వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rasi Phalalu (18th APR 2024) | రోజువారీ రాశి ఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు,రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు,రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు పనిచెయ్యదు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ రోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. ఇంటా బయటా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ రోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ రోజు సన్నిహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ రోజు కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. బంధు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ రోజు దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. సంతాన విషయాలపై దృష్టి సారించడం మంచిది.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ రోజు కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు. క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
Daily horoscope for March 2020 – here’s what the stars have in store for you today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X