వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమిటి ఈ బ్రహ్మీ ముహూర్తం?

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

సూర్యోదయానికి 90 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తము అందురు.బ్రహ్మ జ్ఞానా ధ్యానములకు అనుకూల సమయం.బ్రహ్మీ అనగా సరస్వతి.మనలోని బుద్ధి ప్రభోదము చెందే కాలం కావున బ్రహ్మీముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్తం పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు.ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు.

Whata is Brahmi Muhurtam?

ఒక అహోరాత్రంనకు 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి.సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మీముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29 వది బ్రహ్మీముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మీ ముహూర్తం అనే పేరు వచ్చింది.సూర్యోదయంనకు 90 నిమిషాల ముందు కాలం.

ప్రతిరోజు బహ్మీ ముహూర్తమున నిద్ర లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి.బ్రహ్మీమూహూర్తానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు.ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి.కశ్యప బ్రహ్మకు,వినతకు జన్మించిన వాడు అనూరుడు.ఈయన గరుత్మంతునికి సోదరుడు.ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసు కోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది.

అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు.బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకములో మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమని పిలుస్తారు అని చెప్పాడు. ఆ సమయానికి ఏ నక్షత్రాలు, గ్రహలు కూడా కీడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలంలో అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం తెలియజేస్తుంది.

ఈ బ్రహ్మీ ముహూర్త కాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మీముహూర్తం. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం.

ఈ సమయంలో మనసు ప్రశాంతతతో స్వచ్ఛంగా ఉంటుంది. వాప్రశాంత వాతవరణం కూడా ఉంటుంది.
మనసు స్వచ్ఛంగా దైనందిన జీవితంలో ఉండే అలజడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంచుతుంది.ప్రశాంతమైన ఈ సమయంలో మనస్సుకు రాగ ద్వేషాలు లేకుండ ఉపయోగకరంగా ఉంటుంది.

మనసు ఏది చెబితే అది వింటుంది.

ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం వలన మనకు ఆధ్యాత్మిక శక్తి సిద్ధిస్తుంది.

ఉదయాన చల్లని నీటితో తలస్నానం చేయడం చాలా మంచిది.దీని వలన మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మీముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు మొదలగునవి సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మీముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు.

బ్రహ్మీముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది.
అందుకే ఋషులు, యోగులు,
ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.

బ్రహ్మీముహూర్తమున నిద్రలేచిన వారికి అమృతమయమగు వాయువు పీల్చుట చేత మానవుని శరీరం ఆరోగ్యమగును,ముఖము కాంతి వంతంగా వెలుగును.బుద్ధి కుశలత పెరుగును.ఆరోగ్యం,సురక్షితమైన మానసిక స్థితి వలన శరీరం శక్తివంతంగా తయారు అవుతుంది.ఇదియే బ్రహ్మీ ముహూర్తము యొక్క మహాత్మ్యం.

English summary
Astrologer ahs explained what is Brahmi muhurtam and its importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X