వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన శరీరంలోకి వెళ్లిన ఆహారం ఎప్పుడు బయటికి వెళ్లి పోవాలి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనస్సులోని రహస్య ద్వారాలు తీయడానికి ధ్యానం ప్రధానం. ఆ స్థితిలో మనిషి తనకు తానుగా సంక్షిప్తరూపం పొందుతాడు. అదే విధంగా మనిషి అన్ని బాహ్య వ్యాపకాల నుంచి విముక్తి పొందుతాడు. అలాంటి ఆత్మాశ్రయ మనస్థితిలో ఆధ్యాత్మిక జీవితమనే సాగరంలో అతను మునిగిపోతాడు. తద్వారా తమలోని పలు రహస్యాలను ఛేదిస్తారు. ధ్యానం అన్నది ఒక గుణం. అదొక చర్య కాదు. మీరు మీ శరీరాన్ని, మనస్సును, భావోద్వేగాలను, శక్తులను ఒక పరిపక్వ స్థాయికి తీసికొని వెళితే ధ్యానం అదే జరుగుతుంది. అది నేలను సారవంతం చేయడం వంటిది. అవసరమైన ఎరువులు, నీళ్లు ఇవ్వండి, మంచి విత్తనం నాటండి. అది చెట్టు అవుతుంది.

పూలూ, పండ్లూ కాస్తుంది. మీరు కోరుకుంటున్నారు కాబట్టి పూలూ, పళ్లూ రాలేదు. అవి రావడానికి కారణం మీరు అవసరమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం. అదే విధంగా మీరు మీలో అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే మీరెవరన్నది, నాలుగు కోణాలలోనూ (శరీరం, మనస్సు, భావోద్వేగం, శక్తి ) మీలో ధ్యానం సహజంగా వికసిస్తుంది. తన లోపల తాను ఆస్వాదించి ఆనందించే ఒక పరిమళం, ధ్యానం.

సత్యం లేదా నీ వ్యక్తిగత ఆధీనం నుంచి ఎలాంటి ఆలోచనలు నిన్ను పక్కదోవ పట్టించకుండా నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి నీ మనస్సును ప్రశాంతపరిచే విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితిలోకి ప్రవేశించడం... ఆలోచన, ప్రతిబింబం లేదా ఉద్వేగం లేని స్థితిని అనాహుత ప్రవేశంగా పేర్కొంటారు. అప్రయత్న స్థితిలో ఉండే సాధకుడు ప్రస్తుతం అలాగే కొనసాగమని కోరబడుతాడు. ఏకాగ్రతను ఒక 'సాధనం'గా ఉపయోగించడం ద్వారా... ఒక విషయాన్ని పూర్వ స్థితి నుంచి ప్రస్తుతానికి స్థిరంగా తీసుకురావడం, స్పృహ విషయాలకు సంబంధించిన అభిజ్ఞాత్మక విశ్లేషణ లేదా భావనను దూరం చేయడం, అప్రధాన ఆలోచనా ప్రక్రియల యొక్క సహనం, విశ్రాంతిని పెంచడం చేయొచ్చును.

When does the food that is taken in should go out of the body? Here is all

మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్లి పోవాలి. లేకపోతే జబ్బులు.

మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లి పోవాలి. లేకపోతే జబ్బులు.

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.

మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటి వన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా... మనం నిత్య రోగ గ్రస్తులుగా అవుతాం.

కామాశ్చ, క్రోధశ్చ, లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:
జ్ఞాన రత్నప హారాయ తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమునే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.

అందుకే ఋషులు అంటారు... మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్ది కొద్దిగా మరణిస్తున్నాం.
మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా ? పెరిగినట్టా ? మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీలతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.

మనలో చేరి బయటికి వెళ్లి పోకుండా తిష్ట వేసుకొని... మన జీవితాల్ని మృత ప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని... ప్రతి రోజూ ధ్యానం, యోగ చేయడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి. మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం ధ్యానం, యోగాయే...

మానవుని శక్తులు అంతరంగంలోకి తిరిగి తమను తాము సరి చేసుకోవాలి. బాహ్యానికి నష్టం కలిగించకూడదు. లోపల చేయవలసినపని చాలా ఉంది. ఈ భూమండలం మీద, అత్యుత్సాహంతో చాలా శ్రమ చేసే స్వభావం కలిగిన సమాజాలకు మనం పెద్ద ఎత్తున ఈ కోణాన్ని అందించకపోతే వాళ్ల శ్రమ ఈ భూమండలాన్ని నాశనం చేస్తుంది. అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు. రోజూ ధ్యానం, యోగ చేయండి. ఆరోగ్యంగా జీవించండి.

English summary
When does the food that is taken in should go out of the body? Here is all
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X