• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మే 2022 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews
Monthly Horoscope సెప్టెంబర్ మాసఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ నెలలో వ్యక్తిగత జీవనంలో సంతోషాలను, సౌఖ్యమును కలుగచేయును. అన్ని వర్గముల వారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. జన్మించిన స్థానం నుండి ఉత్తర దిశలో వివాహ సంబంధాలు కుదురుతాయి. ఈ మాసంలో రెండవ మరియు మూడవ వారంలో ఒక చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవలసిన సూచన ఉన్నది లేదా శరీరానికి చిన్న అనారోగ్యం ఏర్పడును. చివరి వారం మేషరాశి వారు నూతన బాధ్యతలు చేపట్టినచో అతి చక్కటి ఫలితాలు కలుగచేయును. భూ సంబంధ లేదా వాహన సంబంధ క్రయ విక్రయాల వలన లాభ పడుదురు. సంతాన సంబంధ ప్రయత్నాలకు కూడా చివరి వారం అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ నెలలో వైవాహిక జీవనంలో అననుకూల సంఘటనలు బాధిస్తాయి. ఉద్యోగ జీవితం మాత్రం చక్కగా కొనసాగుతుంది. భాత్రు వర్గం వలన లాభపడతారు. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయువారికి నష్టములు, శత్రు బాధ బాధించును. భవిష్యత్ ప్రణాళికలు రచించుటకు లేదా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుటకు 19 వ తేదీ వరకూ అనుకూలత ఉండదు. 20 వ తేదీ తదుపరి చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాలకు మంచి అనుకూల కాలం. భూ సంబంధ క్రయ విక్రయాలకు కుడా అనుకూల కాలం. మాతృ వర్గీయుల వలన లాభములు పొందుతారు. ఈ మాసంలో 1,2, 6, 20, 22, 29 తేదీలు అనుకూలమైనవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో ప్రతీ పని అనుకూలంగా జరుగును. నూతన వాహన కోరిక నెరవేరును. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ జీర్ణశక్తి కి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య బాధించు సూచన. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ భవిష్యత్ కు మంచి బాటను ఏర్పరుస్తాయి. సొంత గృహ లేదా భూ మూలక లాభములు. విద్యార్ధులకు ఆశించిన విజయములు. పై అధికారులు లేదా రాజకీయ రంగంలోని వారితో మైత్రీ వ్యవహారములకు ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో 5 నుండి 11 వ తేదీ మధ్యకాలం వివాహ సంబంధంగా చర్చలు జరుపుటకు అనుకూలమైన కాలం. 13,14,15,16 తేదీలు అంత అనుకూలమైన రోజులు కావు. ఈ రోజులలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ నెలలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయుటకు, నివాస ప్రాంత మార్పు ప్రయత్నాలు చేయుటకు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయుటకు, పై అధికారులకు సిఫారసు చేయించుకొవడానికి, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు చేయుటకు అనుకూల కాలం. మీ శ్రమ ఫలించును. ఈమసంలో ధనాదాయం బాగుండును. వ్యాపారములు ప్రొత్సాహపూరకంగా కొనసాగు కాలం. కుటుంబ సభ్యుల కు సంబందించిన ఒక సంతోషకరమైన సమాచారం వింటారు. కుటుంబంలో శుభకార్యముల నిర్వహణ కోసం చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకోనగలరు. ఈ మాసంలో ధనయోగాలు ఉన్నవి. క్రయ విక్రయాలు చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ నెలలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో సౌఖ్యం లభిస్తుంది. అన్ని వర్గాముల వారు ఆశించిన ధనాదాయం పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలోని వారికి ప్రతివిమర్శల వలన నష్టం ఎదురగును. మఘా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో భూ సంబంధ లేదా గృహసంబంధ యోగం ఉన్నది. విద్యార్ధులకు ఆశించిన విద్యా అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ మాసం సామాన్య యోగంతో కొనసాగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ నెలలో అంత ప్రోత్సాహకరమైన కాలం కాదు. ఆరోగ్య పరంగా లేదా మానసిక ఆందోళన కలుగచేయు పరిస్టితులు కొనసాగుట వలన జీవన మార్గంలో స్తబ్ధత ఏర్పడును. కుటుంబ సభ్యుల వలన ఇరుగుపొరుగు వారితో తగాదాలు ఎదుర్కొందురు. ధన ఆదాయంలో కొంత తగ్గుదల ఉంది. ఊహించని మార్గాలలో ఆర్ధిక వ్యయం ఎదురగును. ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి విధి నిర్వహణలో సమస్యలు ఎదురౌతాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి దాన్ని పూర్తీ చేయకుండానే విడిచిపెట్టవలసి వస్తుంటుంది. ఇతరుల అంతరంగం మిమ్మల్ని బాదిస్తుంది. మిత్రుల పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో బంధు వర్గం వలన ఒక ఆర్ధిక నష్టం ఏర్పడు సూచన ఉన్నది. వివాహ మరియు సంతాన ప్రయత్నాలో ప్రతికూలత బాధించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. ప్రారంభించిన కార్యములు సకాలంలో పూర్తి అవ్వవు. మీపై ఏర్పడిన విమర్శల వలన మానసిక అశాంతి అనుభవించేదురు. ఆర్ధికంగా ఇబ్బందులకు అవకాశం ఉన్నది. ఈ మాసంలో చేసే అన్ని రకముల కొనుగోళ్ళ కు సంబందించిన నిర్ణయాల పట్ల స్థిరత్వం అవసరం. ఈ మాసంలో ,9,13,14,25 వ తేదీలు ఆర్ధికంగా అనుకూలమైనవి కావు. స్టాక్ మార్కెట్ లో సాహసోపేతమైన పెట్టుబడులకు ఈ మాసం అంత అనుకులమైంది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ నెలలో 13వ తేదీ వరకూ వ్యాపారస్థులకు అనుకూల కాలం. ఆశించిన విధంగా వ్యాపార లాభాలు పొందగలుగుతారు. వినోద రంగంలోని వారికి కూడా బాగా కలసివచ్చును. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుటకు తగిన గ్రహ బలాలు ఈ మాసంలో కలవు. కోర్టు వ్యవహారాలలో తీర్పులు మీకు అనుకూలంగా ఇవ్వబడతాయి. 14వ తేదీ నుండి మిశ్రమ ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగును. అజాగ్రత్త వలన విలువైన వస్తువులు పోగొట్టుకొను సూచనలు ఉన్నవి. వృధా వ్యయం ఏర్పడుతుంది. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు లభించవు. రక్షణ రంగంలో సేవ చేయువారికి ఈ మాసంలో 19 నుండి 26 వరకూ అంత మంచి సమయం కాదు. ఈ మాసంలో 03 నుండి 12 వరకూ వివాహ మరియు నూతన కార్యముల ప్రారంభ విషయాలకు అనుకూలమైన రోజులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ నెలలో తలపెట్టిన పనులలో వేగం తగ్గుతుంది. ఆర్ధికంగా కొంత అభద్రతా భావం ఏర్పడి వృధా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపార వ్యవహారములు సామాన్యంగా కొనసాగుతాయి. విదేశీ పర్యటనలకై ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. లేదా దూర విహార క్షేత్ర సందర్శన వినోదం ఏర్పడుతుంది. ఈ మాసంలో 17 వ తేదీ తదుపరి నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించుట లాభించును. కొత్త ఆలోచనలు గుర్తింపునిచ్చును. సృజనాత్మకత మేరుగుపరచుకుంటారు. ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు మాత్రం కొద్దిపాటి ఆందోళన కలిగించును. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించుట మిమ్మల్ని ఇబ్బంది పెట్టును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ నెలలో పితృ వర్గీయులకు ఆరోగ్య విషయంగా మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు, వ్యాపార వర్గం వారికి నష్టములు ఎదురగు సూచన. ఉద్యోగ జీవనంలో నైపుణ్యాన్ని పెంచుకోనవలెను. ధన ఆదాయం తగ్గును. వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి కృషి చేస్తారు. కుటుంబ ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు శ్రమతో కుడి ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ఈ మాసంలో వ్యాధి తీవ్రత అధికం అగు సూచనలు ఉన్నవి. వ్యక్తిగత జీవనం బాగుండదు. ఈ మాసంలో 5,6,12,13,19,29 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ నెలలో ప్రత్యర్ధుల వలన చికాకులు ఎదుర్కొంటారు. వాహనాల విషయంగా సమస్యలు ఉన్నవి. నేత్ర సంబంధ అనారోగ్యం కలిగిన వారికి సమస్య తీవ్రమగును. శస్త్ర చికిత్సకు దారి తీయును. ప్రయాణాలు అనుకూల ఫలితాలు కలుగచేయును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సేవకుల కోసం అన్వేషిస్తారు. ధనాదాయం ఆశించిన విధంగానే ఉంటుంది. నూతనంగా ప్రారంభించిన వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. నిర్లక్ష్య స్వభావం వలన నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ మార్పిడికి ఈ మాసంలో ప్రయత్నములు చేయకుండా వుండడం మంచిది. మొత్తం మీద ఈ మాసం సంతానం, వైవాహిక సౌఖ్యం వంటి వ్యక్తిగత విషయాల్లో అనుకూల ఫలితాలు ఏర్పరచదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ నెలలో వ్యాపార మరియు వృత్తి ఆధారిత జీవనదారులకు ఆశించిన లాభములు లభించును. ధనాదాయం బాగుండును. వంశ గౌరవం పెంచుతారు. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు కొనసాగును. ఉద్యోగంలో ఉత్సహపురిత వాతావరణం ఉంటుంది. గృహమార్పిడి ప్రయత్నాలు ఫలించును. ఆపదల నుండి తప్పించుకొందురు. మీ విరోదులపై విజయం కొరకు నీతినియమాలు ప్రక్కన పెట్టేస్తారు. విజయానందం కొరకు ఎంతటి వ్యయానికి ఐనా సిద్ధపడతారు. చివరి వారం ప్రారంభం నుండి భోగ భాగ్యములు అనుభవించెదరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X