వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Interesting Facts:ఏ వైపు తిరిగి పడుకోవాలి , పీడకలలు రావడానికి కారణాలేంటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పూర్వ కాలంలో పెద్దలు తమ పిల్లలకు నిద్రించు సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకోమని లేచే సమయంలో కుడివైపుకు తిరిగి లేవమని చెప్పేవారు. దీనికి ప్రధానకారణం భోజనం చేసిన తరువాత ఆహారం అంతయు జఠరకోశం నందు ఉండును. ఆ ఆహారం జీర్ణం అయిన తరువాత జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి పోవుదారి కుడిపక్కనే ఉన్నది.

 జఠరకోశంలో రెండు నుంచి మూడు గంటల..

జఠరకోశంలో రెండు నుంచి మూడు గంటల..

జఠరకోశం నందు ఎంతకాలం జీర్ణక్రియ జరగవలెనో అంతే సమయం తీసికొనును గాని ఆ సమయం కంటే ముందుగా చిన్నప్రేగులలోకి పోయి జీర్ణక్రియ జరగదు. జఠరకోశంలో రెండు నుంచి మూడు గంటల సమయం ఆహారం వచనం జరిగిన అనంతరమే అది చిన్నప్రేగుల్లోకి ప్రవేశించును. ఎప్పుడైతే తిన్న ఆహారం జీర్ణం కాదో అప్పుడు జీర్ణకోశంలో కొన్ని తొందరలు ఉత్పన్నం అగును. దీని పరిణామముగా సరిగ్గా నిద్రరాకపోవుట, పీడకలలు, చిన్నగా కడుపునొప్పి రావడం జరుగును.

 హృదయము నుండి శుద్ధరక్తం దేహము...

హృదయము నుండి శుద్ధరక్తం దేహము...

అదేవిధంగా హృదయం శరీరానికి ఎడమవైపు ఉండును. హృదయము నుండి శుద్ధరక్తం దేహమునందలి అన్ని అంగములకు సరఫరా చేయు ముఖ్యరక్తనాళం "అయోర్టా" ఇది హృదయమునకు కుడిభాగం నుండి మొదలగును. మనం రాత్రి సమయం నందు కుడివైపుకు తిరిగి పరుండిన అయోర్టా నాళము నుండి ప్రవహించు శుద్ధరక్తం కొంచం ఎక్కువుగా స్రవించును. ఈ ఎక్కువ అయిన శుద్ధరక్తం రాత్రిపూట అనగా మనం నిద్రించు సమయంలో శరీరపు అంగాగములకు ఎక్కువ పరిణామములో అక్కరలేదు. మితముగా రక్తం సరఫరా అయినను చాలు . ఇందుచే ఈ అంగములకు ఎక్కువ పనిలేక కావలసినంత విశ్రాంతి లభించును. ఇది ఆరోగ్యముకు చాలా మంచిది .

Recommended Video

Sleeping More May Increase Your Stroke Risk || Oneindia Telugu
 కడుపులో వికారాలు ఎందుకు కలుగుతాయి

కడుపులో వికారాలు ఎందుకు కలుగుతాయి

మనము కుడివైపుకు తిరిగి నిద్రించిన మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణంకాక మునుపే జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి బలవంతం

( ఒత్తిడి ) గా ప్రవేశించే అవకాశం ఉన్నది. దీని వలన కడుపులో వికారాలు కలిగే అవకాశం ఉన్నది. అందువలనే ఎడమవైపు తిరిగి మాత్రమే పడుకొనవలెను . అదేవిధంగా శరీరం నందలి కొన్ని అంగములు విశ్రాంతి లేకుండా పనిచేయును అందులో ముఖ్యమైనది హృదయం. మనం నిద్ర నుండి మేల్కొని లేచునప్పుడు ఎడమవైపు తిరిగి లేచిన శరీరపు కొద్ది భారం ఎడమవైపు ఉన్న హృదయంపైన పడును. ఇందుచే హృదయమునకు కొద్దిగా తొందర కలుగుటచే క్రమేణా హృదయం తన శక్తికి కోల్పొయి బలహీనంగా పరిణమిస్తుంది. అందుకే కుడిపక్కకు తిరిగి నిద్ర నుండి లేవవలెను. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు కలగవు. పూర్వకాలంలో అందరూ ఆరోగ్య సూత్రాలు తూచా తప్పకుండా పాటించారు కాబట్టి వాళ్ళు బలంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే వారు.

English summary
In acient days elderly people used to ask to turn to the left and sleep and while waking up turn to the right and wake up. So there is theory behind this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X