• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జపానికి ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు ..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

జపానికి కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలని, కటికనేలమీద కూర్చోకూడదు అని పెద్దలు చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కూర్చోడానికి కుర్చీ, పీట, మంచం - ఇలా ఏదో ఒక ఆసనాన్ని ఉపయోగించాలి. ఆసనం అనేది అనేక రకాలుగా చేయబడుతుంది. చెక్కతో తయారయ్యే పీట మొదలైన ఆసనాలు, ఈతాకు, తాటాకు, జనపనార తదితరాలతో తయారయ్యే చాపలు, ఉన్ని,నూలు తదితరాలతో రూపొందే వస్త్రాలు, దర్భాసనం, జింక చర్మం, పులిచర్మం, లోహంతో రూపొందిన ఆసనం - ఇలా అనేకం ఉన్నాయి. కూర్చునేటప్పుడు వీటిల్లో ఏదో ఒకదానిపై కూర్చోవాలి. అంతే తప్ప ఏ ఆసనమూ లేకుండా ఒట్టి నేలమీద కూర్చోకూడదు.

కటికనేల మీద ఎందుకు కూర్చోకూడదు అంటే.మన శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్తు బయటకు పోతూ ఉంటుంది. ఉత్పత్తి అయ్యే, వెలుపలికి పోయే విద్యుత్తు సమతూకంలో ఉండాలి. అందులో హెచ్చుతగ్గులు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

 why is not sitting on floor in japam

ఒక ఆసనం మీద కూర్చోవడాన మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఒట్టినేలమీద కూర్చున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యేదాని కంటే ఎక్కువ విద్యుత్తు బయటకు పోతుంది. యోగాసనం వేసేటప్పుడు చాప లేదా పులిచర్మాన్ని ఉపయోగించాలి. ఒట్టినేలపై కూర్చోకూడదు అని శాస్త్రం చెప్తోంది. పూజ చేయడానికి, అన్నం తినడానికి, ప్రవచానానికి, మామూలుగా కాలక్ష్యేపానికి, విశ్రాంతి తీసుకోడానికి ఇలా రోజులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూర్చుంటాం.

ప్రత్యేకించి పూజా కార్యక్రమాలలో దర్భాసనం పై కూర్చుని పూజ చేసుకోవటం చాలా శ్రేష్టం.పురాణాల్లో గరుత్మంతుడి కథ చాలామందికి తెలిసిందే. ఒక పందెంలో ఓడిపోయి, సవతి తల్లి కద్రువకు దాసిగా ఉన్న తన తల్లి వినతకు ఆ దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి గరుడుడు స్వర్గానికి వెళ్ళాడు. అమృతభాండాన్ని సంపాదించాడు. అయితే కద్రువ సంతానమైన నాగ జాతికి ఆ అమృతం అందకుండా చూడాలని ఇంద్రుడు కోరాడు. అమృతభాండాన్ని నాగుల దగ్గరకు తెచ్చి, వినతకు గరుత్మంతుడు దాస్య విముక్తి కలిగిస్తాడు.

అమృతభాండాన్ని దర్భల మీద పెట్టి, శుచిగా స్నానం చేసి వచ్చి అమృతం స్వీకరించాలని నాగులకు చెబుతాడు.వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఇంద్రుడు ఆ భాండాన్ని తీసుకుపోతాడు. అలా అమృత భాండం పెట్టడం వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందుకే అమృతతుల్యమైన దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చొని చేసే జపం మంచి ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారు.

జపం లేదా పూజ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి. ఆ ఆసనం గురించి కొంత తెలుసుకోవడం ఉత్తమం. దర్భాసనము వేసుకుని, దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేయడం ఉత్తమం. కొందరు క్రమంగా దర్భాసనం, కంబళి, వస్త్రం వేసుకుని జపం చేస్తారు.

కేవలం పీట వేసుకుని జపం చేయడం మంచిది కాదు. "దరిద్రం దారుకాసనం" అన్నారు. పీటపై వస్త్రం వేసుకుని చేసుకోవాలి. పీట 9 అంగుళాల ఎత్తులో చేయించుకుంటే మంచిది అంటారు. అలా చేయడం వలన భూమ్యాకర్షణ శక్తికి లొంగక మన మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది.యోగులు దర్భాసనం వేసుకుని, దానిపై కృష్ణాజినం (జింకచర్మం) మరల దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేసుకునేవారు.

English summary
The elders said that when sitting in Japam, one should sit down at land because .. the reason is says pandits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X