వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనకుతానుగా ఆగిపోయే రథం.. ఎక్కడో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

శ్రీమన్నారాయణుడి మహిమలు మానవ మాత్రులకు అంతుపట్టవు జగన్నాటక సూత్రదారైన శ్రీహరి ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం వెలసాడు.ఈ ఆలయం దేశంలోనే పేరెన్నికగన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ , విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు .

అయితే ఇంతటి ప్రతిష్ట, ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు , ప్రత్యేకతలూ ఉన్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం, అవేంటో చూద్దాం.

 wonders in puri temple

మొదటిది - తనంతతానే ఆగిపోయే రథం .. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది . ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు .

రెండోది - నీడ కనిపించని గోపురం - జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు.ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు.ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు .

మూడోది - గాలికి వ్యతిరేకదిశలో ఎగిరే జెండా - ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది . కానీ .. పూరీ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .

నాలుగోది - మనవైపే చూసే చక్రం - పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది . ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది .

ఐదోది - ఆలయంపై ఎగరని పక్షులు - ఇది మరో వింత .. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు . ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు .

ఆరోది - ఆలయంలో వినిపించని అలల సవ్వడి - ఇదో విచిత్రం .. సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్ర హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది .

ఏడోది - ఘుమఘుమల ప్రసాదం - పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు . అయితే .. ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి .

English summary
Puri Jagannath Temple of Odisha, Srihari, the great master of Odisha, Sri Prabhu Jagannath Temple is famous for the glory of Srimannarayan. Thousands of devotees visit this place every year for its Rath Yatra. Media spokespersons from all over the country come to cover this spectacle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X