెళ్లి సంబంధాల మోజులు కొంపలు ముంచుతాయి తస్మాత్ జాగ్రత్త.

* భారత్ , పాకిస్తాన్ సంబంధాలు శృతి మించుతాయి.

* పాకిస్తాన్ నీచ వైకరి వలన 'స్వయం కృతపరాధంతో' ప్రపంచ స్థాయిలో ఒంటరిగా మిగులుతుంది.

* భారతదేశాన్ని పాకిస్తాన్ కవ్విస్తుంది, సమర్ధవంతమైన ప్రభుత్వం, రక్షణ వ్యవస్థ కలిగిన భారత్ చేతిలో చావు దెబ్బ తింటుంది.

* భారత మిలటరీ, పోలీస్ వ్యవస్థ తమ ప్రతిభను చూపిస్తాయి, ప్రతిష్ట పెంచుకుంటాయి.

* దాంపత్య జీవితాలలో పంతాలకు పట్టింపులకు పోయి సామరస్యం లేక అతి సునాయాసంగా విడాకులు తీసుకునేవారు అధికం అవుతారు.

* ఒక యువ రాజకీయ నాయకునికి ప్రమాదం పొంచి ఉంది.

* ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక స్త్రీ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, ప్రాణహాని సూచనలన్నాయి.

* విద్య, వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండదు.

* కిడ్నాప్ లు యధేచ్చగా కొనసాగుతాయి.

* భూముల ధరలు అధికమౌతాయి.

* ఒకే స్థలాన్ని ఎంతో మందికి రిజిస్ట్రేషన్ చేసే మోసాలు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త.

* సేల్పి పిచ్చి ముదిరి ప్రాణ సంకటాలు కొని తెచ్చుకుంటారు.

* ఈ సంవత్సరం పాముకాట్లు అధికం అవుతాయి.

* పాప భీతి లేకండా వ్యాపారాలు ,ఘోరమైన కల్తీ ఆహార పదార్ధాలు ఎక్కువైతాయి.

* సమ్మెలు, ఆందోళనలు ఎక్కువౌతాయి.

* మత కల్లోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

* లవ్ మ్యారేజ్ లకు అనుకూలంగా కాదు, అవి దుర్ఘటనలకు కారణం అవుతాయి.

* తెలుగు రాష్టాలు అభివృద్ధి చెందుతాయి.

English summary
Generally Ugadi means festival of happiness. but this time the situation seems to be the other way round
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X