• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.

మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు.. అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు.. కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి.

Will you be benifitted by just hearing Veda mantras,Know the details here

ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV తరంగాలు ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు వాటి వాటి నిర్దుష్ట frequency తో మనను చుట్టుముట్టి వుంటాయి.

నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను.

అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది.

నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి.

ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి.

ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి, చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి.

తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది.

అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోగలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించ గలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను.

ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది.

అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

అదే విధంగా కేవలం మంత్రోచ్ఛారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను.

"మననాత్త్రాయతేఇతిమంత్రః"...

మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది.

ఇక నిధి ధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మల వలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతన ధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది.

నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27 నక్షత్రాల x 4 పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించే విధంగా మనకు 108 నామాలు జపించమని లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని చెప్తుంది శాస్త్రం.

ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతన హిందూ ధర్మం.

English summary
It is said that the prelates, the avadhutas, the truthful masters will benefit you if you do not hear the Vedas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X