India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగష్టు 2022 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews
Monthly Horoscope సెప్టెంబర్ మాసఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ నెలలో ఆగిపోయిన పనులు పునః ప్రారంభం చేయడానికి అనుకూల కాలం. వ్యాపార విస్తరణకు, నూతన ప్రయత్నాలకు, పరదేశ వీసా సంబందిత ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు ఈ మాసం మంచి అనుకుల కాలం. అయితే మేషరాశికి చెందిన చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నవి. కనిష్ట సోదరుల విషయంలో ఒక సమస్య ఉన్నది. 11 నుండి 15 వ తేదీల మధ్య కాలం రాజీ ప్రయత్నాలు చేయుటకు అత్యంత అనుకూల కాలం.

ఈ కాలంలో మిమ్మల్ని చిరాకు పరుస్తున్న విఘ్నాలు వాటంతట అవే తొలగిపోవును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో పై అధికారుల వలన ఒత్తిడులు లేదా అఖస్మిక ఉద్యోగ నష్టం. విలాస వస్తువులు కొనుటకు ఇది అంత అనుకూల మాసం కాదు. తీర్ధయతలు చేయడానికి కూడా ఈ మాసం అనుకూల కాలం కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఆంజనేయ స్వామి ఆరాధాన చేయండి. గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ మాసం అంత అనుకూల మాసం కాదు. ముఖ్యంగా సంతాన సంబందిత విషయాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం కొంత తగ్గుతుంది. హృదయ సంబంధ సమస్యలు కలిగిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్థి విషయాలకై బంధు వర్గం సహకారం అర్దిస్తారు. ఈ మాసంలో 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సులువుగా సమస్యలలో చిక్కుకుంటారు.

రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు తగ్గును. చివరి వారంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. కానీ కుటుంబ గౌరవ విషయంలో మీకు నచ్చని ఫలితాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఆశాభంగం కలుగచేస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన ఉద్యోగం పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణములు చేయుట వలన ధన వ్యయం ఏర్పడుటకు అవకాశం కలదు. ద్వితీయ వారంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్య బాధించును. ఉద్యోగ జీవులకు వారు పనిచేయు కార్యాలయాలలో తోటి ఉద్యోగులతో శత్రుత్వాలు, వివాదాల వలన చికాకులు ఉన్నవి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మిత్రుల విషయంలో అతినమ్మకం వలన నష్టం ఎదురగును. సమయ పాలనలో విఫలమగుట వలన ఉన్నత అవకాశములను కోల్పోతారు.

చివరి వారం నివాస సంబంధ స్థాన మార్పు, లేదా ఉద్యోగ మార్పుల కొరకు ప్రయత్నములు చేయుటకు అనుకూలమైనది. కుటుంబ జీవనంలో స్త్రీలకు శ్రమ అధికం అవుతుంది. వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేరు. జీవిత భాగస్వామితో మానసిక దూరం పెరుగుతుంది. పరిహారము: వినాయకుడిని ఆరాధించండి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ నెలలో ప్రారంభంలో ధన వ్యయం అధికం అవుతుంది. గృహ వాతావరణంలో మానసిక అశాంతి బాధిస్తుంది. బంధువులతో అనవసర వివాదాలు ఎదురవుతాయి. వృధా ధన నష్టం వలన బాధపడతారు. నూతన ఋణాలు దొరుకుట కష్టం. అధికంగా విఘ్నాలు ఎదురగుచుండును. ఉద్యోగ జీవనం లోని వారికి అవిశ్రాంత శ్రమ ఎదురగును. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అనేక ఆటంకాలు ఎదురగును.

మాసం ద్వితియార్ధం నుండి ఆర్ధికంగా కార్యానుకులత ప్రారంభం అవుతుంది. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత ఉన్నతికి కారణమగు మార్పులు ఎదురగును. వ్యాపార వ్యవహారములు మాత్రం కొంచం మందగమనంతో కొనసాగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యత ఉండదు. మాసాంతానికి ఖర్చులు అదుపులోకి వచ్చును. పరిహారము: నువ్వులు కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ నెలలో అన్ని విధములా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అన్ని వర్గముల వారికి ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో మిక్కిలి సౌఖర్య వంతమైన జీవితం లభిస్తుంది. వృత్తి మరియు వ్యక్తిగత జీవన సంతోషాలు ఆశించిన విధంగా పొందగలుగుతారు. భవిష్యత్ పరిణామాలు ఊహించగలుగుతారు. క్రీడారంగం లోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి.

తృతీయ వారంలో ఎదురగు నూతన పరిచయాలు ఉత్తమ దీర్ఘకాలిక మైత్రి సంబంధాలకు దారితీయును. సంతాన ప్రయత్నాలు అనుకూలించును. జీవన మార్గంలోని అవరోధాలు వాటంతట అవే తొలగిపోయే గ్రహ బలాలు ఈ మాసంలో ఉన్నవి. పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదివారం పఠించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ నెలలో కళాకారులకు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. ధన వ్యయం కొంచెం అదుపు తప్పుతుంది. ప్రధమ మరియు ద్వితీయ వారములు సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నములకు అనుకూలమైనవి. గృహంలో ఒక ఆరోగ్య సంబంధ ఆందోళన ఏర్పడు సూచన ఉన్నది. ఎదురుచూస్తున్న ఉద్యోగ ఉన్నతి గురించిన సమాచారంలో నిరాశ. 10 నుండి 16 వ తేదీల మధ్య కాలం సొంత గృహ నిర్మాణ లేదా కొనుగోలు ప్రయత్నాలు లాభించును మరియు మైత్రీ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. తృతీయ వారం తదుపరి విజ్ఞాన శస్త్ర పరంగా నూతన అంశాలు నేర్చుకుంటారు.

మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. మాసాంతం వరకు ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. పరిహారం: ఆవుకు ప్రతిరోజూ పచ్చి మేత తినిపించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో ప్రారంభించిన పనులు ప్రారంభంలో ఆటంకములు ఎదుర్కొని చివరికి కష్టం మీద పూర్తి అగును. అకారణంగా అనుమానించబడు సంఘటనలు ఎదురగు సూచన ఉన్నది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు ఏర్పడును. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ఉద్యోగ జీవనం కుడా సామాన్య యోగంతో కొనసాగును. ఈ మాసంలో స్పెక్యులేషన్ పరంగా పెట్టుబడులు లాభించవు. 24 నుండి 28 వ తేదీ మధ్య కాలంలో చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నవి. పరిహారం: ప్రతిరోజూ శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ నెలలో ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ముఖ్యంగా 10వ తేదీ నుండి 16వ తేదీ మధ్య ఆరోగ్య పరంగా జాగ్రత్త పడాలి. పెద్ద వయస్సు స్త్రీలకు మూత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులు ఎదురగును. ఈ మాసంలో ధనాదాయం కూడా కొంత తగ్గును. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గును. లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయలేరు.

మానసిక ఏకాగ్రత కోరవడును. ఒంటరిగా, ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు ఎదురగు సూచన ఉన్నది. నూతన వ్యక్తులతో మాటలడునప్పుడు లేదా వ్యవహరించుటలో జాగ్రత్త అవసరం. 23 వ తేదీ తదుపరి దూర ప్రయాణాలు లాభించును. సామాన్య జీవన యోగములు సిద్దించును. పరిహారము:రోజూ హనుమాన్ చాలీసా చదవండి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన ధనం చేతికి వచ్చును. వివాదాలు తొలగును. వైద్యులకు ధనాదాయం చాలా బాగుండును. నూతన పెట్టుబడుల నుండి రాబడి పెరుగును. కుటుంబ శుభాకర్యములలో పాల్గొంటారు. మాస మధ్యమంలో నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. పని చేయు కార్యాలయంలో వృధా ప్రసంగాలు ఇబ్బందులను ఏర్పరచును.

ఇతరుల పని భారం కూడా మీపై పడుతుంది. ఈ మాసంలో దురలవాట్ల నుండి బయట పడతారు. వ్యక్తిగత అలవాట్లలో మార్పులు ఏర్పడును. ఈ మాసంలో 5,6,7,8 తేదీలు సంతాన సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనవి. వడ్డీ వ్యాపారాలు చేయు వారు భారీ ఋణాలు ఇచ్చు ఆర్ధిక సంబంధ విషయాలలో జాగ్రత్త పడుట మంచిది. పరిహారము:అరటి చెట్టును పూజించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ నెలలో వివాహ సంబంధ ప్రయత్నాలకు తగిన గ్రహ బలాలు లేవు. జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురగు సూచనలు ఉన్నవి. భాత్రు వర్గంతో సఖ్యత పెరుగుతుంది. ప్రధమ వారం సంతాన ప్రయత్నాలు చేయువారికి కలసివస్తుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి.

ధనాదాయం సామాన్యం. ద్వితీయ లేదా తృతీయ వారాలు గృహంలో ఒక శుభ కార్యం వలన సందడి నెలకొంటుంది. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. 20,21,22 తేదీలలో నూతన పరిచయాలు లేదా పెద్దల సహచర్యం లభిస్తుంది. నూతన పదవులు ఆశిస్తున్న వారికి ఈ మాసం మనోవంచ ఫలసిద్ధి లభింపచేస్తుంది. పరిహారం: శనిని ఆరాధించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ నెలలో నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు అనుకూలమైన గ్రహ బలాలు కలవు. వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా ఉండును. వైవాహిక జీవనంలో మాత్రం కొద్దిపాటి అసంతృప్తి ఎదురగును. నూతన దంపతుల మధ్య వివాదాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా ఈ మాసం సమస్యలను తగ్గిస్తుంది. మాస ద్వితియార్ధంలో ప్రయాణాలు లాభపురితంగా ఉండును, విదేశీ సంబంద ఆదాయానికి, ఉద్యోగంలో అనుకూల మార్పునకు, నూతన యంత్రాల కొనుగోలుకు అనువైన కాలం.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. పరిహారము: రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ నెలలో సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన కలిగి ఉంటారు. వైవాహిక సౌఖ్యం పొందుదురు. సోదరి వర్గం వారికి మీ సహాయం అవసరం అవుతుంది. వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్టితులు ఏర్పడతాయి. వ్యాపార, వృత్తి జీవనం చేయువారికి ఆదాయం సామాన్యం. తృతీయ వారంలో అనగా 16 నుండి 23 వ తేదీల మధ్య ప్రయాణాలు, తలపెట్టు నూతన ప్రయత్నాలు ఫలవంతం అగును.

పనులు సకాలంలో పూర్తి అగును. ఆర్ధికంగా వృద్ధి చెందుతారు. చివరి వారంలో నూతన వాహన భాగ్యం లేదా విలాసకర దూర ప్రాంత విహారయాత్రలు ఏర్పడతాయి. సమస్యలను ఎదుర్కోవచ్చు. పరిహారం: విష్ణువును పూజించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X