• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మకర రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

By Ankam Maruthi
|

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1,2 పాదములు మీ పేరులో మొదటి అక్షరము బో, జా, జి, జూ, జే, జో, ఖ, గ, గీ అను అక్షరములలో ఒకటి అయినచో మీది మకరరాశి.

కుంభ రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Capricorn Horoscope

1) 2017 జనవరి:

మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధన లాభము కలుగుతుంది, కొత్త స్నేహితులను కలుసుకొంటారు, గృహములో శుభవార్తలు వినుట, చేయు వృత్తి - వ్యాపార - ఉద్యోగములలో ఎన్ని అవాంతరములు కలిగినను నిగ్రహించుకు రాగలుగుతారు. అనుకోని సంఘటనలు జరుగుట, నెరవేరుట, ఉద్యోగస్తులకు స్థానచలనములు, జాయింటుదార్లతో మనస్పర్థలు, మనస్సుకు స్థిమితము లేకపోవుట, సంగీత సాహిత్యములయందు ఆసక్తి.

2) ఫిబ్రవరి:

వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, నూతన వ్యక్తులతో స్నేహలాభములు పొందుట, ఇతరులకు సహాయము చేయుట, దానధర్మములకు డబ్బు ఖర్చు పెట్టుట, వాదోపవాదములు జరుగుట, కోరు వ్యవహారములు, ప్రయాణములకు మార్గమధ్యములో ఆటంకములు, కుటుంబ సభ్యులతో విరోధములు, భార్యాభర్తల మధ్య కలహములు, మనస్సు పరిపరి విధముల ఊగిసలాడుట, వృత్తి - వ్యాపారములలో ఆటంకములను ఎదుర్కొనుట, సంతాన సమస్యలు.

3) మార్చి:

సజ్జనులస్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, చిక్కు సమస్యలు, కష్టములు తొలగుట, నూతన కార్యములు ప్రారంభించుట, పలుకుబడి - హోదా గల వ్యక్తుల ద్వారా పనులు నెరవేర్చుకొనుట, శుభవార్తలు వినుట, ఇదివరలో పడిన కష్టములు గట్టెక్కగలుగుట, చిక్కు సమస్యలు పరిష్కారమునకు రాకపోవుట, జీవనోపాధికి కావలసిన మార్గములు అన్వేషించుట.

4) ఏప్రియల్:

రాజానుగ్రహము పెద్దలఅనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు కలుగును. తలంచిన కార్యములు జయము, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులు కలియుట, సంఘములో గౌరవము, పలుకుబడి, ధనధాన్యావృద్ధి, వ్యాపార - వ్యవహారములయందు లాభం, అధికారానుగ్రహం, నూతన వస్తు వస్త్రలాభం, సంగీత సాహిత్యములయందు ఆసక్తి, తరచు ప్రయాణములు.

5) మే:

కష్టనష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళన కలుగుతుంది, వ్యాపార - వ్యవహారములయందు లాభం, ఊహించని పనులు నెరవేరుట, ఆటంకములు తొలగుట, చంచల మనస్సు, స్థిరాస్టి విషయంలో తగాదాలు, కోర్టుకు వెళ్ళవలసి వచ్చుట, కుటుంబ సభ్యుల వల్ల మనస్థాపం, వ్యసనములకు లోనగుట, వివాహాది శుభకార్యములు జరుగుట, వ్యయప్రయాసలు.

6) జూన్:

అవమానాలు ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చు పరిస్థితి ఏర్పడుతుంది, అకారణ కలహములు, ప్రతీ చిన్న విషయమునకు ఆందోళన చెందుట, తరచు ప్రయాణములు, చేయు వృత్తియందు, వ్యాపారములోను సానుకూలత లేకపోవుట, లాభములు సరిగా రాకపోవుట, నూతన కార్యములు ప్రారంభించుట, జీవనోపాధికి లోటు లేకుండా చూసుకొనుట, కష్టములు తొలగుట, ప్రముఖ వ్యక్తులతో పరిచయ భాగ్యం.

