• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారఫలితాలు తేదీ 27 మే శుక్రవారం నుండి 2 జూన్ గురువారం 2022 వరకు

By Staff
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు, జైశ్రీమన్నారాయణ.

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ మనోగతాన్ని బం«ధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల ఆశయం ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం ఒక విషయంలో కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి.

రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం రుణభారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి.

వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం మొదట్లో కుటుంబసమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం, వైద్యసేవలు. వృథా ధనవ్యయం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సేవలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహంకొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The Astro Twins forecast every sign's horoscope for this week. Find out if love is in your future, if you're headed towards a change in your career, or how the planet's alignment will effect your outlook on life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X