వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామ దహనం: హోలీ పండుగ ఎప్పుడు, ఎలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

When we should perform Holi?

మన భారతీయ హిందూ సాంప్రదాయ,ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి,నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది.ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది.ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు,ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు,అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది.ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు

పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా పరమేశ్వరుని మనసుని పార్వతిదేవిపై మళ్ళించాలని మన్మధుడు పూలభాణం వేసే సరికి అతడిని భస్మం చేస్తాడు ఈశ్వరుడు.మన్మధుని భార్య అయిన రతీదేవి దుఖించగా శివుడు కనికరించి మన్మధునికి శరీరం లేకున్నప్పటికీ సజీవుడుగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు.మన్మధుడు అంటే కాముడు.ఈ కామదహనం అనేది ఫాల్గుణ పౌర్ణిమి రోజున జరిగినది.కావునఈ రోజు పండగగా చేసుకోవడం ఆచారం అయినది.సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగలోని అంతరార్ధం.

కాముడుని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది.కాముడు ప్రతీ మనిషిలోను అదృష్య రూపంలో అంతట వ్యాపించి ఉంటాడు.ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ,ద్వేష,కామ,క్రోధ,మోహ,మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అను నిత్యం అదుపు చేసుకుని మనస్సుని అధీనంలో పెట్టుకోవాలని సందేశం కనబడుతుంది.మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టి పోతాడు.మనిషిలోని రజో,తామస గుణాలను పారదోలి,సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది.

"మనిషిని మహానీయుడిగా మార్చే మహత్తరశక్తి మనస్సుకు ఉంటుంది,ఆ మనస్సుని అధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది".మనిషి యొక్క మనస్సును,శరీరాన్ని ఆధీనంలో పెట్టుకో గలిగిన వారు మనుషులలో మహానీయులౌతారు.

హోళి పండగను వసంతోత్సవమని,డోలికోత్సవమని,ఫాల్గుణోత్సవమని పిలుస్తారు.శీతకాలపు చలి తగ్గిపోయి ఇంచుమించు వేసవి కాలపు ఎండవేడి ప్రారంభం అయ్యేపర్వం ఈ పండగ వసంతఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తుంది.ఈ రోజున పిల్లలు,పాడిపశువుల పంటల సంరక్షణకై దైవాన్ని స్మరించుకుంటారు.హిరణ్యకశిపుని సోదరి హోళిక మహాశక్తి కలది అగ్నికూడా ఆమెను కాల్చలేదు.దేవతలపై విజయం సాధించిన గర్వంతో హిరణ్యకశిపుడు భగవంతున్ని పూజించ వద్దని ప్రజలను శాసిస్తాడు.తన కోడుకే విష్ణుదేవున్ని ఆరాధించడం వలన తీవ్రకోపోద్రికుడై హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశిపుడు హోళికను ఆజ్ఞాపిస్తే ఆమె అలానే చేసింది.

విష్ణు భగవానుని నిరంతర స్మరణ ప్రభావంచేత హోళిక తన శక్తులన్ని కోల్పోయి బూడిదయ్యింది.హరినామస్మరణచేస్తూ ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆ సంఘటనకు గుర్తుగా హోళి పండుగను జరుపుకోవడం ఆనవాయితి అయ్యిందని కధనం,ఇలా ఈ పండగ వెనక కధలెన్నిఉన్నా ప్రకృతిలోని మార్పు వలన మానవునిలో ఉండే సప్తధాతువులను ఆధీనంలో పెట్టుకుని సాటి జనులచే ప్రేమ,దయ,మొదలగు కరుణావాత్సల్యంగా మెలగాలనే ఉద్యేశ్యంతో ఏర్పడింది.చిన్న,పెద్ద,ఆడ,మగ,పేద,ధనిక అనే తారతమ్య భేదం లేక అందరిమధ్య స్నేహ భావాన్ని పెంచి మనస్సులను ఆనందింపజేసే రంగుల పండుగనేది మాత్రం యధార్ధం.

కామ దహనం మరియు హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి
తేది 01 - 03 - 2018 పౌర్ణమి, గురువారము
సమయం సాయంత్రం 06:19 ని॥ల నుండి రాత్రి 08:46 ని॥ల లోపలే ముఖ్య

గమనిక మిగితా కార్యాలకు ముహూర్తము ఎంత ముఖ్యమో , కామ దహనం ( హోలికా దహనం ) నకు కూడా ముహూర్తము అంతే ముఖ్యము.కావున ముహూర్తమును అనుసరించి పై సూచించిన సమయంలో హోలికా దహనం చేయడం శ్రేయస్కరము.


హోలి పండుగ ( ధులండి ) ఎప్పుడు జరుపుకోవాలి అంటే
తేది : 02 - 03 - 2018 , పాడ్యమి , శుక్రవారము.

పౌర్ణమి ఎప్పటి నుండి ఎప్పటి వరకు కలదు ?
ఈ పౌర్ణమికి హుతాశనీ పౌర్ణిమ అని పేరు. పౌర్ణిమ తేది : 01 - 03 - 2018 , గురువారము,ఉదయం 08:58 ని॥లకు ప్రారంభమై, తేది : 02 - 03 - 2018 , శుక్రవారము ఉదయం 06:21 ని॥లకు ముగుస్తుంది.

ఈ హోళి కామదహనం అనేది దక్షిణ భారతదేశంలో 28 పిబ్రవరి రోజున జరుపుకుంటే, ఉత్తరభారతదేశం మార్చి ఒకటవ తేదిన జరుకుంటున్నారు,వసంతోత్సవం మార్చి రెండవ తేదిన జరుపు కుంటున్నారు. ముఖ్యంగా మనం నివసించే ప్రాంత ఆచార వ్యవహారలను బట్టి పెద్దల నిర్ణయంతో నిర్వహించుకోవడం ఉత్తమం.ఏ పురాణాలైన,ఏ ఇతిహాస కధలైన,ఏ ప్రాంత పెద్దలైన సూచించేది ఒక్కటే అందరు అనందగా జీవితాన్ని గడపాలని సుఖంగా ఉండాలని భావిస్తూ సూచించడం జరుగుతుంది.

English summary
Astrologer explained when we should perform Holi, how it should be performed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X