• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీన రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

By Ankam Maruthi
|

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము ది, దు, శ్యం, రూ, థ, దే, దో, చా, చి అను అక్షరములలో ఒకటి అయినచో.

మేష రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Pisces Horoscope

1) 2017 జనవరి:

అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, ఊహించని సంఘటనలు, మధ్యవర్తుల ద్వారా సమస్యలు అనుకూలముగా పరిష్కారమగుట, శతృబాధలు తొలగుట, సుఖ సంతోషములు, పశు పక్ష్యాదులను, జంతువులను విక్రయించుట వలన లాభము, ఆకస్మిక ధనలాభము, వాహనము కొనుట, శాస్త్ర సంబంధమైన విషయములయందు, పురాణములు వినుటయందు ఆసక్తి.

2) ఫిబ్రవరి:

మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి స్థానబ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, స్థిరాస్థి తగాదాలు, కోర్టుకు వెళ్ళవలసివచ్చుట, ప్రయాణములు చేయునప్పుడు మార్గమధ్యలో ఆటంకములు, ఋణము లభించుట, లోన్లు శాంక్షను అగుట, కుటుంబ వ్యవహారములు ఒక కొలిక్కి రాకపోవుట వ్యయప్రయాసలయినా కార్యానుకూలత, వ్యాపారాభివృద్ధి, అధికారానుగ్రహం, ధనలాభం, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, వ్యవసాయము ఫలించుట, సంఘములో గౌరవము, పలుకుబడి.

3) మార్చి:

బాధలు కలుగుతాయి, వృథా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టి తగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును. మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, బంధు మిత్ర కలహములు, చెడు వ్యసనములకు లోనగుట, అకారణ కలహములు, వివాహ విషయములో సంబంధములు దగ్గరకు వచ్చి తప్పిపోవుట, వ్యాపార వ్యవహారములలో ఆటంకములు, ఊహించిన లాభములు రాకపోవుట, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, దైవభక్తి, పుణ్యక్షేత్రములు సందర్శించుట, మంచిపనుల నిమిత్తము ధనము ఖర్చుపెట్టుట, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, అనారోగ్యం.

4) ఏప్రియల్:

శుభఫలములు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, నూతన వ్యక్తులు - గొప్పవారితో పరిచయం, క్రయవిక్రయ రీత్యా లాభం, తలంచిన కార్యములు విజయవంతమగుట, కుటుంబ సౌఖ్యం, పేరు ప్రఖ్యాదులు పొందుట, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, ప్రమోషను సాధించలేకపోవట ప్రయాణ ఆటంకములు పొందుట, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, ప్రమోషన్లు, శుభవార్తలు వినుట రాజకీయములలో రాణించుట, విలువైన వస్తువులు కొనుట.

5) మే:

ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీ సౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, భార్యాపుత్రుల వల్ల సుఖశాంతులు చేకూరుట, ఆరోగ్యము చక్కబడుట, సంఘములో గౌరవము, పలుకుబడి, బంధుమిత్రుల ఆదరాభిమానములు, వ్యాపారములో కలిసివచ్చుట, ధనలాభం, చిక్కు సమస్యల నుండి బయటకు రాగలుగుట, కోర్డు వ్యవహారములలో విజయమును పొందుట, శుభకార్యములు చేయుట, తరచు ప్రయాణములు.

6) జూన్:

పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు. గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవుట, కుటుంబ కలహములు, మనోవిచారము, చంచల మనస్సు, అధికారుల వలన భయం, సంగీత సాహిత్యములయందు ఆసక్తి, నూతన వస్తువస్రాభరణప్రాప్తి, ధనలాభం, ప్రయాణములు చేయునపుడు మార్గమధ్యములో ఆటంకములు, శరీరమునందు అనారోగ్యత, నొప్పలు, బాధపడుట.

