వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తులసి గొప్పతనం: ప్రతీ ఇంటిలో ఆ చెట్టు పెంచడం వెనుక కారణం?

|
Google Oneindia TeluguNews

తులసి మొక్క అంటేనే అతిపవిత్రంగా చూస్తాము.మరి ఆ తులసి వలన మానవునుకి ప్రయోజం ఏమిటో పరిశీలిస్తే అర్ధమైయెది ఏమిటి అంటే తులసి మొక్క

రోజులో 22 గంటలపాటు ఆక్సిజన్‌ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలియజేసారు. అందుకే జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట.

ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం తులసి లక్ష్మీఅమ్మవారి స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.

Why is Tulasi given so much importance in devotional life?

మన పూర్వీకులు దేనినైనా పూజించారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియనివి అంతే తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్‌-డై-ఆక్సయిడ్‌ పీల్చుకుని ఆక్సిజ న్‌ వదులుతాయి.

రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్‌-డై-ఆక్సైడ్‌ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్‌ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు.

తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు.

ఆ ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి అని. తులసిలో ఉన్న ఔషధగుణాల వల్ల గొంతులోని కఫం కరిగిపోతుంది.

Why is Tulasi given so much importance in devotional life?

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. ఎందుకంటే, తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట.

ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్‌ కాలుష్యం బారినపడి మసక బారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్‌ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి.

నీటిలోని ఫ్లోరోసిస్‌ వ్యాప్తిని తగ్గించడానికి తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్‌ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్యే ధృవీకరించారు.

మనం పెరటిలోని తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా జీవితాల్లో వెలుగు నింపవచ్చు. గుడిలో మనకు ఇచ్చే తీర్ధంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు.కారణం అందరు ఆరోగ్యంగా ఉండాలని,సకల ప్రయోజకారిని తులసి .

English summary
Tulasi worship is an ancient part of the Vedic tradition, dating back thousands of years and continuing to the present day. Every morning, families throughout India offer water and flowers to Srimati Tulasi Devi before going about their daily duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X