• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మకర సంక్రాంతి 14న కదా, మరి 15న ఎందుకు చేస్తున్నాం: శాస్త్రం ఏమి చెబుతోంది ?

|

ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటచేత సంక్రాంతి అని అన్నారు.

ఈ పండగకు "సూర్యుడు"పుష్యమాసంన మకరరాశిలో ఏ రోజైతే. ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రమణం అంటారు.పాత పోయి క్రొత్తదనానికి స్వాగతం పలుకురోజు.ఈ రోజు సూర్యుని చుట్టూ. పరిభ్రమించు భూమి దిశను దీనితో సూర్యుడు కోంత ఉత్తరం వైపు మారును కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు.ఈ కాలంలో సూర్యుని సంక్రమణముతో పాటు మానవ శరీరంలో భౌతికపరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి.ఈ దృష్టిచేతనే ఈ పండగను సాంస్కృతిక పరమైన అద్భుత మహత్యము గల పర్వధినంగా మనకు శాస్త్ర ఆధారంగా పెద్దలు నిర్ధేశించినారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారంగా సూర్యభగవానుడు ఏ రోజున మకరరాశిలో ప్రవేశించే పుణ్యఘడియలను ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ అసలు ఖగోళ ప్రకారం సూర్యుడు తేది 14 జనవరి 2019 సోమవారము రోజు రాత్రి 7 : 51 ని॥లకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.ఈ రోజు సంక్రమణ సమయం అయ్యే సరికి రాత్రి కావడం చేత మరసటి రోజు మంగళవారం 15 తేదీ నాడు సూర్యోదయం నుండే మకర సంక్రాతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి.

బాలారిష్టాలు తొలగిపోతాయి

బాలారిష్టాలు తొలగిపోతాయి

మొదటి రోజు తేది 14-జనవరి-2019 సోమవారము రోజున భోగిపండగ ఈ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకోని మనలోని చెడుని అగ్నికి ఆహూతి చేయడమే భోగి ,పాతకు తనానికి స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను,బట్టలను వేసి పీడలను,అరిష్టాలను తోలగించుకుంటారు.ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లనును పోయడం వలన వారికి ఉన్న బాలరిష్ట ఇతర గ్రహ బాధలు తొలగుతాయి .

 రెండవ రోజు సంక్రాంతి

రెండవ రోజు సంక్రాంతి

సంక్రాంతి రెండవ రోజు తేది15-జనవరి-2019 మంగళ వారము ఎప్పుడు సూర్యుడిలా లక్ష్యం వైపు. నడవడమే సంక్రాంతి రోజున మకర సంక్రాంతి పండగ.ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు ఉదయాన్నే నుదుటన కుంకుమ బోట్టు పెట్టుకుని, నువ్వుల నూనేను గోరువెచ్చగా కాచి దానిని ఓళ్ళంతా మర్ధన చేసుకుని,నల్లనువ్వులను కొన్ని తలపై వేసుకుని, సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని తలస్నానం చేయాలి.ఈ పండగకు కొత్త అళ్లుళ్లని, కూతుళ్లని ఇంటికి ఆహ్వానించుకుని కొత్త బట్టలు వేసుకుని దేవున్ని పూజించుకుని ప్రాంతాల,కుటుంబ ఆచారపరంగా సాంప్రదాయకంగా వేడుక చేసుకుని పరమాన్నం,పిండి వంటలు,గుమ్మడి మొదలగు వాతహరములగు కూరగాయలు మొదలగునవవి భుజించి కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో ఎంతో సరదాగా గడుపుతారు.

హరిదాసులు, హరికీర్తనలు

హరిదాసులు, హరికీర్తనలు

రైతులకు పంటపోలాల నుండి ధాన్యం ఇంటికి వచ్చేకాలం,గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసులు ఇంటింటికి వచ్చి హరికీర్తనలు చేస్తూ ఆనంద పరుస్తారు,స్త్రీలు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు ఇంటి ముందు వేసుకుని సంక్రాంతి నోములు, వ్రతాలు చేసుకుని నోములను ఇరుగు పోరుగువారికి ఆత్మీయులకు పంచుకుని దాంపత్య,కుటుంబ దోషాలను తోలగించుకుని దైవానుగ్రహం పొందామని సంతృప్తి చెందుతారు.పిల్లలు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. నోరూరించే పిండి వంటలు తీపి పదార్తలు,మొదలగు వాటిని దానం చేస్తారు.అందరి కళ్ళలోనూ ఆనందం పొంగువారేది ఈ సంక్రాంతి పండగ.

పశువులను గౌరవించే సంస్కృతి

పశువులను గౌరవించే సంస్కృతి

సంక్రాంతి మూడవ రోజు కనుమ పండగ తేది16-జనవరి-2019 బుధ వారము పశుపక్షాదులను ప్రేమించి పూజించడమే కనుమ పండగా అంటాము రోజున కనుమ(కరి) ఇది రైతుల పండగ,కర్షకులకు వ్యవసాయ పంటలకు సేద్యమునకు ఉపయోగపడిన పశువులను గౌరవించే సంస్కృతిగా హిందువులు జరిపే పండగ ఇది.ఈ రోజు పశువులను మరియు కొట్టములను శుభ్రపరచి అందంగా అలంకరించుకుని పూజించుకునే రోజు.

ఆరోగ్య లాభాలు

ఆరోగ్య లాభాలు

ఈ కాలంలో రవి మకరరాశి యందు ప్రవేశించే కాలంలో ఉత్తరాయణం ప్రవేశించును.అనగా సూర్యుని చలనము దక్షిణం నుండి ఉత్తరము వైపు వాలును.మకర సంక్రమణం నుండి చలి క్రమక్రమంగా తగ్గును దేహపరంగా అనేకమైన మార్పులను చోటు చేసుకుంటుంది. కాబట్టి ఋషులు మన ఆరోగ్య పరిరక్షణ కొరకు నువ్వులతో కూడిన పిండి వంటలను,నువ్వులనే ప్రధానంగా చేసే నువ్వుండలు(నువ్వులముద్దలు)అరిశలు,సకినాలు మొదలగు ఆహారపధార్ధాలు ఈ కాలంలో తింటే కంటికి,ఎముకలకు, చర్మము,మలబద్దకమైన సమస్యలు మొదలగు నివారించి ఆరోగ్య అభివృద్ది కలిగించే విటమిన్ "ఎ-బి" ఈ పదార్ధాల తినడం ద్వార ఆరోగ్యలాభలు కలిగించి మన ఆరోగ్యం కాపాడుట కొరకు వైద్యవిధాన పరంగా ఈ పండగకు తినే పధార్ధలను సూచనలు చేయడం జరిగినది జై శ్రీమన్నారాయణ

--- డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు , జ్యోతిష పండితులు -9440611151

English summary
Why do we celebrate Makar Sankranti on 15th January? Makar Sankranti is the only Hindu festival celebrated on a fixed calendric day, 14/15 January of the solar calendar(English Calender) .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X