7) జులై:

దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము. మాటవిలువ తగ్గుట జరుగును. నమ్మిన వారి వలన మోసం, దగాలు పొందుట, ధన నష్టం, అధికారుల వలన భయం, స్థానచలనములు, భార్యాపిల్లలకు అనారోగ్యం, విరోధములు, మాట పట్టింపులు, ఏదో ఒక విధముగా సొమ్ము చేతికందుట, అప్పలు కొంత తీర్చుట, దంపతుల మధ్య అన్యోన్యత లోపించుట, పేరు ప్రతిష్టలు సంపాదించుట జరుగును.

8) ఆగష్టు:

ఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళతో విరోధములు, అశుభ వార్తలు వినుట, అధికారుల వలన జరగవలసిన పనులు ఆలస్యముగా, తలంచిన "కార్యములకు ఆటంకములు, మనస్సునకు ఆందోళన, వివాహాది శుభకార్యములు ఆలస్యమగుట, ఆకస్మిక ప్రయాణములు, ఎంత ఆదాయం వచ్చినా నిలపడకపోవట, వేళకు తిండి సరిగా తినకపోవట, అనారోగ్యం.

9) సెప్టెంబరు:

తల త్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, మానసిక ఆందోళన, భయం, బంధు మిత్ర విరోధములు, వృత్తి - వ్యాపారములలో లాభనష్టములు సమానముగా నుండుట, నూతన వ్యక్తులతో స్నేహము చేయుట, ప్రభుత్వ వ్యవహారములు కష్టముమీద నెరవేరుట, దూర ప్రాంతములకు వెళ్ళవలసి వచ్చుట, ఆర్థిక యిబ్బందులు తొలగుట. ఇతరుల వలన సహాయం.

10) అక్టోబరు:

ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. తలంచిన కార్యములు జయము, కుటుంబ సౌఖ్యం, చేయు - వ్యాపారములయందు లాభించుట, కలిసివచ్చుట, సంగీత సాహిత్యాది కళల యందు ఆసక్తి, శతృవులు మిత్రులగుట, స్త్రీ మూలక లాభం, పేరు ప్రతిష్టలు సంపాదించుట, వాహన ప్రాప్తి, దాన ధర్మములు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనములు.

11) నవంబరు:

తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, సంఘములో గౌరవము, పలుకుబడి, వృత్తిలో నైపుణ్యము, వ్యాపారలాభం, ధనాదాయం, గృహములో వివాహాది శుభకార్యములు జరుగుట, బంధుమిత్ర సమాగమము, పాత బాకీలు వసూలగుట, ఋణములు తీర్చుట, శరీర ఆరోగ్యము బాగుండుట, సమస్యలు పరిష్కారమగుట, వ్యవహార జయం, మనస్సుకు ఆనందము చేకూరును.

12) డిశంబరు:

ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. నూతన వ్యక్తులతో పరిచయములు, ఏజెన్సీలు తీసుకొనుట, వృత్తి -- వ్యాపారములలో ధన లాభమును పొందుట, గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేయగలుగుట, దాంపత్య సౌఖ్యం, దూరప్రాంతములకు వెళ్ళి ధనమును ఆర్థించుట, కొత్త పనులు ప్రారంభించుట, సకాలంలో పూర్తి చేయుట, సంతాన చికాకులు కలుగును. మకర రాశి వారు ఏలినాటి శనిదోష పరిహారమునకు శనికి 19 వేలు జపం - నువ్వులు దానం లేక శని త్రయోదశికి శనికి తైలాభిషేకం, నువ్వులు దానం. ఆంజనేయస్వామికి గంధ సింధూరముతో పూజించుట, కుక్కకు వడమాల వేసి గారెలు తినిపించుట, కాకులకు ఆహారము పెట్టుట.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Get the complete year prediction for 2017. Varshphalalu of your zodiac sign will help you. Year prediction of Capricorn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more