వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగ సూర్య నమస్కారాలు: ఇలా చేయాలి, ఫలితాలు ఎన్నో

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

సకల ప్రాణకోటికి సూర్యూడే జీవనాధారం. యోగాసనాలలో తీర్చిదిద్దబడిన సూర్య నమస్కారములు చేయుట వలన అనేక సత్ఫలితాలు పొందవచ్చును. సూర్యనమస్కారము ఉదయం ,సాయంకాలలలో కాని చేయవచ్చును. సూర్యుడు వెలుతురుకు, శక్తికి మూలం. కావున ఈ ఆసనాలతో సూర్యభగవానుని భక్తి పూర్వకంగా స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేసే పద్ధతిని యోగాద్వార సాధ్యపడుతుంది.

యోగాసనములు,ప్రాణాయనము కలిపి చేసేదే సూర్యనమస్కారం అంటారు.అసనాలు వేయడానికి ముందు సూర్యనమస్కారము చేయడం వలన శరీరానికి ఉత్తేజము కలిగి ఇతర అసనాలు వేయడానికి శరీరాన్ని తయారుచేస్తుంది.ఈ ఆసన సమయంలో ప్రాణ వాయువు కూడా ఎక్కువగా అందుతుంది.ఇవి మొత్తం "12" ఆసనాలతో కూడిన ఆవృత్తి. సూర్య నమస్కారాలలో ఒకదాని తర్వత ఒకటి వరుస క్రమంలో చేస్తాము.వీటిని 3 నుండి 12 సార్లు చేయవచ్చును.

యోగాసనాలు ఇలా చేయాలి

యోగాసనాలు ఇలా చేయాలి

1) నమస్కార ముద్ర :-మొదట తూర్పు దిశ వైపు చాపమీద నిలబడి చేతులు రెందు చాతీకెదురుగా నమస్కార ముద్రలో ఉండవలెను.కాళ్ళు రెండు దగ్గరకు చేర్చి ఉంచవలెను.శ్వాస సాధరణంగా ఉంచవలెను.

2) హస్త ఉత్ధనాసనము :- శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తి కాళ్ళు వంచకుండా వెనకకు వంగవలెను.


3) పాదహస్తాసనము :-
శ్వాస వదులుతూ,కాళ్లు వంచకుండా ముందుకు వంగి,చేతులు కాళ్ళు పక్కన నేలకు అనించవలెను.తలను మోకాళ్ళకు ఆనించవలెను.

4) అశ్వసంచాలసనము :- శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని వెనకకు చాచవలెను.కుడికాలుకు రెండు పక్కల చేతులు అనించి తలను నేరుగా ఉంచవలెను.

5 ) అశ్వ సంచలనాసనము :-

కుడి కాలు వెనకకు చాచుతూ రెండు కాళ్ళు ఒకచొటకిచేర్చి ఉంచవలెను.శరీరం భూమి మీద అనకుండా తల నుండి కాలు వరకు నిటారుగా ఉండవలెను.శ్వాస పొట్టలోనే అపుకోవాలి.

6) అష్టాంగ నమస్కారం :- శ్వాసను వదులుతూ చేతులు కదపకుండా నెమ్మదిగా శరీరాన్ని చాప మీదకు తీసుకుని వచ్చేటపుడు తల,ఛాతి,మోకాళ్ళు చాపకు తగిలేట్టుగా ఉందవలెను.పిరుదులు పైకెత్తి ఉంచవలెను.అష్టాంగములు (రెండు అరచేతులు,రెండు పాదములు,రెండు మోకాళ్ళు, ఛాతీ,నుదురు) మాత్రమే చాపను తాకవలెను.

7 ) భుజంగాసనము :-శ్వాస తీసుకుంటూ తల,ఛాతిని చాపమీద నుండి పైకి లేపవలెను.పొత్తి కడుపు చాప మీద ఉండవలెను.

