వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్కాటక రాశి ఫలాలు 2017వ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్రేష 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము హి, హూ, హే, హో, డా, డీ, డూ, దే, డో అను అక్షరములలో ఒకటి అయినచో మీది కర్కాటక రాశి.

By Ankam Maruthi
|
Google Oneindia TeluguNews

పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్రేష 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము హి, హూ, హే, హో, డా, డీ, డూ, దే, డో అను అక్షరములలో ఒకటి అయినచో మీది కర్కాటక రాశి.

సింహ రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Cancer

1) 2017 జనవరి:

మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, అధికార అనుగ్రహం, చేయు వృత్తి-వ్యాపారములందు ధనాదాయం బాగుండుట, ఉద్యోగప్రాప్తి, క్రయవిక్రయముల వలన లాభము, సమయస్ఫూర్తి, యుక్తిగా వ్యవహరించుట, విలువైన వస్తు వస్త్రలాభము, స్త్రీ సౌఖ్యము, గృహ జీవితానందము, కుటుంబ సంతాన అభివృద్ధి, తలంచిన కార్యములు నెరవేరుట, పొత్తికడుపు నొప్పి, పీడకలలు, ఎముకలు విరుగుట.

2) ఫిబ్రవరి:

శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయము కలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది నమ్మిన వారి వలన మోసములు, ఉత్సాహము లేకుండుట, కళత్రమునకు, భార్యకు పీడ, అధికారుల వలన భయం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధములు, మనస్పర్ధలు, తాపము, బలహీనత, అవయవములకు నొప్పలు, సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి, శతృవులు మిత్రులగుట, తలంచిన కార్యములు నెరవేరుట.

3) మార్చి:

సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, అశుభవార్తలు వినుట, అధికారుల వలన మాటలు పడుట, అపనిందలు, పనివారల వలన చికాకులు, అన్నదమ్ములతో విరోధము, ప్రభుత్వాధికారుల వలన యిబ్బందులకు లోనవుట, నిరుత్సాహము, నూతన వ్యక్తులతో పరిచయములు, ప్రయాణములకు ఆటంకములు, అనవసర, కార్యాటంకములు.

4) ఏప్రియల్:

ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా యుండుట, పాత బాకీలు వసూలగుట, ధనలాభము, అన్యోన్య , ప్రభుత్వము వారి వలన పనులు నెరవేరుట, ఏ వృత్తి- ఉద్యోగ-వ్యాపారస్తులకైనా ధనము కలిసివచ్చుట, మానసిక, వ్యవహార జయం, ఉద్యోగలాభం.

5 వేు:

సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. అన్ని రంగముల వారికి ధనాదాయము బాగుండుట, వివాహాది శుభకార్యములు నెరవేరుట, భూ-గృహాదులను కొనుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయుట, వ్యాపారాభివృద్ధి, బంధు మిత్ర సమాగమము, నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, కుటుంబ వ్యవహారములు, కలహములు మధ్యవర్తుల ద్వారా పరిష్కారమగుట, ఆరోగ్యము బాగుండుట, అగ్నిభయం, ఆకస్మికముగా దెబ్బలు తగులుట.

6) జూన్:

శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి బంధువర్గము వారితో విరోధములు, విషజంతు భయం, ఎత్తు నుండి జారిపడుట, వాహన ప్రమాదములు, కొట్లాటలు, గాయములు, రక్త దర్శనం, అనారోగ్యం, అనవసర ధనవ్యయం, ప్రభుత్వ వ్యవహారములలో అనుకూలత, పాత బాకీలు, రావలసినవి వసూలగుట, సంఘములో గౌరవము, పలుకుబడి, స్థానచలనములు.

7) జూలై:

బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, మనస్సుకు స్థిమితము లేకపోవుట, వాదోపవాదములు, అకారణ కలహములు, వేళకు తిండి సరిగా తినకపోవుట, చిరుతిళ్ళు తినుట, వ్యసనములు, దుష్ట సహవాసములు, నూతన వ్యక్తులతో పరిచయములు, వ్యాపార-వ్యవహారములందు కలిసి రాకపోవుట, ఆలస్యము విూద పనులు నెరవేరుట, ఎంత సొమ్ము సంపాదించినా నిలపడకపోవుట.

8) ఆగష్టు:

ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును. వ్యాపారస్తులకు క్రయవిక్రయలాభం, ధనాదాయం బాగుండుట, శతృవులు మిత్రులగుట, లావాదేవీలలో కలిసివచ్చుట, శాస్త్ర సంబంధమైన విషయములు తెలుసుకొనుటలోను, పురాణములు వినుటయందు ఆసక్తి, సంఘములో గౌరవము, పలుకుబడిగల వ్యక్తులతో స్నేహలాభములు, మనస్సు నిలకడగా వుండకపోవుట, అనారోగ్యం.

9) సెప్టెంబరు:

రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, సాంఘికముగా గౌరవమర్యాదలు పొందుట, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి, బార్యాభర్తల అన్యోన్యత బాగుండుట, ప్రయాణములలో లాభం.

10) అక్టోబరు:

అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసము, అధికారానుగ్రహం, భార్యాపుత్రుల వల్ల సుఖ సౌఖ్యములు చేకూరుట, పెద్దల ఆశీస్సులు పొందుట, చేయు కృషి ఫలించుట, వ్యాపార వ్యవహార లాభం, ఏ వృత్తి వ్యాపారస్తులకైనా ధనలాభం, అన్నదమ్ములతోను, బంధువులతోను బేధాభిప్రాయములు, తరచు ప్రయాణములు చేయుట, శరీర ఆరోగ్యము బాగుండకపోవుట, నొప్పలు, జబ్బుపడుట.

11) నవంబరు:

ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును. భార్యా భర్తల మధ్య సఖ్యత లోపించుట, కుటుంబ కలహములు, స్థిరాస్తి తగాదాలు, మనస్థిమితము లేకుండుట, ప్రయాణములు చేయునప్పుడు మార్గమధ్యములో ఆటంకము లేర్పడి తిరిగివచ్చుట, రాబడికి మించిన ఖర్చులు, జాయింటు వ్యాపారస్తులకు బేధాభిప్రాయములు, బంధు వర్గములో ఆధిఖ్యత, అపనిందలు, అనారోగ్యం.

12) డిశంబరు:

ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. సంఘములో గౌరవము, పలుకుబడి, గృహమునందు వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధు మిత్ర సమాగమము, విందు వినోదములలో పాల్గొనుట, సంతాన కుటుంబవృద్ధి, వ్యాపార లాభం, ధనాదాయం, భార్య వలన చికాకులు, అనారోగ్యం, తలంచిన పనులలో విజయం సాధించుట, సంగీత సాహిత్యములయందు ఆసక్తి, పండితులను కలుసుకొనుట, పురాణములు వినుటయందు శ్రద్ధ, చెడు స్నేహములు, నమ్మిన వారి వలన మోసములు, చోరభయం కలుగును. కర్కాటక రాశి వారు అష్టమ కేతుదోష పరిహారమునకు కేతువునకు 7 వేలు జపం, ఉలవలు దానం లేక మంగళవారం ఉలవలు దానం. తృతీయ గురునకు మాసశివరాత్రికి మరియు సోమవారం ఈశ్వరాభిషేకం - గురువారం శనగలు దానం.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Get the complete year prediction for 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X