keyboard_backspace

ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని లక్షల మంది దీని బారిన పడి మృతి చెందారు. భారత్‌లో కూడా రోజు రోజుకూ ఈ వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాంతరాలకు వ్యాపించింది. ఇక కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైంది. అంతేకాదు కొన్ని దేశాలైతే ఆర్థికంగా కూడా బాగా చితికిపోయాయి. ఇక భారత్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. భారత్‌లో మాత్రం కరోనావైరస్‌తో బాగా ఇబ్బంది పడిపోయింది మాత్రం పొట్ట చేత పట్టుకుని పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించగా వారికి పనులు లేక చాలా ఇబ్బంది పడిపోయారు.

దీంతో సొంతూళ్లకు వెళ్లాలని భావించి కొందరు కాలినడకన బయలు దేరి మార్గ మధ్యంలోనే మృతి చెందారు. పరిస్థితి దారుణంగా తయారువుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలసకూలీల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకు తరలించే కార్యక్రమం చేసింది. అంతేకాదు వారి సొంతూళ్లలోనే పనికల్పించే ఉపాధి పథకంను తీసుకువచ్చింది కేంద్రం.

ఇదంతా ఒకలా ఉంటే... కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారిని చాలా హాస్పిటల్స్ చికిత్స చేసేందుకు ముందుకు రావడం లేదు. కనీస మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నట్లు పలువురు ఫిర్యాదులు చేయడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా కూడా వీడియోలను పోస్టు చేశారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. ఢిల్లీలో ఇలాంటి పరిస్థితే తలెత్తగా అలా కోవిడ్-19 పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వని హాస్పిటల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు కూడా.

List Of COVID-19 Hospitals In Andhra Pradesh that fall under Aarogya Sri scheme

ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పేషెంట్లు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తన తండ్రికి చెబుతూ ఓ వీడియోను పోస్టే చేయగా అది వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే అక్కడి ప్రభుత్వం కరోనావైరస్ కట్టడికి టెస్టులను పెంచింది. ఎంతలా అంటే దేశంలోనే కరోనా పరీక్షల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక తాజాగా జగన్ సర్కార్ కరోనావైరస్‌ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధికిందకు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం చేయని సాహసం చేసింది. ఇక పై కరోనావైరస్ చికిత్స ఆరోగ్యశ్రీ కిందకు రానుంది. దీనివల్ల చాలామంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పరిధిలో కరోనా వైరస్ చికిత్స అందజేసే హాస్పిటల్స్ జాబితా విడుదలైంది. హాస్పిటల్స్‌ను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. వైరస్ మరింత తీవ్రతగా ఉంటే చికిత్స అందించే హాస్పిటల్స్‌ను కేటగిరీ -1 కింద చేర్చడం జరిగింది. వైరస్ స్థాయి ఒక పరిమితి వరకు ఉంటే వాటికి చికిత్స అందించే హాస్పిటల్స్‌ను కేటగిరీ-2 కింద చేర్చగా... కోవిడ్-19 అనుమానిత కేసులకు చికిత్స అందించే హాస్పిటల్స్‌ను కేటగిరీ-3 కింద చేర్చడం జరిగింది. ఇక ఆయా జిల్లాల్లో ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందజేసే హాస్పిటల్స్ జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.

English summary
A list of Covid -19 treatment hospitals that fall under Aarogyasri has been released
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X