వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీ ప్లాంట్‌‌ను ఇళ్లల్లో పెంచితే ఆర్థిక ఇబ్బందులు తొలుగిపోతాయా..? శాస్త్రం ఏం చెబుతోంది..?

|
Google Oneindia TeluguNews

మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే అందంగా కనిపించడం కాకుండా ఈ మొక్క తీగ జాతికి చెందినది కావున మనకు నచ్చినట్లుగా ఇంట్లో తిప్పుకోవచ్చు, పైగా ఇది ఇండోర్ ప్లాంట్, దీనికి సూర్య రశ్మి లేక పోయిననూ పెరుగుతుంది. ఒక చిన్న బాటిలో కాని గ్లాస్ లో కాని నీళ్ళను పోసి ఓ చిన్న మనీ ప్లాంట్ ముక్కను ఎక్కడి నుండైనా తెచ్చి ఆ నీళ్ళలో వేసే సుబ్భరంగా పెరుగుతుంది. తోట్లల్లో మట్టిపోసి పాతిన పెరుగుతుంది, దీనిని రెండు రకాలుగా పెంచుకోవచ్చును.

 దోషాలు తొలగిపోతాయి..

దోషాలు తొలగిపోతాయి..

సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఎంతోమంది విశ్వాసం. అంతేగాకుండా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు . రుణబాధలు తీరిపోతాయాని పెద్దలు అంటుంటారు.మనీ ప్లాంట్ పెంచాలని చాల మందికి సరదా ఉంటుంది, కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయి, ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలను ఇస్తాయి అనే విషయంపై అవగాహన లోపంతో మధన పడుతూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్కను పొరపాటున కూడా తూర్పు ఈశాన్యంలో కాని, ఉత్తర ఈశాన్యంలో కాని పెంచకూడదు. పొరపాటున ఈ దిశలో పెంచితే శుభాలకు బదులుగా ప్రతికూల ఫలితాలుంటాయు.

శుభాలు కలగాలంటే ఆదిశలోనే పెంచాలి

శుభాలు కలగాలంటే ఆదిశలోనే పెంచాలి


ఇంట్లో శుభాలు కలగాలంటే తూర్పు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం చేయాలి. ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది, అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచాలి అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేగాకుండా ఆగ్నేయం విఘ్నేశ్వరుని దిశగా పేరొందింది. ఈ దిశకు వినాయకుడు అధిపతి. ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ కారణాల చేత మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెంచాలి.

మనీ ప్లాంట్‌ను ఎలా పెంచాలి ఎక్కడ పెంచాలి..?

మనీ ప్లాంట్‌ను ఎలా పెంచాలి ఎక్కడ పెంచాలి..?

మనీ ప్లాంట్‌ను మట్టిలో పెట్టి పెంచాలి. నీటి డబ్బాల్లో పెట్టి పెంచవచ్చును. మనకు కావలసినట్టుగా ఇంటిలోపల కానీ, బయట కానీ మనీ ప్లాంట్‌ను పెంచుకోవచ్చును. దీనివల్ల ఇంట్లో సంపదకు, సౌభాగ్యం అనుకూలంగా ఉంటాయి. మనీ ప్లాంట్‌లో ఆకులు వాడినా, పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటది వెంటనే వాటిని తొలగించాలి. మనీ ప్లాంట్ మొక్కను చక్కని శ్రద్ధ తీసుకుని పెంచితే ఏపుగా పెరిగి చూపరులకు కనువిందు చేస్తుంది, ముఖ్యంగా పెంచిన వారికి మానసికంగా తృప్తిని ఇస్తుంది.

English summary
It is generally believed that by raising a money plant in the house, the architectural flaws in the house will be eliminated. Also, there are no financial problems with raising the money plant at home. The elders say that debts will be paid off
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X