7) జూలై:

షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధి కలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. బంధుమిత్రుల వలన ధనవ్యయం, వ్యాపార-వ్యవహారములందు లాభం, ధన విషయంలో ఏదో ఒక విధంగా సొమ్ముచేతికందుట, ధనధాన్య వృద్ధి, పిత్రార్జిత ఆస్తులు కలియుట, లోన్లు శాంక్షను అగుట, ప్రభుత్వ కార్యకలాపములలో విజయము సాధించుట, పెండింగు పనులు చురుకుగా ముందుకుసాగుట, పనులవత్తిడి వలన అప్పడప్పుడు శరీర ఆయాసం.

8) ఆగషు:

అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులు చేస్తారు, భయము కలుగుతుంది, సంసార సౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమ చేస్తారు. తలంచిన కార్యములు, మనస్సుకు చేకూరుట, భయాందోళనలు లేకుండుట, సంతాన కుటుంబవృద్ధి, బంధు వర్గములో ఆధిఖ్యత, స్థిరాస్థి విషయంలో తగాదాలు, ప్లానులు వేయుట, పలుకుబడితో పనులు నెరవేర్చుకొనుట, వ్యాపారములలో లాభించుట, ముందుకు వెళ్ళట, పొత్తికడుపు వద్ద నొప్పి.

9) సెప్టెంబరు:

శ్రమకరమైన ప్రయత్నాలు చేస్తారు, భార్య ఇబ్బందులు కలుగుతాయి, సంతానానికి అనారోగ్యత కలుగుతుంది, ఉత్సాహం భంగమవుతుంది, బంధు ద్వేషము కలుగుతుంది, నమ్మినవారి వలన మోసములు, దగా పొందుట, సంతాన కుటుంబ చిక్కులు, మాట పట్టింపులు, విరోధములు, ఏ పని చేయుటకు ఉత్సాహము లేకుండుట, పురాణములు వినుటయందు, శాస్త్ర సంబంధమైన విషయములయందు ఆసక్తి, ఉపన్యాసములకు వెళ్ళట, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, ఎడబాటు, గృహంలో మార్పులు చేయుట.

10) అక్టోబరు:

మిక్కిలి అనుకూల స్థానం షష్ఠం, శత్రువులు నశిస్తారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది, కార్యసాధన కలుగతారు, దుఃఖములు తగ్గుతాయి, అశుభవార్తలు వినుట, తక్కువ వారి వలన మాటలు పడుట, అపనిందలు, అధికారులతో విరోధము, ప్రమోషన్లకు ఆటంకములు, సుఖ సౌఖ్యములు లేకపోవుట, ఎప్పడూ విచారముగా వుండుట, ఒకరిమాట ఒకరికి నప్పకపోవుట, ఎందులోను కలిసిరాకపోవుట, జాయింటుదార్లలో మనస్పర్ధలు, రహస్యాంగములకు బాధలు.

11) నవంబరు:

మిక్కిలి దోషప్రదమైన స్థితి ఇది మనస్తాపము కలుగుతుంది, విరక్తి చెందుతారు, చేతగానివిధమగా వుంటుంది, మిత్రుల ద్వారా కష్టము పొందుతారు, ఏ పని చేసినా లాభనష్టములు సమానముగా నుండుట, అనవసర ధనవ్యయం, తండ్రిగారికి అనారోగ్యం, కష్టము విూద ఆలస్యముగా పనులు నెరవేరుట, నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, పాత బాకీలు వసూలగుట, వ్యాపారస్తులకు నిరుత్సాహము, అభివృద్ధిని సాధించలేకపోవుట, ప్రయాణ ఆటంకములు.

12) డిశంబరు:

గృహ సంబంధమైన చికాకులు ఏర్పడతాయి, అశాంతి ఏర్పడుతుంది, సౌఖ్యం లోపిస్తుంది, హృదయ సంకటం కలుగుతుంది, వ్యాధి కలుగుతుంది, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, వ్యాపారవ్యవహారలాభం, ధనలాభం, శతృవులు మిత్రులగుట, స్త్రీల వలన ఉపకార లాభములు పొందుట, గృహమునందు వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, ఉన్నతాధికారుల వలన, ఆరోగ్యము కొంత నయమనిపించును. మీనరాశివారు కేతుదోష పరిహారమునకు మంగళవారం ఉలవలు దానం చేయాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Get the complete year prediction for 2017. Varshphalalu 2017 of your zodiac sign will help you. Year prediction of Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more