• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగష్టు 2019 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

By Staff
|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

మేషరాశి

ఈ నెలలో బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం, చికాకులు ఎదుర్కుంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యానాలు మీ ఉన్నతికి భంగం కలిగించవచ్చు. జాగ్రత్త వహించండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వ్యయాల్లో అంచనాలు ఫలించవు. ఖర్చులు అధికం. అవసరాలు అతికష్టంమీద నెరవేరగలవు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. అధికారుల ఆగ్రహావేశాలకు గురయ్యే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృషభరాశి

వృషభరాశి

ఈ నెలలో ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల ప్రశంసలందుకుంటారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆశాజనకం. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి అభివృద్ధి దిశగా ఆలోచనలుంటాయి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్త్రీలకు వాహనయోగం,వస్త్ర ప్రాప్తి.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి

మిథునరాశి

ఈ నెలలో పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. దుబారా ఖర్చలు అధికం. చేతిలో ధనం నిలబడదు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసలందుకుంటారు. ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం, శుభకార్య యత్నాలకు శ్రీకారం చుదతారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం.అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది,

కర్కాటకరాశి

కర్కాటకరాశి

ఈ నెలలో నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలబడదు. అవసరాలు, చెల్లింపులు వియిదా వేసుకుంటారు. కీలక వ్యవహారాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. హామీలు, మద్య వర్తిత్వాలకు దూరంగా ఉండాలి.ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి.దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహం రాశి :

సింహం రాశి :

ఈ నెలలో రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంప్రదింపులు, కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పత్రాలు, నగదు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వాహనయోగం, సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.

కన్యారాశి

కన్యారాశి

ఈ నెలలో వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఆత్మీయులను దైవకార్యాలు, విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి.క్రీడ, కళా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రయాణం తలపెడతారు.పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి

తులారాశి

ఈ నెలలో కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం,వాహనయోగం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగుతాయి. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. వాహన చోదకులకు కొత్త చికాకులెదురవుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

ఈ నెలలో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లు, సకాలంలో ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. దంపతుల మద్య అవగాహన నెలకొంటుంది. సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. ఊహించని ఖర్చులెదురవ్వటంతో మీ చేతిలో ధనం నిలువదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయంలోను తొందరపడవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఆత్మీయులను దైవకార్యాలు, విందులకు ఆహ్వానిస్తారు. పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి

ధనుస్సురాశి

ఈ నెలలో ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పదువులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. స్థిరాస్తి క్రయ విక్రయంలో ఆటంకాలు తొలగుతాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో విలువైన వస్తువులు జాగ్రత్త.పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరం

మకరం

ఈ నెలలో నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. దాయం సంతృప్తికరం, రుణ విముక్తి, కొత్త రుణాలు మంజూరవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం, వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, నగదు, పత్రాలు జాగ్రత్త. విద్యార్థులకు విదేశీ చదువులు అనుకూలిస్తాయి.వివాదాలు కొలిక్కి వస్తాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి

కుంభరాశి

ఈ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. ఎటువంటి సమస్యలనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వైద్యుల సలహా పాటించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సన్మానాలు, ప్రశంసలు అందుకుంటారు.పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి

మీనరాశి

ఈ నెలలో బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more