8) అర్ధముక్తాసనము

:- శ్వాస నెమ్మదిగా వదులుతూ కాళ్ళు,చేతులు కదిలించకుండా నడుమును పైకెత్తి తలను నేల వైపుగా తీసుకు రావాలి.పాదాలు మాత్రం నేలకు తాకి స్థిరంగా ఉంచవలెను.శరీరాన్ని ఇంగ్లీష్ అక్షరం 'A' ఆకారంలో ఉంచవలెను.

9) అశ్వసంచాలసనము :-

శ్వాసను తీసుకుంటూ చేతులు కదపకుండా కుడి కాలును ముందుకు తీసుకునివచ్చి రెండు చేతుల మధ్యలో నుండి తల పైకెత్తవలెను.

10 పాదహస్తాసనము

:- శ్వాస వదులుతూ ఎడమకాలును కుడి కాలి పక్కన రెండు చేతుల మధ్యన చేర్చవలెను.నుదురు మోకాళ్ళకు తాకించాలి.రెండు చేతులు,రెండుకాళ్ళు నిటారుగా ఉండవలెను.

11) హస్తతానాసనము :- శ్వాస తీసుకుంటూ చేతులు తల పైకెత్తి నిటారుగా నిలబడి వెనుకకు శరీరం సహకరించింత వరకు వంగవలెను.

12) ప్రణామాసనము (నమస్కారముద్ర) :- నిటారుగా నిలబడి రెండు చేతులు ఛాతీకెదురుగా నమస్కారముద్రలో ఉంచవలెను.రెండవ సారి సూర్యనమస్కారం చేసేటప్పుడు కాళ్ళు భంగిమలో ఎడమ కాలుకు బదులు కుడి కాలును ఉపయోగించవలెను.

సూర్యనమస్కారాల వలన లాభాలు

సూర్యనమస్కారాల వలన లాభాలు

* ఈ సంపూర్ణమైన వ్యాయామం వలన శరీర భాగములన్నింటిని పుష్టిగా ఉంచి అనారోగ్యం పోగోట్టును.
* కడుపు,జీర్ణాశయము,హృదయము,చిన్నప్రేగులు,కాలేయంములను ధృడపరచును.
* వెన్నుపాము,నడుములోని ఎముకలను సడలించును.రక్తప్రసరణను సరిదిద్దుట వలన రక్తములోని మలినములను పోగోట్టును.చర్మవ్యాధులను నయం చేయును.
* చేతులు,భుజములు,కాళ్ళు,తోడల కండరములు,మెడ ఎముకలను గట్టిపరచును.
* మనశ్శాంతి,మనాసిక ధృడత్వం ఏర్పడును.
* డయోబెటిస్ ను నియంత్రించును.
* పరిపూర్ణమైన ఆరోగ్యమును సమకూర్చును.

12 ఆసనాలు వేయడం వల్ల

12 ఆసనాలు వేయడం వల్ల

శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది.

దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి.అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది.దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.

సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి.వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది.

ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి

ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి

ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు.

ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి.వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి.వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి.ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .

శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది.యోగ ముఖ్య సూత్రం శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం దీనినీ తప్పనిసరిగా పాటించ వలయును.

శక్తిగా మారును

శక్తిగా మారును

ముఖ్య సూత్రం ప్రాణాయామం, సూర్యనమస్కారం,విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.శరీర సామర్ధ్యం పెరుగుతుంది.కాలరీలు ఎక్కువగా బర్న్‌ అయి శక్తిగా మారును.

డైజెషన్‌ పెరిగి, మలబద్దకం లాంటి రోగాలు దరికిచెరవు.సూచనలుఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు,చెడు రక్తం,జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు'పవనముక్తాసన శ్రేణి'భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి.పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి.

అల కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి.జాగ్రత్తలుఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె,రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.

English summary
Surya namaskar improves your blood circulation that aids in bringing back the glow on your face; preventing the onset of wrinkles, making your skin look ageless and radiant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X