వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని దేవుడు అంటే ఎందుకంత భయం..? శనిదోష నివారణకు ఏం చేయాలి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శని త్రయోదశి

07-03-2020 శనివారం
21-03-2020 శనివారం

ఈ మాసం ప్రారంభంలో ప్రత్యేకత ఏమిటంటే ఫాల్గుణ మాసంలో రెండు శని త్రయోదశిలు వస్తున్నాయి ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి శని త్రయోదశి రోజు మన శాస్త్రం చెప్పిన ప్రకారం మనకున్న శని దోషం పోవడానికి మనము చేసే జపం, తర్పణం, పూజ, హోమం, దానం, శని దోషం నివారణ చేస్తాయి. ఇటువంటి మహత్తరమైన శని త్రయోదశి రోజులలో శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు.

ఏల్నాటిశని నడుస్తున్నవారు :-
ధనుస్సు రాశి వారు , ధనస్సురాశి లోని నక్షత్రాలు
మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం

మకర రాశి
ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు

కుంభ రాశి
ధనిష్ఠ 3,4 పాదాలు
శతభిషం 1 2 3 4 పాదాలు
పూర్వాభాద్ర 1 2 3 పాదాలు

అష్టమశని నడుస్తున్నవారు :-
మిధున రాశి వారు అష్టమ శని ప్రభావం లోని నక్షత్రాలు.
మృగశిర 3 4 పాదాలు
ఆరుద్ర. 1 2 3 4 పాదాలు
పునర్వసు 1 2 3 పాదాలు

అర్ధాష్టమ శని నడుస్తున్నవారు :-
తుల రాశి వారు అర్దాష్టమ ప్రభావంలోని నక్షత్రాలు
చిత్త 3 4 పాదాలు
స్వాతి. 1 2 3 4 పాదాలు
విశాఖ. 1 2 3 పాదాలు

Who is lord Shani, Why people are often scared about him?

పైన తెలిపిన రాశులు వారు శనీశ్వరుని ప్రసన్నం చేసుకుని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరు. శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి. ఎలా చేయాలి. తెలుసుకుందాం...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య , కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర,ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

త్రయోదశి వ్రతం:- శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త, పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.

ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

ఆ రోజు మద్య, మాంసాలు ముట్టరాదు.

వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు

నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

ముఖ్యంగా వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.

అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.

ఎవరితోను వాదనలకు దిగరాదు.

ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి.

కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.

అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.

జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.

ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.

అత్త మామలను, వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపద కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.

ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను, భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.

English summary
What is special about the beginning of this month is that there are two Saturn tripods in the Phalguna month. So on the day of Shani Triodashi, our science says that we are doing our own Shani Dosha, the Japana, the reasoning, the pooja, the homam, the donation and the Shani Dosha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X