రేపే చంద్రగ్రహణం: గ్రహణం సమయంలో, ఆ తర్వతా ఏం చేయాలి?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
సంపూర్ణ చంద్ర గ్రహణం వివరాలు:- తేదీ 27 జులై శుక్రవారం రాత్రి 11:54 నుండి - తెలవారితే 28 అనగా 3:49 నిమిషాల వరకు గ్రహణం ఏర్పడనున్నది.ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండములలో కనపడును.

ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దోషం ఉంది :-
ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రములు, మకరరాశిలో గ్రహణం.
మిథునరాశి,
తులరాశి,
మకరరాశి,
కుంభరాశి.
మేష ,వృషభ, మిథున లగ్నములందు గ్రహణం పడుతున్నది కావున ఈ రాశి వారలు గ్రహణమును ప్రత్యేక్షంగా చూడకూడదు.
ఆసక్తి కలిగిన వారు టీవిలలో చూడవచ్చును.
ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంది:-
మేష రాశి , సింహ రాశి , వృశ్చిక రాశి , మీన రాశుల వారికి శుభ ఫలం
.
వృషభ రాశి , కర్కాటక రాశి , కన్యా రాశి , ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలం
.
మిథున రాశి , తులా రాశి , మకర రాశి , కుంభ రాశి వారికి అశుభ ఫలం
గ్రహణం తెల్లవారి చేయవలసిన దానాలు:-
బంగారంతో చేసిన రాహు బింభ ప్రతిమ,
వెండితో చేసిన చంద్ర,కేతు బింభ ప్రతిమ,
ఆవునెయ్యి,
నువ్వులు,
కంచుపాత్ర,
వస్త్రములను,
శక్తికొలది దక్షిణ కలిపి దానమీయవలెను.
ఆర్ధిక స్థోమత లేక పైవి ధానం చేయలేని ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన ధాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.
రావి చెట్టును తాకకుండా పదకొండు ప్రదక్షిణములు ( ఓం నమో భగవతే వాసుదేవాయ ) అని స్మరిస్తూ నెమ్మదిగా తిరగవలెను.
ఆహార నియమాలు:-
సాయంత్రం 5:30 వరకు ఆహారం తీసుకోవచ్చును.సాయంత్రం 5.30 నిమిషాల నుండి రాత్రి 9:30 నిమిషాల వరకు పండ్ల రసాలు , మంచినీళ్ళు త్రాగవచ్చును.ఇవి శారీరక శక్తి లేని వారు వృద్దులు,పిల్లలు,గర్భిణిలకు మాత్రమే.
స్నాన నియమాలు:-
పట్టు స్నానం రాత్రి 11:54 కి, విడుపు స్నానం తెల్లవారు జామున 3:49 లకు. పిల్లలు, అనారోగ్యవంతులు , ముసలివారు,గర్భినిణులు విడుపుస్నానం చేస్తే సరిపోతుంది.అనారోగ్యముతో ఉన్నా,కదలలేని పరిస్థితులలో ఉన్నా దర్భతో నీటిని ప్రోక్షణ చేయటంతో సరిపెట్టవచ్చు.
ఇతర నియమాలు:-
గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్ధాలు ఆ తర్వాత వినియోగించడం మంచిది కాదు, పచ్చళ్ళు,ఇతర నిలువ ఉంచే పదార్ధాలు మొదలైన వాటిపై దర్భలు ( గరిక ) వేయడం మంచిది.
ప్రత్యేక సూచన:- గ్రహణ సమయం చాలా పవిత్రమైనది. దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోడానికి మీకు గురువు ద్వార ఉపదేశం పొందిన మంత్రానుష్టానం చేసుకోవడం తప్పనిసరి.దీని వలన శుభ ఫలితం రెట్టింపు ఉంటుంది.గ్రహణ సమయంలో జపం చేయలేకపోతే గురువు ఇచ్చిన ఉపదేశ ప్రభావం లోపించి మంత్రం మీకు నిష్ప్రయోజనం అవుతుంది.ఉపదేశములేనివారు చంద్ర గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చును.
చంద్ర గాయత్రి :- ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
అనే మంత్రాన్ని గ్రహణ సమయమంతా చేసుకోవడం మంచిది.
గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా కడుక్కొని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక 'టి' స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి.
శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.
ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,
గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది.ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.
గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి సర్వేజనా: సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ.