వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగవ గురువు ఎవరు ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

పై శ్లోకము పండిత పామురులందరికీ తెలిసినదే మువ్వురు గురువువులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని స్పష్టముగా అర్దమౌతుంది మరి నాలుగవ గురువు గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చక్కగా వివరించారు గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అజ్జానము తొలగించు వాడు అని అర్ధం గోచరమగుచున్నది మువ్వురకు మూలమూమైనవాడు పరబ్రహ్మ అయినాడు పిపీలకాది సమస్త భూతజాలమును సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మ భగవానుడని స్పష్టమగుచున్నది అట్టి పరబ్రహ్మకు నమస్కరిస్తున్నాను ఇది ఆది శంకరుల వారి అభిప్రాయము ఆదిశంకరాచార్యులు వారు తపస్సంపన్నులు కనుక యదార్ధమును బట్టబయలు చేశాడు కాని మన పండిత విమర్శకులు ఈ సత్యమును దాచి పెట్టారు

who is fourth guru

గురువు ఎలా వుండాలంటే ...

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు.

English summary
The Guru streak continues to unfold in India. The Guru is the original male Sadasiva of tradition. Said him. Kumaraswamy is also a teacher. Ramalakshmana at Vishwamitra, Balaramakrishna at Sandipuni, Bhishma at Parasuram, Arjuna at Droni, Adivasankaras at Govinda Bhagavatpadacharya, Siddhaiah at Virabrahmanagala,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X