వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు దోషముతో సంతానం కలగదా?: ఇవీ జాగ్రత్తలు..

గృహస్తుని యొక్క డబ్బు ఖర్చయిపోయి, పైగా సమయము, జీవితము కూడా ఇబ్బందుల పాలగును.

|
Google Oneindia TeluguNews

ఎవరైనా తమ ఇల్లుగాని, ఫ్యాక్టరీలుగాని, ఏ ఇతర నిర్మాణములుగాని నిర్మించుకొనునప్పడు ముఖ్యముగా విషయ పరిజ్ఞానము కలిగిన మేస్త్రీని

ఎన్నుకొని తమ నిర్మాణములు చేపట్టవలెను. లేకున్న ఆగృహముల యొక్క మూలలు మరియు నిర్మాణపటిష్టత సరిగా లేక అవి నరకప్రాయముగా తయారగును.
గృహస్తుని యొక్క డబ్బు ఖర్చయిపోయి, పైగా సమయము, జీవితము కూడా ఇబ్బందుల పాలగును.
వాస్తు శాస్త్ర ప్రకారముగా గృహ నిర్మాణము గావించుట యజమాని వంతు, గృహము శాస్త్రమార్గము తప్పని రీతిగా చూచుకొనుట గృహిణి భాద్యత.

"ఇల్లాలి మొగము వీధి గుమ్మము చెప్ప" అనే సూక్తి యాధారంగా శాస్త్ర ప్రకారము వీధి

| గుమ్మము చూడగానే ఆ యిల్లాలు సంతానవతియో లేక సంతానహీనయో, సౌభాగ్యవతియో కాదో మొదలగు విషయములు తెలుస్తుందట.

is vastu dosh effects on couples infertillity?

కుటుంబ సభ్యులు, దీర్ఘరోగములు మరియు ఇతర వ్యాధులు వచ్చినప్పడెక్కువ శ్రద్ద తీసుకొనవలసిన బాధ్యత గృహస్తురాలి పైననే ఉంటుంది. కావున ఇలు వాస్తు ప్రకారము సరిదిద్దుకొన్నపై సమస్యలు ఇల్లాలు ఎదుర్కొనవలసిన అవసరము రాదు.

గృహనిర్మాణము పూర్తిగా తాపీమేస్త్రీలు, వడ్రంగులపై ఆధారపడి ఉంటుంది. కానీ మనము కుడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. గృహము నిర్మించేటప్పుడు స్థలమునకు ఈశాన్యము కొంచెము పెరిగేలాగా సరిచేయవలెను.
2. గృహనిర్మాణ సామాగ్రి అనగా ఇటుకలు, రాయి, ఇసుక, మొదలగునవి స్థలము యొక్క నైరుతి, దక్షిణ, పశ్చిమ దిశలయందుంచవలెను.
3. నిర్మాణ ప్రారంభము నైరుతి నుండి ప్రారంభించవలెను.
4. నిర్మాణములు పునాది నుండి తూర్పు, ఉత్తర, ఈశాన్యముల పల్లముగా ఉండేలాగాచూసుకొనవలెను.
5. నైరుతి గది అన్ని గదులకంటే ఎత్తుగాను, ఈశాన్యపు గది అన్ని గదులకంటే పల్లముగాను ఉండేలాగానిర్మాణము చేయవలెను.
6. ద్వారములు, కిటికీలు ఉచ్ఛస్థానములో నమర్చవలెను.
7. ఇలునకు గాని, రూములకు గాని మూలలను గుండ్రముగా చేయదలచిన నైరుతి, వాయవ్య, ఆగ్నేయముల యొక్క మూలలను మాత్రమే రౌండుగా
చేయవలెను. కాని ఈశాన్యమూల మాత్రము కోణముండు లాగుననే యుండవలెను. అది గుండ్రముగా చేయరాదు.
8. దూలముల యొక్క మొదళ్ళ దక్షిణ, పశ్చిమ దిశలలో, కొనలు తూర్పు, ఉత్తర దిశలలో వచ్చులాగున వేయవలెను.
8. తూర్పు, ఉత్తర సింహద్వార గృహములకు ఫ్లోరింగ్ లెవెల్కన్న పల్లముగా అరుగులుండునటుగా నిర్మాణము చేయవలెను.
9. గృహములోని ద్వారములు, కిటికీలు, ఉచ్ఛస్థానములో నుండునట్లమర్చు కొనవలెను.
10. గృహములో ఏ గదులలో కూడ దిమ్మెలుగాని, పూజాపీఠములుగాని తూర్పు
ఉత్తర ఈశాన్యములందు వేయరాదు. ప్రతిగది ఈశాన్యము నందు గృహసుడు ఖాళీగా నుంచవలెను. ఎలాటి బరువులుంచకూడదు.
11. గృహసుడు తను నివసిస్తున్న గృహానికి తూర్పు - ఉత్తర ఈశాన్యంలో గల స్థలాలుగాని, భవనాలుగాని ఖరీదు చేయవలెను.
12. ఇంటికి గల దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి స్థలాలను కొనగూడదు.
13. పడకగదిలో తలను దక్షిణంవైపు వుంచి నిద్రించేలాగా ఏర్పాటు చేసుకొనవలెను.
14. లెట్రిన్, బాత్రూమ్లకు వెంటిలేషన్ బాగుగా వచ్చేలా నిర్మించవలెను.
15. గృహస్మడు తమ ప్లానులు దక్షిణ భాగం గదులు పెద్దవిగను, ఉత్తర భాగం గదులు కొంచెము చిన్నవిగా మరియు పశ్చిమ భాగం గదులు
కొంచెము పెద్దవిగను, తూర్పుభాగం గదులు చిన్నవిగను ఉండేలాగాచూచుకొనవలెను.
16. ఏ సింహద్వార గృహమైనను, గృహము నిర్మించునపుడు దక్షిణ, పశ్చిమములు ఏక ఎత్తు పెట్టి, ఉత్తర - తూర్పుల యందు వసారాలు ఉంచి
కట్టవలెను.
17. గృహంలో ఉండే నుయ్యిగాని, గొయ్యిగాని ప్రహరీ గుమ్మాలకుగాని, ఇంటి గుమ్మాలకుగాని ఎదురుగా యుండకూడదు. కనుక గృహసులు ఈ
వాస్తు శాస్తాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని గృహమును జాగ్రత్తగా నిర్మించుకొనవలెను.

English summary
Astrologer explains about is vastu dosh effects on couples infertillity?, if it happens what is the remedy for that?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X