వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 2024 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Monthly Horoscope సెప్టెంబర్ మాసఫలాలు

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం ఆశించిన రీతిలో ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన లాభం కలుగుతుంది. స్ధిరాస్తి సంభందిత ఒప్పందాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. తెలుగు మాసాంతమున కుటుంబ సంబంధ వ్యవహారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ నెలలో అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో ఊహించని ఎదురుదెబ్బలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు శారీరక శ్రమ పెరుగుతుంది. శిరో, నేత్ర సంబంధిత సమస్యలు మరింత బాధిస్తాయి. బంధుమిత్రుల తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నిరుద్యోగులకు అనుకూలత ఉండదు. కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. మాసం చివరన సన్నిహితుల సహాయం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో జన్మరాశిలో వ్యయ స్థానంలో గ్రహ సంచారం వలన అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలు కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చు ఆదాయానికి మించుతుంది. గృహంలో శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతాన ప్రవర్తన కొంత ఆందోళనకు గురి చేస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాసాంతం లో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ నెలలో గ్రహ అనుకూలత వలన అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో జయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక అనుకూలతకలిగి దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. మాసాంతంలో కొందరిని నమ్మి సహాయంచేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తిగానిపూర్తికాని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. రావలసిన బకాయిలువసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా సహాయ పడతారు. వ్యాపారాలలో మంచి ఆలోచన జ్ఞానం తో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ నెలలో యందు అనుకూల గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక వివాదాలు నుండి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన పరిచయాలు వలన ఆర్ధికలాభాలు అందుతాయి. మాసం చివరలో ముఖ్యమైన పనుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో అంతగా అనుకూలించదు అష్టమ స్థానం లో గ్రహసంచారం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉన్నది. చేసే ప్రతి పనిలో శారీరక శ్రమ అలసట కలుగుతాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక గృహ మార్పులు చేస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా వృత్తి వ్యాపారాలలో చివరి వరకూ వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది. మాసం చివరన కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయాలలో కొంత ఉపశమనం కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా భయాందోళన కలుగుతాయి. ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. చేసే ప్రతి పనికి వివాదాస్పదంగా ఉంటుంది. ధన వ్యవహారాలు అనుకూలించవు. శారీరక శ్రమ పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలలో ఆర్ధిక పరమైన సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో ఆలోచనలు కలసిరావు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలలో లోపం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి మరింత కష్టపడాలి గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత అభివృధి చెందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు గూర్చి గృహంలో చర్చలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మాసం చివర శత్రు పరమైన సమస్యల వలన కొందరు చికాకులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ నెలలో అన్ని విధాలా బాగుంటుంది. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలానాలు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరన స్త్రీ సంబంధిత సమస్యలు కలుగుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ నెలలో మరింత అనుకూలంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట మీ మాటకు ఎదురు ఉండదు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మాసాంతమున అధికారులతో సమస్యలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ నెలలో కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో సౌఖ్యం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికర వాతావరణం ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు కలగవు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. మాసం చివరన జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X