వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగత్ మాయేనా ? ఇంకా ఏదో ఉందా ..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ఈ కనిపించే జగత్తు అంతా "మిథ్య " - { incomplete reality /broken reality} అని తెలుసుకోవడమే జ్ఞానం.ఈ జగత్ సత్యం కాదు ,మాయ / మిథ్య అని ఎలా చెప్పగలము ? ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని వదలి పెట్టి, ఇంకా ఏదో ఉంది అనే భావం మనిషి కి ఎందుకు వచ్చింది ?

ఈ విశాల విశ్వం లో ఒక బిందువు , ఒక గీత ఏక మితి (unidimension) లో ఉంటే , రెండు గీతల మధ్య ఉన్న ప్రదేశం రెండు మితులలో (two dimensions ) , అదే ప్రదేశం ఎనిమిది దిక్కులకు వ్యాకో చించినపుడు మూడు మితులలో (three dimension)ఉంటుంది .మనిషికి ఈ మూడు మితుల జగత్తు మాత్రమే అవగాహనకు వస్తుంది.కానీ 14 మితుల (14-dimensioned universe) జగత్తు ఉందని ఋషులు చెప్పారు .అందుకే ఈ మూడు మితుల జగత్తు ని మిథ్యా జగత్ (incomplete universe/ broken truth) అంటారు .

 wisdom to know that all this visible world is an illusion

కనపడే జగత్తు అంతా అసంపూర్ణం . చాలా చిన్న కల లాంటి విషయం . అసలైన జగత్ ఇంకా ఎంతో ఉంది . దాని లక్షణం సత్యము , దాని స్థితి ఆనందం . అది అవ్యక్తం. అలాగే ఇంకో ఉదాహరణ - భూమి మీద ఉన్న మనకు సూర్యుడు తిరుగుతున్నట్లుగా ,భూమి స్థిరంగా ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది .కాని ,నిజం ఏమిటో అందరికీ తెలుసు.మన అనుభూతి నిజం కాదు.భ్రమ.అలాగే ఇంద్ర జాలికుడు మనిషిని ముక్కలుగా చేసినట్టు మనకు భ్రమ కల్పిస్తాడు .

అంటే ఏ విషయాన్ని అయినా , ముక్కలు ముక్కలుగా చూస్తే మనకు కలిగేది భ్రమే గాని ,సత్యం కాదు .అలాగే మానవ జీవితం కూడా .మనం మిథ్యా జగత్ ( lesser reality) ని అర్ధం చేసు కోవాలంటే పూర్తి జగత్ -greater reality ( పూర్ణం ) ని అర్ధం చేసు కోవాలి .In form, we are many; in essence, we are one!" రూపాలు ఎన్నో ! కానీ మన ఆత్మ ఒక్కటే !మనస్సు ని ఎలా నియమితం చేసు కోవాలి ? ఎపుడైతే మూడు మితుల ఈ మిథ్యా ప్రపంచాన్ని మనం పట్టించుకోమో అపుడు ద్వంద్వాలపై మోహం తగ్గుతుంది .నిత్య జీవితంలో జరిగే , జరగబోయే ఘటనలతో మనం మమేకమవ్వనపుడు బాధా సంతోషాలు మనం అనుభూతి చెందము .

ఉదాహరణకు ,రాయీ రప్పా చుట్టూ జరిగే విషయాలను పట్టించు కోవు. స్పందించవు . అనుభూతీ చెందవు .చెట్టూ, చేమా చుట్టూ జరిగే విషయాల కు స్పందిస్తాయి . కానీ అనుభూతీ చెందవు .
కీటకాలు , నిమ్న జాతి క్షీరదాలు స్పందించి, గుర్తు పెట్టు కొంటాయి . వాటికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ .
కానీ మనిషికి వీటన్నింటి తో పాటు ఉహా శక్తి , సృజన శక్తి, మంచి జ్ఞాపక శక్తి , తార్కిక శక్తి , సంకల్ప బలం ఉంటాయి .

మనుషులందరికీ ఈ శక్తులు సమాన స్థాయి లో ఉండవు . ఈ శక్తి నే చైతన్యమని ,కాన్షస్ నెస్ అని అంటాము.మనిషి కి ఈ చైతన్యమే ప్రథానం .స్థావర జంగ మాల కన్నా ఎక్కువ చైతన్యం మనిషికి ఉంటుంది.అలాగని మనుషులందరికీ సమానంగా ఈ ఎరుక ఉండదు ?......ఎరుక ఎంత ఎక్కువ ఉంటే ఈ విశ్వ శక్తి స్థితిగతుల గూర్చి సంపూర్ణ వాస్తవం అంత ఎక్కువగా మనకు అవగతం అవుతుంది .

సంపూర్ణ వాస్తవం అనుభూతికి రానంత వరకు మనకు అవగత మయ్యే విషయాలన్నీ అర్ధ సత్యాలు / మిథ్య .మన జ్ఞానేంద్రియాలు కాంతిని ,ధ్వనిని కొంత వరకే తెలుసు కోగలవు .కాంతి ,ధ్వనులను పూర్తిగా తెలుసుకోనంత వరకు మనం మాయ లో ఉన్నట్లే.ఎందు కంటే ఈ విశాల విశ్వమంతా శక్తి వివిధ రూపా లైన కాంతి ,ధ్వని తరంగాల సమ్మేళనం . వీటిని సంపూర్ణముగా తెలుసు కోగలిగితే సత్యాన్ని తెలుసు కొన్నట్లే .

