వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడంటే ఏమిటి, పూజ చేయకపోతే ఏమవుతుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని చిన్నపిల్లలే కాదు.నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది అందుకు మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం" అలా మాట్లాడితే కళ్లుపోతాయి"అని అంటారు.మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు,ఎలా చెప్పాలో తెలియనప్పుడు మనం వాడే మాట అదే.

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా!మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ మనసుతో చేసే వ్యాయామం.మన తెలివితేటలు,జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.

దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు పైగా అది నాలికకు మంచి ఎక్సర్‌ సైజ్‌ అవుతుంది.అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది,ధారణ శక్తి పెరుగుతుంది.

Why should we pray God, If not what happens

భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.పూజ అంటే చాదస్తం కాదు.మన ఆరోగ్యం,మన జ్ఞానానికి సంబంధించిన విషయమని వివరంగా తెలియజేయాలి.మన హిందూ ధర్మాన్ని,సనాతన సాంప్రదాయన్ని ఆచరిస్తూ భావితరాలకు వాటి విలువలను తెలియజేయండి.దానితో పాటు మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.

లోహపు బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు.అదే మట్టికుండ కున్న సొట్టను
తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది.అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి .కాని అందరిని మార్చాలనుకోవటం అవివేకమౌతుంది.మన జీవన శైలి,ఆచరణ ప్రవర్తన అద్ధతులు అనేవి ఎదుటివారు ఆచరించే విధంగా చెబుతే వినే విధంగా మొదట మన ప్రవర్తనను ఉంచుకోగలిగితే అది మన పద్ధతుల పట్ల వారు ఆకర్షితులై ఆచరించడానికి ఉత్సాహం చూపుతారు.

శాస్త్రీయ సారాన్ని అర్ధం చెసుకుని ఆచరించి ఆనందానుభూతులు పోంది వారి అనుభవాలను,ప్రయోజనాలను సాటి వారికి తెలియజేస్తారు." జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప.

English summary
Astrologer explained why should we pray God and what happens if we will not pray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X