• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Rasi Phalalu (7th Jul 2022) | రోజువారీ రాశి ఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ రోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ రోజు కీలక విషయాలలో అలోచించి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ రోజు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ రోజు వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :

ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతోదైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. దైవసేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. పాతమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశకలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ రోజు దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ రోజు వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
Daily horoscope for March 2020 – here’s what the stars have in store for you today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X