వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారఫలితాలు తేదీ 15 మార్చి 2024 శుక్రవారం నుండి 21 గురువారం వరకు

By Staff
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రములు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. అందుతాయి విలువైన వస్తులాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వృధాఖర్చులు. కుటుంబంలో అకారణ వివాదాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దాయాదులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం, గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమౌతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమస్యలు అడిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహా సూచనలున్నవి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. బందువులతో స్వల్ప విభేదాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశములు దక్కుతాయి. వారం ప్రారంభంలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగుతుంది. అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప దన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. గృహమున వివాదాలు తప్పవు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The Astro Twins forecast every sign's horoscope for this week. Find out if love is in your future, if you're headed towards a change in your career, or how the planet's alignment will effect your outlook on life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X