తెలుసు కోవటం మరెలా సాధ్యం ?మనిషికి అడ్డుగా ఉన్న మనస్సులో ఉన్న చిత్త వృత్తులను, సంకల్పాలను,రాగ ద్వేషాలను,ఆవేశ కావేషాలను,ఈ మిథ్యా ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను నియమితం చేసుకొని మెల్లగా వాటినుండి చిత్తాన్ని శూన్యం ( విశ్వ శక్తి , చైతన్యం , సచ్చిదానందం,సంపూర్ణ సత్యం)పై కేంద్రీక రించి తద్వారా మనస్సుని శూన్యంలో లయం చేస్తే సంపూర్ణ సత్యం అనుభూతికి వస్తుంది.(ఇక్కడ అంటే ఏమీ లేదు, ఏమీ కాదుగా అర్థం చేసుకోకూడదు)

సంపూర్ణ వాస్తవం తెలుసుకొన్న ఋషులు ఆ విధంగానే సాధన చేసి దర్శనం చేసుకొన్న విషయాలను , రూపాలను ,ధ్వనులను - వేదాలుగా ,దర్శనములుగా ,మంత్రాలుగా ,యంత్రాలుగా మనకు అందించారు . ఈ ప్రపంచంలో మనం పడే శ్రమ , కష్ట నష్టాలు , సుఖ సంతోషాలు ఇవన్నీ శాశ్వతం కావు , అన్నీ మార్పు చెందుతాయి అని మనం గట్టిగా నమ్మితే , ఈ జగత్తులో మనం జరిపే బాధ్యతలన్నీ సాక్షీ భావంతో నిర్వర్తిస్తాం .

ఈ మిథ్యా ప్రపంచంలో మనం ఎందుకు బాధ్యతలు.జీవిత పరమావధిని చేరాలంటే మనిషికి శరీరం ,మనస్సు ,బుద్ది అవసరం.ఇవి నిలబడాలంటే ఆహారం ,నీరు, ప్రాణ శక్తి కావాలి . ఇవి అందా లంటే వృత్తి , ప్రవృత్తి కి సంబంధించిన కర్మలు చేయాలి.శరీరం ఉంటేనే కర్మల పరిపాకం జరిగి పంచ కోశాల శుద్ది జరుగుతుంది.కాబట్టి ధర్మ విహిత కర్మలు తప్పక చేయాలి.అప్పుడే కొత్త కర్మ బీజాలు ఏర్పడవు .

అసలు "మిథ్య " అంటే అర్ధం ఏమిటి ?
సంపూర్ణ సత్యం కానిది మిథ్య. బ్రహ్మముతో పోలిక జరిపినపుడు మిథ్య చరమ సత్యము కాదు. మిథ్యా ప్రపంచమంతా నశించేదే కదా! అదంతా సత్యాభాసే కదా! సాపేక్ష సత్యమే కదా!ఈ ప్రపంచంలో మనం పుట్టి పెరిగి సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాం,శరీరం మార్పు చెందుతూ చివరకు మరణిస్తుంది . మన మనస్సు నిరంతరం ఆలోచనలు మార్పు చేసుకొంటూ ప్రాణం పోయిన తర్వాత కొంత కాలానికి ప్రకృతిలో విలీనం అవుతుంది.అంటే మార్పు చెందే దానిని,అసంపూర్ణ మైన దానిని మిథ్య అంటాం .

చివరకు మిగిలేది ఏది ? అంటే ,మార్పు చెందనిది ఏదైనా ఉంటుందా?
Consciousness లేదా ప్రజ్ఞ లేదా ఆత్మ లేదా బ్రహ్మ శాశ్వతం , మార్పు చెందదు - అని రుషులు , శాస్త్రాలు చెప్పుతున్నాయి . అది సత్యమా? కాదా? అని తెలుసుకోవడమే జ్ఞానం . ఆ జ్ఞానాన్ని పొందటమే ప్రతి మానవుడి కర్తవ్యం .

జ్ఞానమే మనిషికి మోక్షం .
మార్పు చెందే ప్రపంచంలో మనిషి ఎలా జీవనం సాగించాలో బోధించేదే ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత .పురుషార్ధాలైన అర్ధకామాలను ధర్మంగా సాధించుకోవడమే మోక్షదాయకమని , ద్వంద్వాలకు అతీతంగా అంటే సుఖ దుఖ భావనలకు లోబడకుండా మన బాధ్యతలను నిర్వికారంగా అహానికి ఆపాదించుకోకుండ నిర్వర్తించడమే మోక్ష మార్గమని ,సంపూర్ణ శరణాగతి తో మన కామ్య కర్మలను ,భావనలను ,ద్వంద్వాలను భగవంతునికి అర్పించడమే మోక్షదాయమని , విచక్షణ,వివేకాలు పెంచుకొని విహిత శాస్త్రాలు,ప్రకృతి విజ్ఞానం,ధర్మం ,సత్యం,మోక్షం గురించిన జ్ఞానాన్ని పొందటం మోక్షమని - చెప్పిన గీతను ప్రతి రోజూ అధ్యనం చేసి మన జీవితాలలో జరిగే సంఘటనలకు అన్వయించుకుందాం .జ్ఞానాన్ని మన హృదయం లో సుస్థిరం చేసు కొందాం .

English summary
It is wisdom to know that all this visible world is an "illusion" - Why did man have the feeling that there was something else left behind and a world to be seen?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X